Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Sunday

పశువుల నుంచి సోకే బ్రూసెల్లా

పశువుల నుంచి మనుష్యులకు సోకే వ్యాధులను జూనోటిక్‌ వ్యాధులని అంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైంది బ్రూసెల్లా. ఇది రెండు రకాలు. బ్రూసెల్లా అబార్టస్‌, బ్రూసెల్లా మెలిటెన్సిస్‌. వీటిలో బ్రూసెల్లా మెలిటెన్సిస్‌ అతి ప్రమాదకారి.

వ్యాప్తి చెందు విధానం:
  • వేడి చేయని పాలు (పచ్చిపాలు) తాగడం ద్వారా
  • తెగిన చర్మం గుండా శరీరం లోకి చొచ్చుకుపోవడం ద్వారా కళ్ళలోకి పోవడం
  • వ్యాధికారకంతో కలుషితమైన గాలి పీల్చడం ద్వారా
  • పరిశోధనశాలలో కలుషితమైన వస్తువుల ద్వారా
  • వృత్తిపరంగా రైతులు, పశువైద్యులు, కసాయి వారి ద్వారా
  • వ్యాధి లక్షణాలు:
  • దీర్ఘకాలికమైన తీవ్ర జ్వరం
  • కీళ్ళనొప్పులు
  • చేదు వాపు
  • వెన్ను కింది భాగంలో నొప్పి
  • రాత్రి పూట చెమటలు పట్టడం
  • దగ్గు, శ్వాస ష్టమవడం
  • పొట్టలో నొప్పి, వాంతులు
  • ఈ లక్షణాలు కన్పించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.
Read more >>

పురుషుల్లో సంతానలేమి

సంతాన రాహిత్యం అంటే ఏమిటి?
30Feభార్యాభర్తలు ఒక సంవత్సరపు వైవాహిక జీవితం ఏ గర్భ నిరోధకం లేకుండా జరిగిన తర్వాత కూడా సంతానం కలుగకపోతే దానిని సంతానరాహిత్యం లేక సంతానలేమి అని అంటారు.

సంతాన సాఫల్య సమస్యలు - విభజన:
  • మగవారిలోని సమస్యలు - 40%
  • ఆడవారిలోని సమస్యలు - 40%
  • ఇద్దరిలోని సమస్యలు -10%
  • తెలియని కారణాలు - 10%
  • 30Fea-Fమగవారిలోని సంతాన సాఫల్యం సమస్యలు, వాటికి ఆధునిక హోమియో చికిత్స గురించి తెలుసుకుందాం.వీర్యం మామూలుగా ప్రతి మగవారిలోనూ 3-6 మిల్లీలీటర్లు ఉత్పత్తి అవు తుంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉం టాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. ప్రతి వీర్య కణం విడుదల అయిన తర్వాత చాలా చురుకుగా ముందుకు సాగిపోతూ ఉం టుంది. మామూలు వీర్యంలో దాదాపుగా 60 నుండి 70 శాతం చురుకుగా కది లే వీర్యకణాలు ఉంటాయి.80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి.పైన చెప్పిన విధంగా వీర్యం వీర్యకణాలను కలిగిఉంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు. మామూలు వీర్యంలోని విభజన ఈ విధంగా ఉంటుంది.
    • వీర్యం ఉత్పత్తి - 3 నుండి 6 మిల్లీలీటర్లు
    • వీర్యకణాల సంఖ్య - 60 నుండి 150
      మిలియన్లు
    • వీర్యకణాల కదలిక - 60 నుండి 70 శాతం (చురుకైనవి)
    • మామూలు ఆకృతి - 80 శాతంపైన
    • మగవారి సంతానలేమి కారణాలు:
      • హార్మోన్ల లోపం. మానసిక ఒత్తిడి.
      • వెరికోసీల్‌.
      • ధూమపానం, ఆల్కహాల్‌ తీసుకోవడం.
      • బీజం (ఖ్ఛీట్టజీట) లోని వివిధ కారణాలు.
      • అంగస్థంబన సమస్యలు. పుట్టుకతో వచ్చే లోపాలు.
      • పరీక్షలు: 1. వీర్య పరీక్ష (ట్ఛఝ్ఛ ్చ్చజూడటజీట). 2. వీర్యంలోని క్రిముల నిర్ధారణ పరీక్ష. 3. అల్ట్రాసౌండ్‌ ద్వారా బీజం చూసి నిర్ధారించడం. 4. బీజంలో నుండి ఒక చిన్న ముక్క తీసి పరీక్షించడం. 5. హార్మోన్ల నిర్ధారణ పరీక్ష. మగవారి సమస్యలు - ఆధునిక హోమియో చికిత్స: sperm1హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ నందు పైన చెప్పి వివిధ రకాలైన కారణాలకు ఆధునిక హోమియో చికిత్స అందుబాటులో ఉంది. హోమియోపతి వైద్యంలో 30 సంల అనుభవం, నిపుణతే కాకుండా 15 సంవత్సరాల సంతాన సాఫల్య సమస్యలలో రిసెర్చ్‌ అనుభవం కలిగి ఉండడం, అంతర్జాతీయ ప్రమాణాలతో జర్మని మరియు స్విర్జర్లాండ్‌ మందుల ద్వారా పురుషుల సంతాన సాఫల్య సమస్యలకు హోమియో మందులు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదట రోగి యొక్క మొత్తం సమస్యలను వివరంగా అడగటం, రోగికి ఏ సమస్యల వల్ల ఈ సంతానలేమి కలుగుతుందో కనుకోవడం.వాటి కోసం పైన చెప్పిన పరీక్షలను అవసరమైతే చేయించడం జరుగుతుంది.మానసిక ఒత్తిడి కలిగే వారికి వారి పూర్తి వివరాలను అడిగి మానసికి ఒత్తిడి తగ్గించే హోమియో ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది.హార్మోన్ల లోపం ఉన్న వారికి ఏ హార్మోన్‌ లోపం ఉన్నదో కనుక్కొని,ఆ హార్మోన్‌ని శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది.ధూమపానం, ఆల్కహాల్‌, రేడియేషన్‌ లాంటి వాటివల్ల సంతానలేమి ఉన్న వారికి పై వాటి ప్రభావం పోవడానికి మరియు డీ అడిక్షన్‌ చికిత్స (ధూమపానం, ఆల్కహాల్‌ మానుటకు చికిత్స) ఇవ్వడం జరుగుతుంది. sperm2వెరికోసిల్‌ బీజంలో విర్యకణం ఎదుగుదల సమస్యలకు హోమియోకేర్‌లోని సంతాన సాఫల్య రిసెర్చ్‌ గ్రూపు వైద్యులు ఆ రోగిని క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్య నివారణకు ప్రత్యేక హోమియో మందులు ఇవ్వడం జరుగుతుంది.అంగస్థంభన సమస్యలకు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి మంచి మందులు ఇవ్వబడతాయి.కనుకపై చికిత్సలలో అత్యంత అనుభవం ఉండి, భారతదేశంలోనే అతిపెద్ద హో మియో సంతాన సాఫల్య అధునాతన క్లీనిక్‌ హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌. ఆధునిక మందుల ద్వారా మంచి పరిష్కారం దొరుకుతుంది. హోమియో చికిత్స: పురుష సంతాన సమస్యలకు హోమియోలో అద్భుతమైన చికిత్స వుంది. ముఖ్యంగా లైకోపోడియం, సెపియ, సైలిసియ, యసిడ్‌ఫ్లోర్‌, మెడొరినం, ధుజ, ఆగ్నస్‌ కాక్టస్‌ మరియు శారీరక, మానసిక లక్షణాలను బట్టి ఇంకా చాలా మం దులు ఉన్నాయి. ఈ సమస్యకు ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే అంత త్వరగా సత్ఫలితాలు పొందేందుకు వీలుంటుంది. మొట్టమొదట రోగి యొక్క మొత్తం సమస్యలను వివరంగా అడగటం, రోగికి ఏ సమస్యల వల్ల ఈ సంతానలేమి కలుగుతుందో కనుకోవడం. వాటి కోసం పైన చెప్పిన పరీక్షలను అవసరమైతే చేయించడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి కలిగే వారికి వారి పూర్తి వివరాలను అడిగి మానసికి ఒత్తిడి తగ్గించే హోమియో ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది. హార్మోన్ల లోపం ఉన్న వారికి ఏ హార్మోన్‌ లోపం ఉన్నదో కనుక్కొని,ఆ హార్మోన్‌ని శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వీర్యకణాలసమస్యలు 1. అజుస్పెర్మియా(అౌౌ్డటఞ్ఛటఝజ్చీ): వీర్యంలో వీర్యకణాలు అసలు లేకపోడాన్ని అజూస్పెర్మియా అంటారు. ఈ వీర్యం నీటివలే, అతి పల్చగా ఉంటుంది. 2. అలిగోస్పెర్మియా(ైజూజీజౌటఞ్ఛటఝజ్చీ): ఈ వీర్యంలో వీర్యకణాల సంఖ్య 60 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది. 3. ఆలిగోఅస్చినోస్పెర్మియా(ైజూజీజ్చౌటఛిజిౌ్ఛటఞ్ఛటఝజ్చీ): వీర్యకణాల సంఖ్య మరియు కదలిక కూడా తక్కువగా వుంటాయి. వీర్యం మామూలుగా ప్రతి మగవారిలోనూ 3-6 మిల్లీలీటర్లు ఉత్పత్తి అవుతంది. ఈ వీర్యంలో దాదాపు 60 నుండి 150 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉంటాయి. ప్రతి వీర్యకణం విడుదల అయిన తర్వాత చాలా చురుకుగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. మామూలు వీర్యంలో దాదాపుగా 60 నుండి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలు ఉంటాయి. 80 శాతం వీర్యకణాలు మామూలు ఆకృతిని కలిగి వుంటాయి.
Read more >>

మధుమేహం వివిధ రకాల పరీక్షలు

పరగడుపున (ఫాస్టింగ్‌)
dayabetsఈ పరీక్షకోసం ఉదయం లేస్తూనే 6-8 గంటల మధ్య శాంపిల్‌ ఇవ్వాలి. రాత్రంతా పడుకుని ఉంటాము కాబట్టి ఉదయాన లేవగానే రక్తంలో గ్లూకోజ్‌ స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో పరీక్ష చేయించుకోవటమే మంచిది.అంతకుముందు రోజు రాత్రి భోజనం 8-10 గంటల మధ్య మామూలుగానే తీసుకోవాలి.ఉదయాన రక్తం శాంపిల్‌ ఇచ్చేంతవరకు పాలు, కాఫీ, టీ, పళ్ళరసం లేక పళ్ళు, సిగరెట్‌, అల్కహాల్‌లాంటివేమీ తీసుకోకూడదు. మంచినీళ్ళు మాత్రం తీసుకోవచ్చు. ఉదయాన వ్యాయామాలు చేసే అలవాటుంటే వాటిని చేయకూడదు.రాత్రి ఆహారం తీసుకున్న దగ్గరి నుంచి 12 గంటలలోపున రక్తం శాంపిల్‌ ఇవ్వాలి.

ఈ పరీక్షలో రక్తంలోని 100 యం.జి./డి.ఎల్‌ (మిల్లీగ్రామ్‌ పర్‌ డెసిలీటర్‌) కంటే తక్కువ ఉండాలి.100-125 మధ్య ఉంటే మధుమేహం రావటానికి అవకాశం ఉందని గుర్తించాలి.ఈ స్థితిని ఇమ్‌పేయిర్డ్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ అంటారు.ఈ పరీక్ష కోసం డాక్టరు సూచనల ప్రకారం ఉదయం టిఫిన్‌ చేసిన రెండు గంటల తర్వాతగాని, లేక మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన రెండుగంటల తర్వాతగాని రక్తం శాంపిల్‌ ఇవ్వాలి.మామూలుగా రోజువారీ తినే భోజనమే తీసుకోవాలి. అయితే ఒకటి, ఆహారం తీసుకున్న తర్వాత నుంచి శాంపిల్‌ ఇచ్చేంతవరకూ మధ్యలో అంటే ఆరెండు గంటల కాలంలో ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.అదే విధంగా ఈ రెండు గంటల కాలంలో ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు.ఈ పరీక్షలో రక్తంలోని గ్లూకోజ్‌ 200 యం.జి./డి.ఎల్‌ కంటే ఎక్కువ ఉండకూడదు.

రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌
Diabetరక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం ఏ స్థాయిలో ఉన్నదన్నది అర్జెంటుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్ష చేస్తారు.రక్తం పరగడుపున ఇవ్వటం, ఆహారం తీసుకున్న తర్వాత ఇవ్వటం వంటి నియమమేమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయటం ఈ పరీక్ష.ఈ పరీక్ష వల్ల మధుమేహం ఏ స్థాయిలో ఉన్నదన్నది ఉజ్జాయింపుగా మాత్రమే తెలుస్తుంది.రాండమ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ 180 యం.జి. % లోపు ఉండా‚లి.

