Friday

అణు భద్రత లేని భారతం...!


పారదర్శకతలో బలహీన విధానాలు
అనుమానాలు రేపుతున్న గోప్యత

అందుకే.. 32 దేశాల్లో 28 స్థానానికి పతనం
అణు మప్పుపై అవగాహన సంస్థ జాబితా విడుదల
ముందు ఆస్ట్రేలియా.. అట్టడుగున ఉత్తర కొరియా
వెనక నుంచి రెండో స్థానంలో పాక్..
వెనకబడిన అగ్రదేశాలు
పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం పై కూర్చున్న ప్రమాదకర దేశంగా పాకిస్థాన్‌ను అభివర్ణించడం పరిపాటే. ఆ దేశంలో క్షణక్షణానికి మారే రాజకీయ పరిణామాలనే కాదు..అణు భద్రత తీరుకూ అద్దం పట్టే వ్యాఖ్యానమిది. ఐతే, అమెరికాకు చెందిన అణు ముప్పు అవగాహన సంస్థ విడుదల చేసిన జాబితాను చూస్తే, ఈ భాష్యం పాక్‌కే కాదు.. భారత్‌కూ అన్వయిస్తుందనిపిస్తోం ది.

వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వతంత్ర సంస్థ, ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 32 అణు సంపన్న దేశాల్లో అణు భద్రత తీరుతెన్నులపై అధ్యయనం జరిపి ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ వెనక నుంచి మొద టి వరసలో నిలిచింది. అణు భద్రతకు పెద్దపీట వేస్తున్న దేశంగా ఆస్ట్రేలియా తొలి స్థానంలో నిలవగా, ఉత్తర కొరియా అట్టడుగుకు చేరింది. దాని కన్నా కాస్త పైన భారత్(28) ఉంది. అదే వరసలో చైనా(27), ఇజ్రాయెల్(25) నిలిచాయి.

అణు పరికరాలు, వాటి భద్రత విషయం లో ఈ నాలుగు దేశాలు అతి గోప్యత, అతి తక్కువ పారదర్శకతను ప్రదర్శిస్తున్నాయని సంస్థ ఉపాధ్యక్షుడు పేజ్ స్టట్‌ల్యాండ్ వెల్లడించారు. మన పొరుగుదేశం పాక్ మరింత దిగజారి చివరి నుంచి రెండోస్థానం(31)లో నిలిచింది. "భారత్ వంటి దేశాల్లో అణు తనిఖీలకు అవకాశం ఉండటం లేదు. అవి పూర్తి గోప్యతను పాటిస్తున్నాయి. దాం తో వాటి అణు పరికరాలు, ఆయు«ధాలపై అంతర్జాతీయంగా విశ్వాసం సన్నగిల్లుతోంది'' అని వివరించారు.

అణ్వాయుధాల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన మెరుగైన జాగ్రత్తలపై ప్రపంచ దేశాలకు అవగాహన కలిగించే లక్ష్యంతో మాజీ సెనేటర్ సమ్ నన్, ఆర్థిక నిఘా విభాగం సంయుక్తంగా ఈ సంస్థను నెలకొల్పాయి. తొలి విడతగా బుధవారమిక్కడ 32 దేశాల జాబితాను విడుదల చేశాయి.

పారదర్శకత కోణంలో భారత్ బాగా వెనకబడిపోయినట్టు స్టవుట్‌ల్యాండ్ వివరించారు. అదే భారత్ సరైన పారదర్శన విధానాలు పాటించి ఉంటే, నిర్దేశిత ప్రపంచ నియమాలను పాటిస్తున్న దేశాల విభాగంలో చేరి తన స్థానాన్ని మెరుగుపరుచుకునేదని తెలిపారు.

0 comments:

Post a Comment