గ్లైకోసిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ టెస్ట్‌
గడచిన మూడునెలలుగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉంటోందా లేదా అన్నది తెలి సేందుకు ఈ పరీక్ష ఒక్కటే ఆధారం.‘షుగర్‌’ను అదుపులో ఉంచుకునేందుకు గత మూడు నెలలుగా తీసుకుంటున్న మందు లు, చర్యలూ నిజమైన ఫలితాన్నిస్తున్నాయా లేదా అన్నది ఈ పరీక్షలో తెలిసిపోతుంది.దీని ఫలితాన్ని బట్టి ఇప్పుడు వాడుతున్న మందులు సరిపోతాయా లేక మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నది తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది.కొంతమంది షుగర్‌ పరీక్ష చేయించు కోవటానికి ముందురోజు మాత్రమే మందులు సరి గ్గా వేసుకుని ఆహారనియమాలు మరింత కట్టు దిట్టంగా పాటిస్తారు.

దానివల్ల ఆ మరుసటి రోజు పరీక్షలో షుగర్‌ (గ్లూకోజు) తాత్కాలికంగా తక్కువగా కనపడవచ్చు.
ఇలాంటివారికి వాస్తవంగా గత మూడు నెలలుగా రక్తంలో గ్లూకోజ్‌ సగటున ఎంత ఉంటోందన్నది ఈ పరీక్ష ద్వారా కచ్చితంగా తెలుస్తుంది.దీనికోసం రోజులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రక్తం శాంపిల్‌ ఇవ్వవచ్చు.చాలాకాలంనుంచి రక్తంలో షుగర్‌ చాలా ఎక్కువగా ఉన్నా, మందులు వాడుకోకపోయినా, మందుల మోతాదు సరిపోకపోయినా, దీర్ఘకాలంలో బ్లడ్‌ షుగర్‌‌‌ స్థాయి తెలుసుకోవాలని అనుకుంటున్నా ఈ పరీక్ష చేయించుకోవటం ఉత్త మం.
రక్తంలో గ్లైకోసిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ 7% లోపు ఉండాలి. (4-7% మధ్య ఉండటం ఆదర్శనీయం)

ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ 
Diaపరగడుపున, ఆహారం తీసుకున్న తర్వాత చేసే పరీక్షల్లో విషయం స్పష్టంగా తేలక, మధు మేహం రిస్కుకు దగ్గరగా ఉన్నట్లు అనుమానం ఉన్నవాళ్ళకు చేసే టెస్ట్‌ ఇది.డయాబెటిస్‌ (మధుమేహం) ఉందా, లేదా అనే సందేహనివృత్తికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.దీనికోసం ముందుగా పరగడుపున రక్తం శాంపిల్‌ ఇవ్వాలి. ఆ తర్వాత వెంటనే పెద్దవా రికి 75 గ్రాముల గ్లూకోజ్‌ పౌడరును, పిల్లలకు వాళ్ళ బరువునుబట్టి కేజీకి 1.75 గ్రాముల చొప్పున గ్లూకోజును రెండు మూడు గ్లాసుల నీటిలో కలిపి తాగిస్తారు.తర్వాత అవసరాన్నిబట్టి వెంటనే అరగంటకోసం చొప్పున రెండుగంటలపాటు రక్తం, మూత్రాలను సేకరించి పరీక్షిస్తారు. ఇందులో నార్మల్‌ వస్తే మధుమేహం లేన ట్టేనని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ గ్లూకోజు ఎక్కువగా ఉంటే మున్ముందు మధుమేహం వచ్చే అవకాశాలున్నట్లుగా భావించాలి.
Read more >>

మడిమ నొప్పి పోయేది ఎలా..?

ప్రస్తుత కాలంలో చాలా మంది మడిమ నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి విధానం వల్ల సరైన పోషకాహారం తీసుకోక ఊబకాయం తోడై మడిమ నొప్పిని అతి చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడిమ ఎముకలో మార్పు రావటం వలన మడిమ నొప్పితో కదలికలు కష్టంగా మారతాయి.


మడిమ నొప్పికి కారణాలు:
Ankleమడిమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్‌) పదు నుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
లక్షణాలు:
  • ఉదయం నిద్రలేచిన తరువాత మొదట కదిలిక విప రీతమైన నొప్పి ఉంటుంది. కొద్ది దూరం నడిచిన తరువాత నొప్పి తీవ్రత తగ్గుతుంది.
  • మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదం అడుగు భాగాన నొప్పి ఉంటుంది.
  • పరిగెత్తేటప్పుడు నొప్పి తీవ్రత పెరుగుతుంది.
  • ఎక్కువ సేపు కింద కూర్చొని పైకి లేచినప్పుడు పాదం అడుగు భాగంలో నొప్పి వచ్చి వేధిస్తుంది.
  • మడిమ భాగం వాపుతో కూడి ఉండి నొప్పిగా ఉంటుంది. కాలి మడిమకు కింది భాగాన అనుకోకుండా ఎదైనా ఒత్తిన ట్లైయితే నొప్పి భరించలేకుండా ఉంటుంది.
  • జాగ్రత్తలు:
    • మడిమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయిం చరాదు.
    • నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదంను వేడి నీళ్లలో ఉంచి అడుగు భాగంను నెమ్మదిగా ప్రెస్‌ చేయాలి.
    • కాలి పాదంను కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
    • వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
    • నొప్పి ఉన్నప్పుడు అతిగా ‘పెయిన్‌ కిల్లర్స్‌’ వాడకుండా డాక్ట ర్‌ సలహా మేరకు హోమియో మందులను వాడుకోవాలి.
    • అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటానికి ప్రయత్నిం చాలి.
    • నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, పరిగెత్తటం, మెల్లు ఎక్కటం, మెట్లు దిగటం చేయకూడదు.
    • పరీక్షలు: ఎక్స్‌రే వలన మడిమ నొప్పి తీవ్రతను తెలుపుతాయి. చికిత్స: మడిమ నొప్పి లక్షణాలను, వ్యక్తిత్వ లక్షణాలు పరిగణలోకి తీసుకొని హోమియో మందులను ఎన్నుకొని చికిత్స చేయడం వలన మడిమ శూల నుండి ఉపశమనం పొందవచ్చు. మందులు: లెడంపాల్‌: వీరికి కాలి పాదాలలో నొప్పి ఎక్కువగా వాపుతో కూడి ఉంటుంది. వీరు వేడి కాపును భరించలేరు. చల్లని నీళ్లు కాళ్లకు తాకిన మడిమ నొప్పి నుండి ఉపశమనం పొందే వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. బ్రయోనియా: వీరికి కదలికల వల్ల పాదం అడుగు భాగాన నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతి వల్ల తగ్గుట గమనించ దగిన లక్షణం. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయినప్ప టికీ మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలం గట్టి వస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకో దగినది. ఆర్నికా: పడటం వలన పాదం అడుగు ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం పాదం నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొంద వచ్చు. కాల్కేరియా కార్బ్‌: పాదం అడుగు భాగంలో ఎముక (కాల్కే నియస్‌) పెరుగుదల వలన నొప్పి వచ్చే వారికి ఈ మందు బాగా పని చేస్తుంది. వీరు చూడటానికి లావుగా ఉంటారు. వీరి పొట్ట ముందుకు పొడుచుకొని వచ్చి బోర్లించిన మూకుడు లాగా ఉంటుంది. తల పెద్దదిగా ఉంటుంది. వీరికి తల మీద చెమటలు ఎక్కువగా వస్తుండటం గమనించదగిన లక్షణం. వీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి శారీరక, మానసిక లక్షణాలున్న వారికి మడిమ నొప్పి తగ్గించటానికి ‘కాన్షిట్యూషనల్‌’ మందుగా కాల్కేరియా కార్బ్‌ బాగా ఉపయోగపడుతుంది.ఈ మందులే కాకుండా రస్టాక్స్‌, రూటా, సల్ఫర్‌, కాలికార్బ్‌, కోలోసింత్‌, మాగ్‌ఫాస్‌, సింఫైటినం, సైక్లోమిన్‌, కాల్కేరియా ఫ్లోర్‌, కాలీమోర్‌ వంటి మందులను లక్షణ సముదాయంను పరిగణలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు
Read more >>

గర్భాశయ కంతులు

గర్భాశయ కంతులు లేదా కండరం యొక్క నిరపాయ కంతి కాన్సర్‌ లక్షణాలు లేకుండా గర్భాశయంలో అపాయకరం కాని పెరుగుదల. వీటిని ఫైబ్రోమియోమా, మియో ఫైబ్రోమా, ఫైజోలియా మియోమా అని కూడా అంటారు. కంతులు వివిధ పరిమాణాల్లో నెమ్మదిగా పెరుగుతుంటారుు. ఇవి సాధారణంగా గర్భాశయం గోడలలో లేదా గర్భాశయ కుహరం (కాలిటీ) లోపల లేదా గర్భాశయ ద్వారం (సర్విక్స్‌) గర్భాశయ కింది భాగంలో లేదా కొన్ని సందర్భాల్లో గర్భాశయం వెలుపల కూడా పెరుగుతుంటారుు.

qw40 సంవత్సరాల వయసు గల మహిళల్లో 20 నుండి 25% మందికి రావడం సహజం. సాధారణంగా 50% మంది మహిళలకు వస్తోంది. పెద్ద శస్తచ్రికిత్స జరగడానికి దారితీస్తోంది. 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో ఇవి పెరుగుతున్నాయి.

గర్భాశయ కంతులు సమస్యలు
అధిక రక్తస్రావం కారణంగా రక్తహీనత, గర్భధారణ సమయంలో గర్భస్త పిండం పరిణితిలో కలయిక. ప్రసవ సమయంలో సమస్యకు దారి తీయవచ్చు.

హోమియో చికిత్సా విధానం
menగర్భాశయ కంతులకు సాధారణంగా అల్లోపతి అందించే పరిష్కారం శస్తచ్రికిత్స. ఇది సాధారణంగా గర్భాశయ తొలగింపు అనగా శస్తచ్రికిత్స ద్వారా పూర్తి గర్భాశయాన్ని తొలగించడంగా ఉంటుంది. కొన్ని సం దర్భాల్లో మియోమెక్టమీ అనగా కంతులను మాత్రమే తొలగించడం. మియోమెక్టమీ చేసిన 5 సంవత్సరాల తరువాత సుమారు 50% కేసు ల్లో కంతులు తిరిగిరావడం సాధారణం. గర్భాశయ తొలగింపు శస్త్ర చికిత్స ద్వారా మెనోపాజ్‌ దశ చేర్చినట్లవుతుంది. దీని ద్వారా హాట్‌ ప్లాషెస్‌, తలనొప్పి, ఉద్వేగాలలో మార్పు, నిద్రలేమీ, నిద్రాభంగం, చెమటలు పట్టడం, భావోద్వేగాలకు లోనుకావడం, వాంఛ లేదా కామాసక్తి తగ్గడం, యోని ఎండిపోవడం, తెల్లబట్ట, శారీరక అస్వస్థత, మొటిమలు, అవాంఛిత రోమాలు పెరుగుదల, డీపర్‌ వాయిస్‌, ఆస్టిరోపోరోసిస్‌ (అస్తి తగ్గడం) వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

Untitled-1రోగి శస్త్ర చికిత్స ద్వారా గర్భాశయ తొలగింపు నిరాకరిస్తే, అల్లోపతి హార్మోన్‌ మందులు, ఎస్‌ఎస్‌ఐడిలు, గర్భనిరోధక మాత్రలను సూచిస్తుంది. ఇవి పైన తెలిపిన దుష్ర్పభావాలతోపాటు మెనోపాజ్‌ దశ కు చేరుకునేలా చేస్తాయి. కంతులు అధికస్థాయిలో పెరగడానికి ముందే హోమియోపతి చికిత్సా విధానం కంతులు పెరుగుదలను నియంత్రించ డంతో పాటు ప్రస్తుతం ఉన్నవాటి పరిమాణాన్ని నెమ్మదిగా, క్రమంగా తగ్గిస్తుంది. హోమియెపతి మందులు అధిక రక్తస్రావం కారణంగా వచ్చే రక్తహీనత, మూత్ర సంబంధ సమస్యలు నిరోధిస్తుంది.
ఆ విధంగా గర్భాశయ కంతులకు హోమియెపతిలో సూచించదగిన అత్యుత్తమ చికిత్సా విధానం. హోమియోపతి చికిత్సను పొందడం ద్వారా మహిళలు శస్త్ర చికిత్సను నివారించడం వలన గృహసంబంధ, వృత్తి పరమైన కార్యాకలాపాలను నిర్వహించుకోగలుగుతారు. సమర్ధత గల హోమియోపతి డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్సా విధానం కాస్త ఆలస్యమవచ్చు కాని మహిళల గర్భధారణ సామర్ధ్యాన్ని రక్షిస్తుంది. 

గర్భాశయ కంతులు లక్షణాలు 
కంతులు లేదా నిరపాయ కంతులుగల రోగులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. డాక్టర్లు అల్ట్రా సోనోగ్రఫీ పరీక్ష చేయుట ద్వారా గర్భాశయ కంతులను గుర్తిస్తారు.అధికమైన, తీవ్రమైన, ప్రమాదరహితమైన లేదా దీర్ఘకాల రక్తస్రావం. గర్భాశయం బరువుగా అనిపించడం. సాధారణంగా పొత్తి కడుపులో నొప్పి, రతి సమయంలో నొప్పి, ఉబ్బడం, వ్యంధత్వం, పొత్తికడుపులో కంతి తరచుగా మూత్రం రావడం, తరచుగా మలవిసర్జనకు వెళ్ళాలనిపించడంతో పాటు పేగులలో నొప్పి.గర్భాశయ కంతులకు సాధారణంగా అల్లోపతి అందించే పరిష్కారం శస్తచ్రికిత్స. ఇది సాధారణంగా గర్భాశయ తొలగింపు అనగా శస్తచ్రికిత్స ద్వారా పూర్తి గర్భాశయాన్ని తొలగించడంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మియోమెక్టమీ అనగా కంతులను మాత్రమే తొలగించడం. మియోమెక్టమీ చేసిన 5 సంవత్సరాల తరువాత సుమారు 50% కేసుల్లో కంతులు తిరిగిరావడం సాధారణం.
Read more >>

థైరాయిడ్‌ రోగులకు వరం రేడియో యాక్టివ్‌ అయోడిన్‌

థైరాయిడ్‌ ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని, థైరారుుడ్గ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయటంలో చోటు చేసుకున్న వైద్యపరమైన అభివృద్ధిని గురించి వైద్య నిపుణులు ప్రజలను జాగృతం చేసి, వారికి అవగాహన కల్పిస్తున్నారు. థైరారుుడ్గ క్యాన్సర్‌ చికిత్సలో రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ చికిత్స ప్రాధాన్యాన్ని, ప్రభావశీలతను గురించి అవగాహనను వ్యాపింప జేయవలసిన అవసరాన్ని గురించి నిపుణులు ప్రత్యేకంగా వివరించి చెప్పారు.

Untitaగత కొద్ది సంవత్సరాలుగా థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరగటం కనిపించింది. అయితే, వీటిలో చాలా కేసులను నయం చేయగలగటం ఒక శుభవార్త. మొత్తం థైరాయిడ్‌ను లేదా అందులో కొంత భాగాన్ని, లింఫ్‌ నోడ్లను తొలగించేందుకు శస్తచ్రికిత్సను చాలా వరకు చేపట్టటం జరిగిం ది. ఇక ఇప్పుడు రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ చికిత్సను మెల్లిగా, శస్తచ్రికిత్స చేసిన తర్వాత మిగిలి పోయిన క్యాన్సర్‌ కణాలను చంపేందుకు లేదా శరీరంలో వ్యాపించి ఉన్న లేదా చికిత్స తర్వా త తిరిగి కనిపించే థైరాయిడ్‌ క్యాన్సర్‌ను తొలగించేందుకు ఎక్కు వగా ఉపయోగించడం జరుగుతోంది. థైరాయిడ్‌ క్యాన్సర్‌ చికిత్స కు ఇది ఒక వరప్రసాదంలాగా మారింది అని అంటున్నారు నిపుణులు.

మెడకు దిగువ భాగంలో నెలకొని ఉండే థైరాయిడ్‌ గ్రంధి శరీర కణాలకు కావలసిన శక్తిని అందించే, మెటబాలిజమ్‌ (జీవ క్రియ)ను నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంటుంది. హైపోథైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, అవటు (గాయిటర్‌), ప్రమాదరహితమైన కణుతులు, థైరాయిడిటిస్‌, ఆటో-ఇమ్యూన్‌ (సహజ రోగనిరోధక) థైరాయిడ్‌ వ్యాధులు మరియు థైరాయిడ్‌ క్యాన్సర్‌ వంటి థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తం గా సాధారణంగా కనిపిస్తూ, లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. ద ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీని అనుసరించి, 4.2 కోట్ల భారతీయులు థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతుం డగా, వారిలో దాదాపు 90 శాతం గుర్తించకుండా మిగిలిపోతు న్నాయి.

థైరాయిడ్‌ క్యాన్సర్‌, అత్యంత సాధారణమైన ఎండోక్రైన్‌ మాలి గ్నెన్సీ. దీనికి గల లక్షణాలలో మెడలో కణితి, మెడ ముందు వైపు దిగువ భాగంలో నొప్పి, మెడలో శోషరస (లింఫ్‌) నోడ్‌లు వాయటం, స్వరం కరకుగా రావటం, శ్వాస పీల్చటం మరియు మింగటంలో సమస్య. భౌతిక పరిశీలన, రక్త పరీక్షలు, థైరాయిడ్‌, ఇతర స్కాన్‌లు, థైరాయిడ్‌ అల్ట్రాసౌండ్‌, సన్నని - సూదుల ఆస్పిరేషన్‌ బయాప్సీ, శస్తచ్రికిత్సా బయాప్సీలను, రోగులలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ను కనుగొనేందుకు ఉపయోగిం చవచ్చు. చాలా వరకు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసులలో, మొత్తం థైరాయిడ్‌ను తొలగించవలసి ఉంటుంది. 

ఆ తర్వాత రోగులు జీవితాంతం థైరాయిడ్‌ ప్రత్యామ్నాయ హార్మో న్లను తీసుకోవలసి ఉంటుంది. మెడలో క్యాన్సర్‌ కలిగిన లింఫ్‌ నోడ్లను కూడా తొలగించ వలసి ఉంటుంది. శస్త్ర చికిత్స తర్వాత జరిపే రేడి యో యాక్టివ్‌ అయోడిన్‌ థెరపీతో, శరీరంలో మిగిలిపోయిన థైరాయిడ్‌ టిష్యూ, క్యాన్సర్‌ కణాలను చంపే అయోడిన్‌ను తీసుకుంటుంది.థైరాయిడ్‌ తొలగించిన తర్వాత రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ థెరపీ ఇప్పుడు దేశంలోని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. ఇందుకో సం ప్రత్యేకమైన సౌకర్యాలు అవసరం అవుతాయి. వీటిలో ఐసొలేషన్‌ గదులు, ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా ఉంటాయి.

చిగురిస్తున్న కొత్త ఆశలు
ssa‘హైపర్‌థైరాయిడ్‌ రోగులు ఒక న్యూక్లియర్‌ ఫిజీషియన్‌ వద్దకు, ఐసోటోప్‌ చికిత్సతో ఉపశమనం పొందాలనే గొప్ప ఆశతో వస్తారు. ఒకే ఒక్క రేడియో అయోడిన్‌ ఔట్‌ పేషెంట్‌ ఓరల్‌ డోస్‌తో లాభాన్ని పొందిన రోగులు బాగా ఋణపడి ఉన్నట్లుగాను, దీనిని ఒక అద్భుత మైన వైద్యంగాను భావిస్తారు. అనుకున్న విధంగా ఐసోటోప్‌ గ్రంధి లోకి ప్రవేశించకపోతే ఫిజీషియన్‌కు చికాకు కలుగుతుంది. గతంలో మేము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు భావించి, యాంటీ-థైరాయిడ్‌ మాత్రలిచ్చిన ఫలితాలకు రోగిని తన బాధ తాను పడేందుకు వదిలి పెట్టే వాళ్ళం. ఇప్పుడు ‘రీకాంబినాంట్‌ హ్యూమన్‌ టిఎస్‌హెచ్‌’ (థైరా యిడ్‌ హార్మోన్‌కు ప్రభావ వంతమైన మరియు సురక్షితమైన ప్రత్యా మ్నాయం) రాకతో కొత్త ఆశ చిగురించింది అని అంటున్నారు నిపు ణులు.


‘2009లో ఒక మహిళా రోగికి హైపర్‌థైరాయిడ్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. యాంటీ థైరాయిడ్‌ ఔషధాలకు ఆమె ప్రతి స్పందన సరిగి లేకపోయింది. అందువలన ఆమెకు ఐ-131 (రేడియో అయోడిన్‌ చికిత్స) చికిత్సను సిఫార్సు చేయడం జరిగింది. ఏవైనా థైరాయిడ్‌ హార్మోన్లున్నాయేమో కనుగొనేందుకు ఆమె శరీరం అంతటికీ స్కాన్‌ నిర్వహించాం. థైరాయిడ్‌ గ్లాండ్‌ ఏవీ కనిపించలేదు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ నిర్వహించి చూస్తే సాధారణంగా ఉండే మెడ ప్రదేశంలోనే అట్రోపిక్‌ థైరాయిడ్‌ గ్రంధి కనిపించింది. 

యాంటీ- థైరాయిడ్‌ ఔషధాలను ఇచ్చినప్పటికీ రోగి, మళ్ళీ ఆమె తర్వాత మేనే జ్‌మెంట్‌ జరిపించుకున్నా థైరోటాక్సిక్‌గానే ఉండిపోయింది. అప్పుడు రేడియో అయోడిన్‌ ఐ-131ను నోటి ద్వారా ఇచ్చాం. ఆ తర్వాత 5 రోజులకు స్కాన్‌ను గామా కేమేరాతో నిర్వహిస్తే, థైరాయిడ్‌ గ్రంథి ఐ-131ను బాగా గ్రహించినట్లు దృవీకృతమయ్యిం ది. ఐదు నెలల తర్వాత రోగి, కోరుకున్నట్లుగానే, హైపోథారాయిడ్‌గా మారింది. ఇప్పుడు రోగి, థైరాక్సిన్‌ ప్రత్యామ్నాయ మోతాదును తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంది’

థైరాయిడ్‌ క్యాన్సర్‌, అత్యంత సాధారణమైన ఎండోక్రైన్‌ మాలి గ్నెన్సీ. దీనికి గల లక్షణాలలో మెడలో కణితి, మెడ ముందు వైపు దిగువ భాగంలో నొప్పి, మెడలో శోషరస (లింఫ్‌) నోడ్‌లు వాయటం, స్వరం కరకుగా రావటం, శ్వాస పీల్చటం మరియు మింగటంలో సమస్య.చాలా వరకు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసులలో, మొత్తం థైరాయిడ్‌ను తొలగించవలసి ఉంటుంది. ఆ తర్వాత రోగులు జీవితాంతం థైరాయిడ్‌ ప్రత్యామ్నాయ హార్మోన్లను తీసుకోవలసి ఉంటుంది.
Read more >>

స్త్రీలు - డయాబెటిస్‌

పురుషూలకు మధుమేహవ్యాధి ఉండడం వేరు, స్త్రీలకు మధుమేహవ్యాధి ఉండటం వేరు. స్త్రీకి మధుమేహవ్యాధి ఉన్నప్పుడు ఆమె సమస్యలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. నెలవారీ మెన్సెస్‌ రోజుల్లో వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అయే హార్మోనుల మూలంగా గర్భాన్ని దాల్చిన రోజుల్లోనూ, డెలివరీ సమయంలోనూ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది.

స్త్రీ హర్మోనులు
Diaaస్త్రీలలోని అండాశయాలు ఈస్ట్రోజన్‌, ప్రొజెస్లరోన్‌ అనబడే రెండు స్త్రీ హార్మోనుల్ని ఉత్పత్తి చేస్తుంటా యి. ఈ రెండు హార్మోనులూ ఆమెకు నెలవారీగా అయ్యే మెన్సెస్‌ని క్రమబద్ధీ కరిస్తూ గర్భధారణకు ఆమెను సన్నద్ధం చేస్తాయి.మెన్సెస్‌ రోజుల్లో ఈ రెండు హార్మోనుల ఉత్పత్తి పతా కస్థాయిలో ఉంటుంది.మెన్సెస్‌ ముందు రోజుల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి అయి గర్భాశయం లోపల రక్తం, కణజాలంతో కూడు కున్న ‘ఎండోమెట్రియం’ అనబడే మందపు పొరను తయారు చేస్తుంది.గర్భాశయం లోపల ఏర్పడే ఈ పొర వీర్యకణ కల యికతో ఫలదీకరణమైన అండాల్ని పొదిగి పోషించు టానికి ఉద్ధేశించబడింది. ఫల దీకరణ చెందిన అం డం గార్భశయం లోపలికి రాగానే ఈ పొర దానికి మెత్తటి పరుపులా ఉపయోగపడుతుంది.

గర్భధారణ కనక జరగకపోతే ప్రొజెస్టరోన్‌ హార్మోను అధికంగా ఉత్పత్తి అయి ఈ పొర తునకలుగా విడి పోయి ఊడి గర్భాశయంనుంచి బహిష్టూస్రావం రూపంలో బయటికి వెలువడుతుంది.స్త్రీ శరీరంలో నెలనెలా ఉత్పత్తి అయే ఈ హార్మోనుల ఉధృతం ఆమె రక్తంలోని చక్కెర (బ్లడ్‌ గ్లూకోజ్‌) మీద ప్రభావాన్ని చూపటం సహజం.మధుమేహంకల స్త్రీ తన బ్లడ్‌ గ్లూకోజ్‌ మీద బిహ ష్టూ ప్రభావాన్ని చూపుతున్నదనిపించినప్పుడు ఆ రోజుల్లో రోజుకు మూడు నాలుగు తడవలు బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్టు చేసుకుని సందేహ నివృత్తి చేసుకోవ టం మంచిది. తద్వారా ఆయా రోజుల్లో తగు జాగ్ర త్తలను తీసుకో వటానికి వీలు కుదురుతుంది.

ఉదాహరణకు
మెన్సెస్‌కి ముందు రోజుల్లో బ్లడ్‌ గ్లూకోజ్‌ అధిక స్థాయిలో ఉంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకో వచ్చు.
  • రక్తంలో చక్కెరశాతాన్ని తగ్గించుకోవడానికి అద నపు శారీరక శ్రమను చేయటం, శారీరక శ్రమ అవసరం.
  • కార్బోహైడ్రేట్స్‌ కల ఆహారాన్ని మితంగా తీసు కోవటం,
  • మెన్సెస్‌ రాబోతుందనగా కొద్దిరోజుల ముందు నుంచీ ఇన్సులిన్‌ని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవటం.
    ఒకవేళ బ్లడ్‌ గ్లూకోజ్‌ తక్కువస్థాయికి పడి పోతూ హైపోగ్లైసీమియాకి చేరువవుతున్నా రనిపించిన ప్పుడు
  • కార్బోహైడ్రేట్స్‌ కల ఆహారాన్ని కొంత అధికంగా తీసుకోవడం.
  • మెన్సెస్‌కి కొద్ది ముందురోజులనుంచి ఇన్సు లిన్‌ డోస్‌ని తగ్గించటం లాంటివి పాటించాలి.

    మధ్యవయసు దాటాకMenopause)
    స్త్రీలకు పీరియడ్స్‌ ఆగిపోయే దశలో (ౌ్ఛ ఞ్చఠట్ఛ) శరీరంలో అనేక మార్పులు చోటుచేసు కుంటాయి. అయితే ఈ మార్పులేవీ ఆమెకున్న మధుమేహం మీదగాని, చికిత్సమీద గానీ ప్రభా వాన్ని చూపవు.కాకపోతే మెనోపాజ్‌ తాలూకు కొన్ని లక్ష ణాలు ‘హై బ్లడ్‌ షూగర్‌’ లేక ‘లో బ్లడ్‌ షూగర్‌’ లక్షణాలను పోలి ఉంటాయి. శరీరం వెచ్చగా ఉండటం, వణుకు (టజ్చిజుడ), చెమటలు పోయటం లాంటివి కనిపించ నప్పుడు మధుమేహం లేని స్త్రీ కూడా బ్లడ్‌ గ్లోకోజ్‌ టెస్ట్‌ చేయించు కోవటం మంచిది. దానివల్ల ఆమె మధుమేహ చికిత్స తీసుకోవాలేమో తెలిసివస్తుంది. మెనోపాజ్‌ లక్షణాలనుంచి విముక్తులు కావటానికి కొందరు హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ తెరపి (ఏఖీ) తీసుకోవాలను కుంటారు. మధుమేహం కల స్త్రీలు తమ కది తగునో కాదో డాక్టరును సంప్రదించటం మేలు.

    యోని సమస్యలు
    మూత్రాశయపు పొర(ఆజ్చూఛీఛ్ఛీట ఔజీజీ) వాపు చెందటాన్ని ‘సిస్లైటిస్‌’ (ఇడట్టజ్టీజీట) అంటా రు.
    యోనివద్ద ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకటాన్ని ‘త్రష్‌’ (ఖీజిటఠటజి) అంటారు.ఒకరకపు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ మూలంగా వచ్చే, ‘సిస్లైటిస్‌’ లో మూత్రానికి మాటిమాటికి వెళ్ళాల్సి రావటం మూత్రంలో మంట ఉంటాయి.ఇ్చఛీజీఛ్చీ అజూఛజీఛ్చిట అనబడే ఫంగస్‌ కారణంగా యోనివద్ద వచ్చే త్రష్‌ చాలా సర్వసా ధారణం. కాక పోతే డయాబెటిస్‌ ఉన్న స్త్రీలలో ఇది చాలా వేగవం తంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల యోనిభాగాన దురద, ఒకరకమైన వాసన కొట్టే డిశ్చార్జ్‌ ఉంటాయి.

    మధు మేహం కల స్త్రీలలో ఖీజిటఠటజి గాని ఇడట్టజ్టీజీట గాని చాలా తరచుగా వస్తుంటాయి.రక్తంలో గ్లూకో జ్‌ పరిమాణం అధికంగా ఉన్నప్పుడు ఆ స్త్రీలో బాక్టీరి యా, ఫంగస్‌ వృద్ధి చెందటానికి అనువైన వాతావర ణం ఏర్పడుతుంది.అలాగే ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు రక్తంలో గ్లూకోజ్‌ పరి మాణం పెరుగుతుంది కూడా ఈ రకంగా ఇన్‌ఫెక్ష న్‌కి బ్లడ్‌ గ్లూకోజ్‌కీ పరస్పర సంబంధం ఉంటుంది.
    ‘సిస్లైటిస్‌’ గాని త్రష్‌ గాని ఉన్నదనిపించినప్పుడు ఆ స్త్రీ వెంటనే డాక్టరును సంప్రదించి తగు మందుల తో చికిత్స చేయటం మంచిది.
Read more >>

మధుమేహం - గర్భధారణ

మధుమేహం కల స్త్రీ పిల్లలను కనాలను కుంటున్నప్పుడు అందుకు తగ్గ ప్లానింగ్‌ చేసు కోవాలి. గర్భాన్ని మోస్తున్నన్నాళ్ళూ డయాబెటిస్‌ని టైట్‌ కంట్రోల్‌లో ఉంచుకోవటమే కాకుండా క్రమం తప్పకుండా డాక్టరుకు చూపించుకుం టుండటం కూడా అవసరం.దానివల్ల పుట్టబో యే బిడ్డ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్‌ లేకుండా ఉంటాయి.

Untiawమధుమేహం మూలంగా పిల్లలు కలగక పోయే సమస్య అంటూ ఏమీ ఉండదు గాని మధుమేహం మూలంగా తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం మట్టుకు లేకపోలేదు.పాపాయికి అంకురార్పణ జరిగే గర్భధార ణ దినాలలోనూ, గర్భాన్ని దాల్చిన 8 వారాల దాకానూ బ్లడ్‌గ్లూకోజ్‌ ఏఛఅ1ఛి స్థాయి 7 శాతాన్ని మించి ఉంటే అది కడుపులో బిడ్డ పెరుగు దలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.అందుకనే గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్షలు చేయించు కుంటూ డాక్టరు పర్యవేక్షణలో ఉండటం అవసరం.గర్భిణీ స్త్రీ రక్తంలో గ్లూకోజ్‌ అధికస్థాయిలో ఉంటే ఆమె కడుపులో ఉన్న పాపాయి రక్తంలో కూడా గ్లూకోజు అధికస్థాయిలో ఉంటుంది.

ఇందుకు కారణం ఏమిటంటే తల్లి రక్తంలోని గ్లూకోజు ‘మాయ’ ... ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. కాని ఇన్సులిన్‌ ఆవిధంగా ప్రవేశించలేదు.దానితో కడుపులో పాపాయి రక్తంలో గ్లూకోజ్‌ అధికమవుతుంది. దీనివల్ల కడుపులో బిడ్డ సాధారణం కన్నా వేగంగా బరువు పెరగటం ప్రారంభిస్తాడు.
కడుపులో బిడ్డ మామూ లుకన్నా వేగంగా పెరగటంతో శరీర పరిమాణం పెద్దగా ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయంలో ఆమె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.అలాగే పుట్టే బిడ్డకు శ్వాస సమస్యలు కూడా ఏర్పడ వచ్చు. డెలివరీ తర్వాత బిడ్డ ‘హైపోగై ్లసీమియా’ కు లోనుకావచ్చు.టైప్‌ 1 డయాబెటిస్‌ కల స్త్రీ కడుపుతో ఉన్న రోజుల్లో బ్లడ్‌ షూగర్‌ని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో కీటోన్స్‌ అనబడే విషపదార్థాలు ఉత్పత్తి అయే ప్రమాదం ఉంది. కడుపులో ఉన్న బిడ్డకు ఈ ‘కీటోన్స్‌’ చాలా అపకారాన్ని కలగజేస్తాయి. చాలా అరుదే అయినా ఒకోసారి బిడ్డకు ప్రాణా పాయమూ కలగవచ్చు.

మధుమేహం గల స్త్రీ గర్భాన్ని దాల్చిన ప్పుడు ప్రెగ్సెన్సీ రోజుల్లో బ్లడ్‌షూగర్‌ పెరగకుం డా ఉండటానికి ఈ కింది జాగ్రత్తల్ని తీసుకో వటం అవసరం.
  • న్యూట్రిషనిస్టు సలహామేర ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం
  • రెగ్యులర్‌గా ఏదో ఒక యాక్టివిటీతో శరీ రాన్ని చురుకుగా ఉంచటం - వాకింగ్‌కి వెళ్ళ టం, మృదువుగా జాగింగ్‌ చేయటం, వగైరాలతో
  • ఈ రోజుల్లో డైటింగ్‌ అసలు చేయకూ డదు.
  • ఏదైనా అస్వస్థతలకు గురయితే రక్తంలో గ్లూకోజు స్థాయి అధికమ వుతుంది. కాబట్టి ఇట్లాంటి రోజుల్లో డాక్టరు సలహామేర ఇన్సులిన్‌ని ఇంకాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి రావచ్చు.

    టైప్‌ 1 డయాబెటిస్‌ కల స్త్రీ కడుపుతో ఉన్న రోజుల్లో బ్లడ్‌ షూగర్‌ని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో కీటోన్స్‌ అనబడే విషపదార్థాలు ఉత్పత్తి అయే ప్రమాదం ఉంది.
Read more >>

థైరాయిడ్‌ సమస్యలు స్ర్తీలేక ఎక్కువ!

థైరాయిడ్‌ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో మెడలో విండ్‌పైప్‌ ప్రాంతంలో ఉంటుంది. మన శరీరం శక్తిని ఎలా ఉపయోగించుకుంటుంది, ఎలా నిలువ ఉంచుకుంటుంది లాంటి వాటిని సరిచూస్తూ ఉంటుంది. మన శరీరంలోని కణాలన్నింటి పని తీరుని పరీక్షిస్తుంటుంది థైరాయిడ్‌ గ్రంథి.

Unqaథైరాయిడ్‌ గ్రంథి సమస్యలు, పాంక్రియాజ్‌ గ్రంథి సమస్యలు మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆడవాళ్ళలో, రెండవది మగవాళ్ళలో ఎక్కువగా కనిపించడం విశేషం.థైరాయిడ్‌ సమస్యలు ఇప్పుడు ఎక్కువకాలేదు. కాకపోతే కొన్ని అనారోగ్యాల అను మానంతో పరీక్షలు జరిపి థైరాయిడ్‌ సమస్యల్ని ఎక్కువగా కనుక్కొంటున్నారు.ప్రధానంగా థైరియిడ్‌కి వచ్చే సమస్యలు - హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌ థైరాయి డిజమ్‌, థైరాయిడ్‌ కాన్సర్స్‌.థైరాయిడ్‌ గ్రంథి నుంచి హార్మోన్‌ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజమ్‌ అంటారు. హైపోథైరాయిడిజమ్‌ ఉన్న వాళ్ళు త్వరగా అలసి పోవడం వల్ల ప్రత్యేక లక్షణాలు కనిపించవు. క్రమక్రమంగా బాగా నీరసించిపోతుంటే తప్పక పరీక్షలు చేయించు కోవాలి. అప్పుడే ప్రాథమిక స్థాయిలో చికిత్సలు చేయించుకోగలం. అంతే కాకుండా బరువు పెరగవచ్చు. 

ముఖం ఉబ్బరించవచ్చు, ఇతరులకి అనిపించకపోయినా వీళ్ళకు ‘కోల్డ్‌’ అనిపించవచ్చు. జుట్టు తగ్గవచ్చు , డ్రైస్కిన్‌, ఒళ్ళు నొప్పుడు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి వల్ల ఎక్కువగా హైపోథైరాయి డిజమ్‌ వచ్చే అవకాశముంది. ఆడవాళ్ళలో ఇది ఎక్కువ. కొన్ని మాత్రలతో కచ్చిత మైన మందుల డోస్‌లు ఇవ్వడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ని అదుపులోకి తేవ చ్చు. హైపోథైరా యిడిజమ్‌ ఉన్న వాళ్ళకి గర్భ సమయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఎండోక్రెనాలజిస్ట్‌ సలహా తీసుకోవ డం చాలా అవసరం.థైరాయిడ్‌ గ్రంథి ఎక్కువగా పనిచేయడం వల్ల హైపర్‌ థైరాయిడిజమ్‌ కలుగవచ్చు. ఆదుర్దా, ఇరిటేషన్‌, ఒణుకు, అసందర్భంగా చెమట పట్టడం, వేడిని భరించలేకపో వడం, గుండెకొట్టు కోవడం క్రమం తప్పడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు హైపర్‌ థైరాయిడిజంలో కనిపించవచ్చు. 

Untitlaకొన్ని సందర్భాల్లో కళ్ళు ముందుకు పొడుచుకు రావచ్చు. హైపర్‌ థైరాయిడిజం తగ్గించేందుకు మందులు న్నాయి. హైపర్‌ థైరాయి డిజమ్‌ ఉన్న వాళ్ళు గర్భం ధరించాలనుకుంటే ఎండోక్రినాలజిస్ట్‌ సలహా అవసరం.థైరాయిడ్‌కి సంబంధించిన మూడవ ప్రమాదం క్యాన్సర్‌. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్‌ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స ఉంది. కాకపోతే ప్రాథమిక దశలోనే ఇబ్బందుల్ని కనుక్కోవడం చాలా అవసరం.చాలా మందికి అవయవాల మీద, సిస్టమ్స్‌మీద అవగాహన ఉండవచ్చు. గ్రంథుల మీద అవగాహన ఉండదు. 

కాబట్టి గ్రంథుల నిర్మాణం, ఎక్కడుంటాయి, ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో హార్మోన్లని విడుదల చేస్తున్నాయి లాంటి విషయాల మీద అందరికీ అవగాహన ఉండాలి. థైరాయిడ్‌కి సంబంధించిన మూడవ ప్రమాదం క్యాన్సర్‌. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్‌ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స ఉంది. కాకపోతే ప్రాథమిక దశలోనే ఇబ్బందుల్ని కనుక్కోవడం చాలా అవసరం.
Read more >>

టాన్సిలైటీస్‌ సమస్యకు శస్త్ర చికిత్సే మార్గమా..?

టాన్సిల్స్‌ అనేవి గొంతులో ఇరు పక్కల ఉండి మన శరీరానికి రక్షకభటు లుగా పనిచేస్తాయి. బయట నుండి వచ్చే సూక్ష్మక్రిములను, కాలుష్య కారక పదార్థాలను శరీరంలోకి రాకుండా నివారించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతగా ఉపయోగపడుతున్న టాన్సిల్స్‌ను శస్తచ్రికిత్స చేసి తొలగించకుండా సమస్య వచ్చినప్పుడు హోమియో మందులను వాడి శస్త్ర చికిత్స లేకుండానే సమస్య నుండి విముక్తి పొంది టాన్సిల్స్‌ సైజు కూడా పెరగకుండా చేసుకోవచ్చు.

ఈ సీజన్‌లో చాలా మంది చిన్న పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. టాన్సిల్స్‌ సైజు పెరిగి వాపు (టాన్సిలెైటిస్‌) రావడం వలన గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు ఎక్కువ కావడం వలన టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడకపోవడం వల్ల టాన్సిల్స్‌ సమస్య వేధిస్తుంది.

లక్షణాలు:
టాన్సిల్స్‌ ఎరగ్రా వాపుగా కన్పిస్తాయి. గొంతునొప్పి, చెవినొప్పి, తలనొప్పి జలుబుతో జ్వరం 101 డిగ్రీల నుండి 103 డిగ్రీల ఫారన్‌హీట్‌ల వరకు ఉంటుంది. ఆహారం మింగటం, నీరు తాగటం, గాలి పీల్చడం, బాగా మాట్లాడటం కష్టంగా మారుతుంది. నోరు బొంగురు పోవడం, గొంతు తడారిపోయి గొంతు ఎరబ్రడడం, నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణాలుంటాయి.
జాగ్రత్తలు:
చల్లటి గాలిలో తిరుగకూడదు. కలుషిత నీటిని తాగకుండా, కాచి వడపోసిన నీటిని తీసుకోవడం వలన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుంది. చల్లటి పానీయాలను, ఐస్‌క్రీములు, బేకరీ ఫుడ్స్‌ తీసుకోకూడదు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్ల స్నానం చేయకూడదు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.
చికిత్స:
టాన్సిలెైటీస్‌కు ఎక్కువశాతం వరకు శస్తచ్రికిత్స అవసరం లేకుండానే టాన్సిల్స్‌ సమస్యను నివారించే మంచి చికిత్స హోమియోవెైద్యంలో కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వెైద్యం చేస్తే టాన్సిలెైటీస్‌ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
మందులు:
F3sహెపార్‌సల్ఫ్‌: టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి చల్లగాలి సోకగానే మొదలగును. వీరికి నొప్పితో బాటు గొంతులో ఉండబెట్టినట్లుగా, టాన్సిల్స్‌లో చీముతో పాటుగా తీవ్ర జ్వరం ఉంటుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి గమనించ దగిన ప్రత్యేక లక్షణం. వీరికి చల్లదనం గిట్టదు, వేడి పదార్థాలు తీసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రధానమైనది.
బెరెైటాకార్బ్‌: టాన్సిల్స్‌ సమస్య వలన ప్రధానంగా పిల్లల్లో ఎదుగుదల లోపించినట్లు అయితే ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
బెల్లడోనా: టాన్సిల్స్‌ వాపుతో పాటు గొంతునొప్పి, జ్వరం అకస్మాత్తుగా మొదలవుతుంది. గొంతునొప్పి కుడివెైపు ఎక్కువగా ఉంటుంది. గొంతు పొడారిపోయి మింగటం కష్టంగా మారుతుంది. గొంతులో ఎరబ్రారి ఉంటుంది. వీరికి స్నానం చేసిన అనంతరం బాధలు ఎక్కువవుతాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
ఎకోనెైట్‌: చల్లగాలిలో తిరగడం వలన టాన్సిల్స్‌ సైజు పెరిగి గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. ఇలాంటి కారణంగా గొంతునొప్పి ప్రారంభమయి, మింగటం కష్టంగా మారి గొంతు మంటమండుతుంది. దాహం విపరీతంగా ఉండి జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ఆలోచించదగినది.
మెర్కుసాల్‌:టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై సైజు పెరిగి గొంతునొప్పి మొదలవుతుంది. గొంతు నొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. నోరు దుర్వాసన కొడుతుంది, నాలుక పెద్దదెై నాలుక చివర పళ్ల అచ్చులు కనబడటం ఈ మందు ప్రత్యేక లక్షణం. వీరికి జలుబు చేసినప్పుడు గొంతు నొప్పితో బాధపడుతుంటారు. జ్వరంతో పాటుగా చెమటలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ఆలోచించదగినది.
జెల్సిమియం: వెైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా వచ్చే టాన్సిలెైటీస్‌కు ఈ మందు బాగా పని చేయును. టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురెై సైజు పెరిగి గొంతునొప్పి మొదలవుతుంది. గొంతు నొప్పి మూలంగా ద్రవ పదార్థాలు సైతం మింగడం కష్టమవుతుంది. జ్వరంతో నీరసంగా, అస్తిమితంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
ఈ మందులే కాకుండా ఫెర్రంఫాస్‌, సైలీషియా, బెరెైటామోర్‌, కాలిమోర్‌, మెగ్‌ఫాస్‌, లేకసిస్‌, కాల్కేరియా కార్బ్‌, సల్ఫర్‌, ఎపిస్‌ వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్‌ సలహా మేర కు వాడుకుని టాన్సిలెైటిస్‌ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
Read more >>

క్లిష్టమైన యాంజియో ఎంతో తేలిక

Operaa
‘ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల్లో మనం చేస్తున్న వినూత్న ప్రక్రియల్ని చేసి చూపించడం ద్వారా వైద్య రంగంలో మన మెంత ముందున్నామో ఇతర దేశస్తులందరికీ చెప్పగలుగుతున్నాం. ఇవాళ్ల వొర్లాండోలో జరుగుతున్న ‘క్లిష్టమైన గుండె రక్తనాళాల్లోని అడ్డంకుల్ని క్యాథటార్‌ ద్వారా తొలగించే చికిత్సలపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన అయిదు వేల మందికి పైగా హృద్రోగ నిపుణులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఇవాళ మనం గుండెకి రక్తం సరఫరా చేసే ముఖ్యమైన ఎడమవైపున ఉన్న రక్తనాళంలో అడ్డంకుల్ని యాంజియోప్లాస్టీ ద్వారా తొలగించి స్టెంట్‌వేసి మన దగ్గర చేస్తున్నటువంటి నిపుణత్వంతో కూడిన ప్రక్రియని చూపించగలిగాం. తక్కువ వయస్సు వాళ్ళల్లోనే ఇప్పుడు గుండె జబ్బులు వస్తున్నాయి. 


బైపాస్‌ సర్జరీతో వారిని ఇబ్బంది పెట్టడం కన్నా ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజీలో మణికట్టు ద్వారా కేథటార్‌ను పంపి చికిత్సని చేస్తున్నాం’ అన్నారు హైదరాబాద్‌ గ్లోబల్‌ హాస్పిటల్‌ నుంచి ఒక క్లిష్టమైన యాంజియోప్లాస్టీ స్టెంటింగ్‌ కేసుని దిగ్విజయంగా అంతర్జాతీయ సదస్సుకి చూపించిన అనంతరం డాక్టర్‌ రవికుమార్‌ ఆలూరి.శస్త్ర చికిత్సలో ఎక్కువ కోతలతో రక్తస్రావం అధికం. ఒక్కోసారి కుట్లు వేసిన ప్రాంతం ఇబ్బంది పెడుతుంది. నయంకావడానికి సమయం పడుతుంది. అందుకే వైద్యరంగం అభివృద్ధితో క్రమంగా తక్కువ కోతల చికిత్సలు, కీ హోల్‌ శస్తచ్రికిత్సలాంటివి ప్రాముఖ్య తని సంతరించుకున్నాయి. వాటితో పాటు శరీరంలోకి కేథటార్‌ని పంపించి రక్తనాళాలలోని అడ్డంకుల్ని తొలగించే ఇంటర్‌వెన్షనల్‌ కూడా కార్డీయాలజీ ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది.

ఇంతకు ముందు శస్త్ర చికిత్సలు చేసి గుండె రక్తనాళాలలోని కొన్ని అడ్డంకులు తొలగించేవారు. ఇప్పుడు యాంజియో ద్వారా చికిత్సలు కొన్ని చేస్తున్నారు. అంటే క్లిష్టతరమైన యాంజియోలు ఇప్పుడు శస్తచ్రికిత్స లేకుండా చేస్తున్నారు. క్లిష్టతర యాంజియోలు అంటే గుండె రక్తనాళాలలోని ఎడమ పక్క రక్తనాళాలలో అడ్డంకులు (బ్లాక్స్‌) వచ్చినా, రక్తనాళాలు చీలే చోట అడ్డంకుల్ని తొలగించి స్టెంట్‌లు పట్టడం. మూడు సంవత్సరాలకు పైగా బ్లాక్స్‌ ఉండి అవి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేసి గట్టిగా మారినా, అలాగే హార్ట్‌ ఎటాక్‌ వచ్చినా తరువాత స్టెంట్‌లు వేయాల్సి వచ్చినా, బైపాస్‌ సర్జరీ గ్రాఫ్ట్‌ ప్రాంతాలలో అడ్డంకులు వచ్చినా ఇవన్నీ క్లిష్టతరమైన యాంజియోలు. 

వీటిలో కొన్నింటికి ఇంత వరకు శస్తచ్రికిత్స ఒక్కటేమార్గం. ఇప్పుడు వీటిని కాంప్లెక్స్‌ (క్లిష్టతరమైన) యాంజియో ద్వారా చేతిమణికట్టు ద్వారా కేథటార్‌ గుండె రక్తనాళాలలోకి పంపి అడ్డంకుల్ని తొలగించి స్టంట్లను వేస్తున్నారు. ఈ యాంజియోప్లాస్టీ కూడా ఇంతకు ముందు తొగలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. దీనివల్ల రోగి కదలకుండా పడుకోవలసిన అవసరం ఉండేది. రక్తస్రావం ఎక్కువ అవుతంది. హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండవలసి వస్తుంది.అందుకే ఇప్పుడు చేతిమణికట్టు దగ్గర రేడియల్‌ రక్తనాళాల ద్వారా కేథటార్‌ని పంపి చికత్స చేస్తున్నారు. 
Read more >>

హృద్రోగులకు జాగ్రత్తలు

హృదయ స్పందన వేగం తగ్గితే...
1) రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు.
2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
3) నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే...
1) గుండె దడ వస్తుంది
2) సృహ తప్పడం జరుగుతుంది
3) తల తిరిగినట్లుగా అనిపిస్తుంది.
చికిత్స విధానం:
గుండె వేగం తగ్గినప్పుడు చాతి పెైభాగంలో చర్మం కింద ‘పేస్‌ మేకర్‌’ అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పరిగినప్పుడు బీటా బ్లాకర్స్‌ గుండె లయను క్రమబద్దీకరించే మందులు ఇస్తారు.
గుండె లయ తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
2) క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3) బరువు పెరగకుండా చూసుకోవాలి.
4) రక్త పోటును అదుపులో పెట్టుకోవాలి.
5) కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి.
6) సమతూ ఆహారం తీసుకోవాలి.
7) పొగ తాగటం మానివేయాలి.
8) జీవనశెైలిని, ఆదనపు అలవాట్లు మార్చుకోవాలి.
Read more >>

మద్యపానీయాలు ఆరోగ్య దుష్ర్పభావాలు

ఇటీవల కాలంలో పట్టణాలలోనే కాక, గ్రామాలలో కూడా మద్యపానం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో, వ్యవసాయధారులు తాగుడు వల్ల ఎన్నో అనర్థాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం ఎక్కువ అవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ ఆదాయం తగ్గి, సామాజిక సమస్యలతో బాధపడు తున్నారు.

మద్యపానీయులను (ఆల్కహాలు) చక్కెర ఉన్న ద్రవ పదార్థాలను పులియ బెట్టి తయారు చేస్తారు. ఈ మద్యపానీయాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి.బట్టీ పట్టిన మద్య పానీయాలలో మాల్టెడ్‌ మద్యాలు, వెైన్ల కన్నా ఆల్కహాల్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

మద్యపానీయాల వినియోగంలో సురక్షిత పరిమితులు:
ఎంత మద్యం తాగితే సురక్షితమో చెప్పడం చాలా కష్టం.
మద్యం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది అన్న దాన్ని సూచనగా తీసుకున్నట్ల యితే కింద తెలిపిన మోతాదుకు మించి తాగ రాదు.
మగవాళ్లు : ఒక రోజుకు 190 మి.లీ. లేదా 1/4 సిసీ ఘాటు మద్యం.
ఆడవాళ్లు : రోజుకు 65 మి.లీ.
ప్రతిరోజు తాగే వారికి ఎప్పుడో సరదా కోసం తాగేవారి కంటే ఎక్కువ హాని కలుగుతుంది.
ఒక వారం రోజుల పెైగా తాగే ఆల్కహాలును ఒకటి రెండు రోజుల్లోనే తాగి నట్లయితే గాయపడడానికి, ప్రమాదాల వల్ల చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఆహార పోషణలో మద్యం పాత్ర?
ఒక గ్రామం మద్యం ద్వారా 7.0 కాలరీల శక్తి లభిస్తుంది. కానీ ఈ కాలరీలు అంత మంచివి కాదు. ఎందుకంటే వీటిలో ఆహార పుష్టినిచ్చే గుణం లేదు. కేవలం శక్తిని మాత్రం ఇస్తాయి. పేదవారిలో, ముఖ్యంగా సాంఘీక, ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్న వారిలో మద్యపానం వలన లోప పోషణ ఎక్కువ కలుగుతుంది. మద్యపానం చేసే వారు ఆరోగ్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ ఆహారం తింటారు. దీనికి గల కారకాలు ఏమిటంటే... 
  • ఆహారం తక్కువగా తీసుకోవడమూ, ముఖ్యంగా అన్ని పోషకాలు గల సమతూల ఆహారాన్ని తీసుకోకపోవడము.
    Alco3
  • జీర్ణకోశంలో మార్పు రావడం వలన గాని, సరిగా పని చేయకపోవడం, పోషక పదార్థాలు సరిగా గ్రహించుకో లేకపోవడం, లోప పోషణ వలన పేగులు పాడవడం జరుగుతుంది.
  • కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్‌ దెబ్బతినడం.
  • శరీరంలో పోషకాల జీవక్రియ, నిల్వ ఉంచుకొనే శక్తి తగ్గటం.
  • పోషక పదార్థాలు, ముఖ్యంగా బి విటమిన్ల అవసరం ఎక్కువ కావడం.
  • మల మూత్రాల ద్వార ఎక్కువ పోషకాలు విసర్జితం కావడం.

    మద్యపానీయాలతో కలిగే అనార్యోగ్య పరిస్థితులు
    మద్యం సేవించడం వలన చాలా శరీర భాగాలకు, జీవకోశాలకు అనేక విధాల హాని కలుగుతుంది.

    జీర్ణకోశం వ్యాధులు:
    ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, అది సంక్రమించే లోప పోషణ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటు న్నప్పటికీ, మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పెైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి. రక్తం కక్కుకుంటారు. సృ్పహ కూడ తప్పవచ్చు. వీరిని నొప్పి నుండి, మరణం నుండి కాపాడాలంటే సకాలంలో చికిత్స చేయించాలి. మద్యపానం మానిపించాలి. పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. మద్యపానం వల్ల పేగులు, పాన్‌క్రియాస్‌ కూడా బాగా దెబ్బ తింటాయి.

    గుండె జబ్బులు:
    బి1 (థెైయమిను) లోపసం వల్ల గుండెలోని కండరాలకు హాని కలగడం చేత గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
    రక్తహీనత:
    మద్యపానీయాలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.
    మెదడు నరాలు:
    తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. విటమిన్లు, ముఖ్యంగా ‘బి’ విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపెై చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడు తుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం చేసే వ్యక్తి ఒకసారి ఇలాంటి లోపానికి గురయితే చికిత్స చేయడం కష్టమవుతుంది.
    లెైంగిక వాంఛ: పరుషుల్లో మద్యపానం వల్ల లెైంగిక వాంఛ తగ్గిపోతుంది. నపుంసత్వం ఏర్ప డుతుంది. ముఖం మీద వెంట్రుకలు తగ్గి ఆడంగి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలున్నపుడు తాగుడు మరింత పెరిగి, వారి పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. తాగుడు పూర్తిగా మానడమే దీనికి విరుగుడు.
    క్యాన్సర్‌:ఆల్కహాలిసమ్‌ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబం ధం ఉంది.తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగు డుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది. వారు పనికి తరచు గెైరు హాజరవుతారు. అనారోగ్యానికి గురవుతా రు. ఈ కారణాల వల్ల ఉత్పత్తి పడిపోతుం ది. తాగుడు నిరుద్యోగానికి దారి తీస్తుంది. అకాల మరణం కూడా సంభవించవచ్చు. మద్యపానం అలవాటుగా మారకముందే దాని వల్ల కలిగే ముప్పును గ్రహించాలి. లేని పక్షంలో రకరకాల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. 
Read more >>

నరాల సంబంధ వ్యాధులు

డయాబెటిస్‌ ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపించే కాంపిే్లకషన్‌ నరాలు డామేజి కావటం! దీనిని న్యురోపతి (చీవతీశీజూ్‌ష్టవ్ర) అంటారు. రక్తంలో గ్లూకోజు అత్యధి కస్థారుులో ఎక్కువకాలంపాటు ఉన్నపడు రకరకాల విధాలుగా ఆ వ్యక్తి శరీరంలో నరాలు డామేజ్‌ కావటం మెుదలెడతారుు. డయాబెటిస్‌ మూలంగా వచ్చే నరాల డామేజి బాధాకరమే అరుునా చాలా సందర్భాలలో అది తీవ్రస్థారుుకి చేరుకోదు.

న్యురోపతిలో రెండురకాలు ఉంటాయి :
1. కాళ్ళకు, చేతులకు వచ్చే పెరిఫెరల్‌ న్యూరోపతి (్క్ఛటజీ ఞజ్ఛిట్చజూ ూ్ఛఠటౌఞ్చ్టజిడ) కూడా ఉంటుంది. 
2. జీర్ణయంత్రాంగానికి, మూత్ర విసర్జన యంత్రాంగా నికీ, రక్తనాళాలకూ వచ్చే అటోనామిక్‌ న్యురోపతి (అఠౌౌ్ట ఝజీఛి ూ్ఛఠటౌఞ్చ్టజిడ).
రక్తంలోని గ్లూకోజును నిరంతరంగా ఎప్పటికపడు అదుపులో ఉంచుకోవటం ద్వారా అఠౌౌ్టఝజీఛి ూ్ఛఠటౌ ఞ్చ్టజిడ రాకుండా చూసుకోవచ్చు.

జీర్ణయంత్రాంగానికి సంబంధించిన న్యూరోపతి:
దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
Un3
  • తేన్పులు
  • మలబద్ధకం
  • గుండెల్లో మంట (ఏ్ఛ్చట్టఛఠట)
  • తెమలటం
  • వాంతులు
  • అన్నం తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించటం

    చికిత్స
  • ఒకేసారి కడుపునిండా కాకుండా కొద్దికొద్దిగా నాలుగ యిదు సార్లు తినటం
  • డాక్టరు పర్యవేక్షణలో మందుల వాడకం

    రక్తనాళాలకు సంబంధించిన న్యురోపతి :
    దీని లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
    గభాల్న లేచినపడు కళ్ళు బెైర్లు కమ్మటం
    గుండె వేగంగా కొట్టుకోవటం
    స్పృహ తప్పబోతున్నట్లు అనిపించటం (ఈజ్డ్డీజ్ఛీటట)
    లోబీపి
    చికిత్స కూర్చున్న లేక పడుకున్న పొజిషన్‌ నుంచి గభాల్న ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా లేచి నిలబడటం
    డాక్టరు పర్యవేక్షణలో మందులు


    పురుషాంగానికి సంబం దించిన న్యురోపతి :
    పురుషాంగానికి వెళ్లే నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కిందివిధంగా ఉంటాయి : అంగస్తంభన జరగకపో వటం, లేక స్తంభించిన అం గం ఎక్కువసేపు నిలవక పోవటం. దీనిని ఉట్ఛఛ్టిజీజ్ఛూ ఈడటజఠఛ్టిజీౌ అంటారు.స్కలన సమస్యలు. స్కలనం పొడి (ఈటడ) గా ఉండటం లేక అతి తక్కువ స్కలనం జరగటం.
    గమనిక : అంగస్తంభన సమస్యలు డయాబెటిస్‌ మూలంగానే కాకుండా ఇంకా ఇతర కారణాలవల్ల కూడా రావచ్చు. ఉదాహరణకు మందుల సైడ్గ ఎఫెక్ట్‌ కారణంగా, లోబీపి కారణంగా, డిప్రెషన్‌లో ఉన్నపడు, స్ట్రెస్‌ లేక ఏదెైనా ఆందోళన కారణంగా, భార్యాభర్తల మధ్య బెడిసికొట్టిన సంబంధాల కారణంగా, మొదలెై నవి...ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి నేరుగా డయాబెటిస్‌ కారణంగానే అని అనుకో కుండా డాక్టరు చేత నిర్ధారణ చేయించు కోవటం అవసరం.
    చికిత్స

    కౌన్సెలింగ్‌
    మందుల వాడకం
    స్ర్తీ జననేంద్రియాలకు సంబంధించిన న్యూరోపతి:
    స్ర్తీ జననేంద్రియాలకు వెళ్ళే నరాలు దెబ్బతినటం వల్ల ఈ కింది లక్షణాలు చోటుచేసుకుంటాయి.
    యోని పొడిగా ఉండటం
    సంయోగంలో ‘భావప్రాప్తి’ సరిగా కలగకపోవటం లేక అసలు భావప్రాప్తే కలగకపోవటం

    చికిత్స
    కౌన్సిలింగ్‌
    ఈస్ట్రోజన్‌ తెరపి
    తడికోసం యోనికి రాసుకునే క్రీములు, లూబ్రికెంట్‌లు (ఔఠఛటజీఛ్చ్టిట)
    మ్త్రూవ్యవస్థ ((్ఖటజ్చీటడ ఖిడట్ట్ఛఝ) కి చెందిన న్యురోపతి :
    మ్త్రూయంత్రాంగ వ్యవస్థకు చెందిన నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కింది విధంగా

    ఉంటాయి :
    ఒక్కసారిగా మ్త్రూవిసర్జన చేయలేకపోవటం (మూత్రాశయాన్ని - ఆజ్చూఛీఛ్ఛీటని - ఒకేసారి ఖాళీ చేయలేకపోవటం)
    కడుపు ఉబ్బరం
    మూత్రాన్ని ఆపుకోలేకపోవటం (ఐఛిౌ్టజ్ఛీఛ్ఛి)
    రా్త్రులు మాటిమాటికీ మ్త్రూవిసర్జనకు వెళ్ళటం
    చికిత్స
    డాక్టరు పర్యవేక్షణలో మందులవాడకం
    అవసరమయితే సర్జరీ

    పురుషాంగానికి సంబం దించిన న్యురోపతి
    పురుషాంగానికి వెళ్లే నరాలు దెబ్బతినటం వల్ల వచ్చే లక్షణాలు ఈ కిందివిధంగా ఉంటాయి :
    అంగస్తంభన జరగకపో వటం, లేక స్తంభించిన అం గం ఎక్కువసేపు నిలవక పోవటం. దీనిని ఉట్ఛఛ్టిజీజ్ఛూ ఈడటజఠఛ్టిజీౌ అంటారు.స్కలన సమస్యలు. స్కలనం పొడి (ఈటడ) గా ఉండటం లేక అతి తక్కువ స్కలనం జరగటం.
Read more >>

ఫ్యాటీలివర్‌తో కాలేయానికి ముప్పు

ఫ్యాటీలివర్‌తో కాలేయానికి ముప్పు

మానవ శరీరంలో అతికీలకమైన అవయవం కాలేయం. ఈ అవయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉన్న ఈ సమస్యను ఆధునిక చికిత్సలతో సులభంగా తగ్గించవచ్చని అంటున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా. ఎమ్.ఎన్. పవన్‌కుమార్.

పై పొట్టలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని తెలిసిన మాత్రలేవో వేసుకుని ఉండిపోతారు. చివరకు నొప్పి ఎక్కువయ్యాక ఆసుపత్రికి వెళితే అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఫ్యాటీలివర్ అని తేలుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

కారణాలు
ఫ్యాటీ లివర్ సమస్య చేజేతులా కొనితెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చిప్స్, బర్గర్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయవాపుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ మూలంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది.

ఏం జరుగుతుంది?
శరీరంలోని కొవ్వును వివిధ భాగాలకు అందజేసే ప్రక్రియను నిర్వర్తించడంలో లివర్ ప్రధానపాత్ర పోషిస్తుంది. శరీరంలోకి వచ్చిన ఫ్యాట్ అంతా కాలేయంలో నుంచి వచ్చిన ఎంజైమ్స్‌తోనే డైజెస్ట్ అవుతుంది. శరీరానికి, గుండె వంటి కొన్ని అవయవాలకు కొంత ఫ్యాటీ యాసిడ్స్ అవసరమవుతాయి. కానీ అధిక మొత్తంలో కొవ్వు వచ్చి చేరినపుడు అది శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా కణాలు ఉబ్బి ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది. ఇది మొదటి దశ. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉబ్బిన కణాలు పగిలిపోతాయి. దీంతో ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇది రెండవ దశ. ఆల్కహాల్ ఎక్కువ మెతాదులో తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లయితే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. ఆహారపు అలవాట్ల వల్ల వచ్చినట్లయితే నాన్ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. వైరస్‌ల వల్ల వచ్చినట్లయితే వైరల్ హెపటైటిస్ అని పిలుస్తారు. ఈ దశలో కూడా చికిత్స తీసుకోకపోతే లివర్ పూర్తిగా సింక్ అవుతుంది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటాము. ఇది మూడవదశ.

లక్షణాలు
పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది. కొందరిలో అల్ట్రాసౌండ్ పరీక్షలో ఫ్యాటీలివర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. లక్షణాలు మాత్రం కనిపించవు. రెండవ దశలో కామెర్లు(జాండిస్) కనిపిస్తాయి. రక్తస్రావం మొదలవుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. పొట్టలో, కాళ్లలో నీరు పేరుకుపోతుంది. మూడవ దశలో కూడా ఇవే లక్షణాలు కనిపించడంతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినడం మొదలవుతుంది.

చికిత్స
ఫ్యాటీలివర్ సమస్య ఎందువల్ల వచ్చింది కనుక్కోవాలి. కారణాన్ని తెలుసుకుని అందుకు తగిన చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌ను ఫాస్టింగ్‌లో చేయించాలి. కాలేయ పనితీరును తెలుసుకోవడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, బరువును తగ్గించుకోవడంతో పాటు మందులు వాడాల్సి ఉంటుంది. రెండవ దశలో ఆసుపత్రికి వెళ్లినా మందులతో బాగు చేయవచ్చు. 70 శాతం లివర్‌పాడయినా మిగతా బాగున్న 30 శాతం లివర్ దెబ్బతినకుండా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మూడవ దశలోకి అంటే లివర్ సిర్రోసిస్‌కు దారితీయకుండా కాపాడటం జరుగుతుంది. 

మూడవ దశ అంటే లివర్‌సిర్రోసిస్‌లో కాలేయం సింక్ అయిపోయి ఉంటుంది. పాడయిన లివర్‌ను బాగుచేయడం కుదరదు. అయితే లివర్ 10 శాతం బాగున్నా శరీరానికి సరిపోతుంది. ఈ దశలో చికిత్స ఏమిటంటే ఆ పది శాతం దెబ్బతినకుండా కాపాడటమే. దీంతోపాటు కాలేయం మీద ఒత్తిడి పడకుండా చూడటం, ఇతర కాంప్లికేషన్స్ రాకుండా మందులు ఇవ్వడం జరుగుతుంది. లివర్‌కు సపోర్టుగా మెడిసిన్స్ ఇవ్వడం, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా మందులు ఇవ్వడం, పేగుల్లో బాక్టీరియా తగ్గడానికి యాంటీ బయాటిక్ మందులు ఇవ్వడం వంటివి చేస్తాము. మొదటి దశ, రెండవ దశలో వచ్చిన వారికి చికిత్స ఇవ్వగలం. మూడవ దశలో చికిత్స ద్వారా పాడయిన కాలేయాన్ని బాగుచేయలేం.

గాల్‌స్టోన్స్
గాల్‌స్టోన్స్ ఏర్పడటానికి కొలెస్ట్రాల్ కారణమవుతుంది. గాల్‌బ్లాడర్ కాలేయం కింద ఉంటుంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువయినపుడు కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. అప్పుడు కాలేయం దాన్ని బయటకు పంపించేస్తుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళుతుంది. లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే బైల్‌లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇది గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి చివరకు గట్టిపడి స్టోన్స్‌గా మారిపోతుంది. జీర్ణక్రియ జరుగుతున్నపుడు బైల్ అంతా జీర్ణక్రియ కోసం వెళుతుంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు బైల్ అంతా ఎక్యుములేట్ అయిపోతుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే గాల్‌స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చికిత్స
గాల్‌బ్లాడర్‌లో ఏర్పడే స్టోన్స్ మెడిసిన్‌తో కరగవు. ఇవి కొలెస్ట్రాల్ మూలంగా ఏర్పడినవి. ఆపరేషన్ చేసి తొలగించడం ఒక్కటే పరిష్కారం. అయితే రాళ్లు ఉన్నంత మాత్రాన అందరికీ సర్జరీ అవసరం లేదు. నొప్పి ఉన్నప్పుడు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అంటే షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేనప్పుడు ఆపరేషన్ చేయాల్సిఉంటుంది. మళ్లీ రాళ్లు ఏర్పడకుండా ఉండటం కోసం గాల్‌బ్లాడర్‌ను పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ప్రస్తుతం లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ తొలగించడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సిల్స్(సింగిల్ ఇన్‌సిషన్ లాప్రోస్కోపిక్ సర్జరీ) అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో బొడ్డు దగ్గర ఒకే రంధ్రం చేసి గాల్ బ్లాడర్ తొలగించడం జరుగుతుంది. ఈ సర్జరీ వల్ల రోగి త్వరగా కోలుకుంటారు. 
Read more >>

Monday

మూత్ర వ్యాధులకు మేలైన వైద్యం

మూత్ర వ్యాధులకు మేలైన వైద్యం

మూత్రవ్యాధులు ఏర్పడడానికి బ్యాక్టీరియా ముఖ్య కారణం. ఈ ఇన్‌ఫెక్షన్ మహిళలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయంలో బ్లాడర్, యురేత్రా, మూత్రపిండాలు, యురేటర్స్ మొదలైన భాగాలుంటాయి. సాధారణంగా మూత్రాశయం అంతర్భాగం ఎపితేలియమ్ అనే పొరతోటి కప్పబడి ఉంటుంది. ఇది మూత్రాశయాన్ని ఇన్‌ఫెక్షన్ నుండి కాపాడుతుంది. ఈ పొర గాయపడినపుడు ఇ. కోలై, స్టెఫైటోకోరస్ వంటి బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మూత్రాశయం క్రింద భాగంలో వచ్చే సమస్యను సిస్జెటిస్, యురేత్రైటిస్ అంటారు. పైభాగంలో వచ్చే సమస్యను పైలోనెఫ్రైటిస్ అంటారు.

కారణాలు
* మహిళలలో మూత్ర విసర్జన ద్వారము(యురేత్రా), మల విసర్జన ద్వారము(ఆనస్) దగ్గరగా ఉండడం వలన ఇన్‌ఫెక్షన్ సులువుగా వచ్చే అవకాశం ఉంది.

* డయాబెటిస్ లేదా అతిమూత్ర వ్యాధి.

* వయస్సు మీరిన వారిలో వచ్చే అవకాశం ఉంది.

* మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోవడం(యూరినరీ రిటెన్షన్).

* గర్భిణి స్త్రీలలో.

* శస్త్ర చికిత్సల సమయంలో పెట్టే యూరినరీ కాథెటర్ వలన వచ్చే అవకాశం ఉంది.

* పురుషులలో ప్రొస్ట్రెట్ గ్రంథి వాపు వల్ల వచ్చే అవకాశం ఉంది.

* కదలికలు లేకుండా ఎక్కువ కాలం ఉండటం వల్ల ఉదాహరణకు ఎముక ఫ్రాక్చర్ వంటివి.

* కొత్తగా పెళ్లయిన దంపతులలో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని హనీమూన్ సిస్టైటిస్ అంటారు.

లక్షణాలు... మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రం ఆగిఆగి రావడం, పూర్తిగా విసర్జించలేకపోవడం, తరచు మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్ర విసర్జన ద్వారము వద్ద దురద, జ్వరంగా ఉండటం, చలి, వాంతులు అవ్వడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి.

వ్యాధి నిర్ధారణా పరీక్షలు... సివిఇ, సిబిపి మరియు ఇఎస్ఆర్, యూరిన్ అనాలిసస్ అండ్ కల్చర్, అల్ట్రా సౌండ్, యుఎస్‌జి కిడ్నీస్, బ్లాడర్, కెయుబి, ఆర్‌బిఎస్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఇన్‌ట్రావీనస్ పైలోగ్రామ్(ఐవిపి), సిటి స్కాన్ అబ్డామెన్, ప్రొస్ట్రెట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది పురుషులలో ప్రొస్ట్రేట్ గ్రంథి వాపు ఉంటే చేస్తారు(పిఎస్ఎ టెస్ట్).

తీసుకోవలసిన జాగ్రత్తలు
* నీరు ఎక్కువగా తీసుకోవాలి.

* జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

* బిగుతుగా ఉండే లోదుస్తులు వాడకూడదు.

* జననేంద్రియాల వద్ద డియోడెరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వంటి సుగంధ ద్రవ్యాలు వాడకూడదు.

హోమియో చికిత్స ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు అరెంటమ్ నైట్రికమ్, కాస్టికమ్, మెర్క్‌సాల్, కాన్తారిస్, నైట్రిక్ యాసిడ్, క్లిమేటిస్ కన్నాబిస్ సెటైవా, తూజా.

అర్టెంటమ్ నైట్రికమ్: ఇది నరాలు, మెదడు మీద మంచి ప్రభావం చూపుతుంది. మూత్రం తెలియకుండా రావడం, మూత్ర మార్గంలో వాపు, నొప్పి, మంట, మూత్రం ఆగిఆగి రావడం, మూత్రం కొంచెంగా ఉండి రంగు ఎక్కువతో కూడి ఉండటం వంటి లక్షణాలు ఉన్న వారికి ఇది దివ్యౌషధం.

కాస్టికమ్: దగ్గినపుడు, తుమ్మినపుడు మూత్రం పడటం, మూత్రం మెల్లగా ఆగిఆగి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ముఖముపై పులిపిర్లు కలిగి ఉండటం వంటి లక్షణాలకు ఈ మందు బాగా పనిచేస్తుంది.

మెర్క్‌సాల్: మూత్రం తరచు రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, మూత్రం ముదురు రంగులో, కొంచెంగా, రక్తం కలిగి ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు చక్కని ఉపశమనం కలిగిస్తుంది.

కాన్తారిస్: మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్ర విసర్జనకు ముందు, తర్వాత తీవ్రమైన నొప్పి, మంట, మూత్రాశయం మొత్తం కత్తులతో పొడిచినట్లు నొప్పి, రక్తంతో కూడిన మూత్రం చుక్కలుగా రావడం, తరచు మూత్ర విసర్జన చేయాలనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందు తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది.

నైట్రిక్ యాసిడ్: మూత్రం కొంచెంగా, వాసనతో కూడి ఉండటం, మూత్ర విసర్జన సమయంలో మంట, చర్మం చీల్చినట్లు నొప్పి, మూత్రంలో రక్తం, చీము వంటివి ఉండటం, నోటి పూత, అర్శమొలలు, ఫిజర్, పుండ్ల నుండి రక్తం కారడం, పులిపిర్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే ఈ మందు ఉపశమనం కలుగచేస్తుంది.

క్లియాటిస్: ఇది గ్రంథులు, జననేంద్రియాలు, చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది. మూత్ర విసర్జన తర్వాత కొంతసేపటి వరకు నొప్పి ఉండటం, తరచూ కొద్దిగా, మంటతో కూడిన మూత్రం రావడం, మూత్రం ఆగి ఆగి రావడం, గ్రంథుల వాపు, చర్మంపై దురదులు మొదలైన లక్షణాలకు ఇది మంచి మందు.

తుజా: ఇది చర్మం, మూత్రపిండాలు, మెదడు, రక్తం మొదలైన భాగాలపై మంచి ప్రభావం చూపుతుంది. మూత్రద్వారం వాపు, నొప్పి, మూత్రం ఆగి ఆగి రావడం, మూత్ర విసర్జన తర్వాత నొప్పి, తరచూ మూత్రం రావడం, మూత్రంపై నియంత్రణ తగ్గడం మొదలైన లక్షణాలకు ఇది చక్కని మందు.

ఏదేమైనా రోగి లక్షణాలు, అతని గత ఆరోగ్య జీవితాన్ని ఆధారం చేసుకుని హోమియో వైద్య చికిత్స అందచేయడం జరుగుతుంది. వ్యక్తి వ్యక్తిని బట్టి చికిత్సా విధానం మారుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందులను వాడవలసి ఉంటుంది.
Read more >>

Wednesday

బొల్లి వ్యాధి హోమియోతో దూరం

బొల్లి వ్యాధి హోమియోతో దూరం

చర్మవ్యాధులు అంటేనే తెలియని భయం. ముఖం మీద, కనురెప్పల పైన, వేళ్లపైన తెల్లటి మచ్చలు కనిపిస్తే చాలు ఆందోళనతో మానసికంగా కుంగిపోయి జీవితంలో అన్నీ కోల్పోయామనే భావనలోకి వెళ్లిపోతారు. బొల్లి వ్యాధి బారినపడిన వారి పరిస్థితి ఇది. ఎన్ని మందులు వాడినా తగ్గని ఈ వ్యాధికి హోమియోపతి ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుందని అంటున్నారు డాక్టర్ .



బొల్లి లేదా తెల్లమచ్చల వ్యాధి శారీరకంగా పెద్దగా బాధపెట్టకపోయినా మానసికంగా కుంగదీసేలా చేస్తుంది. ఈ వ్యాధి బారినపడిన ప్రతీ ఒక్కరూ నిరాశతో కనిపిస్తారు. శరీరంపై తెల్లమచ్చలు ఎందుకు వస్తాయి? అనిప్రశ్నిస్తే ముందుగా చర్మం గురించి చెప్పుకోవాలి. చర్మం శరీరంలోని అన్ని ముఖ్యమైన భాగాలను కప్పివుంచి రక్షణకవచంలాగా పనిచేస్తుంది. చర్మంలో మూడు పొరలుంటాయి.

అవి ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. వయసుతో పాటు చర్మంలో మార్పులు రావడం సహజం. వయసు పెరిగేకొద్దీ చర్మంలోని రక్తనాళాలు, గ్రంధులకు రక్తసరఫరా తక్కువ కావడం వల్ల ముడతలు పడతాయి. చర్మంలోని కాంతి తగ్గి, కాంతివిహీనంగా కనిపిస్తుంది. జీవనశైలిలోని మార్పులు, మానసిక ఒత్తిడుల వల్ల శరీరంలో కలిగే రసాయనిక మార్పుల వల్ల రక్షణ వ్యవస్థ మెలనోసైట్స్ అనే కణజాలంపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలోని మెలనోసైట్స్ నశిస్తాయి. దీనివల్ల మనకు తెల్లమచ్చలు ఏర్పడతాయి. ఇది ప్రారంభంలో ఒకే చోట కనిపించినా క్రమంగా శరీరమంతటా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది.

కారణాలు
జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం వల్ల కలిగే అలర్జీ, జీవనశైలిలోమార్పులు, అతిగా కాఫీ, టీ తాగే అలవాటు ఉండటం, వాడిన నూనె మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం, మసాలాలు విరివిగా వాడటం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌ఫెక్షన్స్, తాగే నీటిలో రసాయనాలు, ఆహార లోపం, విటమిన్లలోపం, సౌందర్యసాధనాలు విరివిగా వాడటం వంటివి కూడా కారణమవుతాయి. ఈ కారణాల వల్ల రక్తంలో మలినాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. జీవనవిధానంలో మార్పుల వల్ల రక్తంలో టాక్సిన్స్ ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, తీవ్రమైన శారీరక శ్రమ వల్ల రక్తంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుని ల్యూకోడెర్మా, సొరియాసిస్ వంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి.

లక్షణాలు
చాలా మందిలో తెల్లమచ్చలు, ముఖం, పెదవుల మీద, కనురెప్పల మీద మొదలవుతాయి. క్రమేణా పాదాలు, అరచేతులు, వేళ్లకు వ్యాపిస్తుంది. ఎండను వేడిమిని తట్టుకోలేకపోతారు. చర్మం తెల్లగా మారిన ప్రాంతంలోని వెంట్రుకలు తెల్లగా మారుతాయి. కొన్నిసార్లు ఈ మచ్చలు అకస్మాత్తుగా శరీరమంతా పాకుతాయి. ఎండలో ఎక్కువగా తిరిగినపుడు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు తొందరగా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది.

శోభి
శరీరంపైన గోధుమ రంగులో మచ్చలు, తెల్లటి మచ్చలు కలిసి వచ్చే సమస్యని శోభి అంటారు. ఫంగస్ తరహా పరాన్నజీవి వల్ల ఈ మచ్చలు వస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చెమట ఎక్కువగా పోస్తున్నప్పుడు, చమురు గ్రంధులు సెబమ్ అనే చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ ఫంగస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ మచ్చలు ముందు చిన్నవిగా మొదలయి పెద్దగా మారతాయి. ఛాతీ, వీపు, మెడ, మెడ కింద భాగాల్లో కనిపిస్తాయి. దురద ఉండదు కానీ సన్నగా పొట్టు మాదిరిగా రాలుతుంటుంది. ఈ మచ్చలకు ప్రారంభదశలో చికిత్స తీసుకోకపోతే క్రమేణా చర్మమంతా మందంగా, దళసరిగా, నల్లగా తయారవుతుంది.

వ్యాధి నిర్ధారణ
చాలా మంది ఈ మచ్చలను సొరియాసిస్ అనుకుని భయపడుతుంటారు. కానీ సొరియాసిస్ తెల్లగా, పొట్టుపొట్టుగా రాలుతూ ఉంటుంది. కొన్ని రకాల రక్తపరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, సీబీపీ. సీరమ్ ఐజీఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. చాలా కేసులలో రోగి మానసిక, శారీరక కుటుంబ చరిత్రతో వ్యాధినిర్ధారణ చేయబడుతుంది. చికిత్స ఈ వ్యాధి బారినపడిన వారికి మానసిక ఉత్సాహాన్ని అందించాలి. ఆందోళనను తగ్గించాలి. డయాబెటిస్ ఉన్న వారు వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. ఈ వ్యాధి అంటువ్యాధి కాదు. స్నేహితులకు, పిల్లలకు, భాగస్వామికి సంక్రమించడం జరగదు. చాలా మందిలో మానసిక ఒత్తిడులు, హార్మోన్ల సమస్యలు, ఎండలో ఎక్కువగా తిరగడం, కొన్ని ఇన్‌ఫెక్షన్ల వల్ల, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇది మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బారినపడినపుడు దాని గురించి మరింత ఆలోచించకుండా యెగా, మెడిటేషన్ లాంటివి చేయాలి, పోషకాహారం తీసుకోవాలి.

హోమియో చికిత్స
హోమియో వైద్యం ప్రకృతి నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాస్త్రీయతను సంతరించుకున్న ఈ విధానం వ్యాధినిర్ధారణతో పాటు వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స చేయడం జరుగుతుంది. ఫోటోథెరపీ లాంటి విధానాలతో తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది కానీ శాశ్వత ప్రయోజనం లభించదు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో పూర్తికాలం చికిత్సతీసుకుంటే ఈ వ్యాధికి తగిన పరిష్కారం లభిస్తుంది.
Read more >>

ఊడిపోయే దంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం

ఊడిపోయే దంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం
చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్లు సోకడం వల్ల దంతాలు కదలడం, ఊడిపోవడం జరుగుతుంటుంది. సాధారణంగా దంతాలన్నీ ఊడిపోతే తీసి పెట్టుకునే కట్టుడు పళ్లు అమర్చే పద్ధతి ఉండేది. తాజాగా మొత్తం ఊడిపోయిన దంతాల స్థానంలో ఫిక్డ్స్ దంతాలను అమర్చే ఆధునిక వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. చిగుళ్లలోని ఇన్‌ఫెక్షన్‌ను సమూలంగా తొలగించడంతోపాటు దవడలో ఇంప్లాంట్స్ వేసి దంతాలను ఫిక్స్ చేసే పద్ధతి ఎంతో సురక్షితమైనదని అంటున్నారు డెంటల్ ఇంప్లాంట్ సర్జన్.


నారాయణరెడ్డికి 74 ఏళ్లు. 50 ఏళ్ల వయసు వరకు దంతాలకు ఎటువంటి సమస్య లేదు. ఆ తర్వాత నుంచి చిగుర్ల నుంచి రక్తం రావడం, చిగుర్లు వాయడం, నోటి నుంచి దుర్వాసన, ముందు దంతాలు ఎత్తు రావడం ప్రారంభమైంది. అయితే నొప్పి లేదు కదాని దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. మూడేళ్ల తర్వాత 5, 6 పళ్లు కదిలి ఊడిపోయాయి. తర్వాత డాక్టర్‌ను కలుసుకోగా చిగుర్ల వ్యాధి వచ్చినందున సర్జరీ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్ దూరమవుతుందని, అలాగే కదిలే పళ్లు తీయించుకుని తీసి పెట్టుకునే పళ్లు కట్టించుకోవాలని సలహా ఇచ్చారు. సర్జరీ ఉంటే నొప్పి ఉంటుందన్న భయంతో నారాయణరెడ్డి డాక్టర్ సలహాను పట్టించుకోలేదు. కదులుతున్న పళ్లు వాటికవే ఊడిపోతాయన్న ఆలోచనతో ఆయన ఆ విషయాన్ని వదిలేశాడు.

కాలక్రమంలో ఒకటి రెండు మినహా మిగిలిన దంతాలన్నీ ఊడిపోయాయి. ఆ మిగిలిన ఒకటి రెండు కూడా కదులుతున్నాయి. మళ్లీ డాక్టర్‌ను సంప్రదించగా ఎముక పూర్తిగా అరిగిపోయిందని, ఇంప్లాంట్స్ చేసేందుకు తగినంత ఎముక లేదని, ఈ పరిస్థితిలో ఏమీ చేయలేమని తేల్చేశారు. దీంతో నారాయణరెడ్డిలో భయం మొదలైంది. ముఖంలో ముడుతలు వచ్చాయి. మాట స్పష్టత పోయింది. నమిలే పరిస్థితి లేకపోవడంతో మెత్తటి ద్రవ పదార్థం లాంటి ఆహారం తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో శక్తి తగ్గిపోయింది. వీటికి తోడు గుండె జబ్బు వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఎలా అయినా కట్టుడు పళ్లు పెట్టించుకోవాలన్న దృఢ నిశ్చయంతో తన మిత్రుని సలహా మేరకు మా ఆసుపత్రిని ఆయన సంప్రదించారు.

సర్జరీ విధానం
మొదటగా కదిలే పళ్లు ఉన్న చోట, వాచిన చిగుర్లకు వ్యాపించిన ఇన్‌ఫెక్షన్ తొలగించడానికి లేజర్ గమ్ సర్జరీ చేశాము. తర్వాత రక్త పరీక్షలు చేసి పైపళ్లు ఒక్కొటొక్కటిగా తొలగించి అక్కడ ఉన్న ఇన్‌ఫెక్షన్‌ను లేజర్‌తో నిర్మూలించాము. పళ్లు తీసిన సాకెట్‌లోనే మొత్తం 10 ఇంప్లాంట్స్ వేశాము. మొత్తం పైపళ్లు తీయడానికి, ఇంప్లాంట్స్ అమర్చడానికి 2 గంటల సమయం పట్టింది. పేషెంట్‌ను ఇంటికి పంపించి వేసి మరుసటి రోజు రమ్మన్నాము. మరుసటి రోజు కింది పళ్లు అన్నీ తీసివేయడం జరిగింది. కింది దవడలో ఇన్‌ఫెక్షన్‌ను తొలగించి 8 ఇంప్లాంట్స్ వేశాము. అదే రోజు కొలతలు తీసుకుని 24 గంటల్లోనే మొత్తం పళ్లను అమర్చాము. ఇప్పుడు నారాయణరెడ్డి 10 అన్ని రకాల ఆహారాన్ని నమిలి తింటున్నారు.

సర్జరీ ఎలా చేస్తారు?
లోకల్ అనస్థీషియాతో పైదవడలో 10 ఇంప్లాంట్స్, కింద దవడలో 8 ఇంప్లాంట్స్ అమర్చడం జరుగుతుంది. వాటి పైన పైదవడలో 14 ఫిక్డ్స్ పళ్లు(సిరామిక్ ఫిక్డ్స్ బ్రిడ్జి), కింది దవడలో 14 ఫిక్డ్స్ పళ్లను అమరుస్తాము. ఈ ఇంప్లాంట్స్ ఎవరైనా వేసుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. ఆరోగ్యవంతంగా ఉండే ఎవరైనా ఈ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. అలాగే ఈ ఫిక్డ్స్ పళ్లను వేసుకున్న తర్వాత ఆహారం నమిలేటప్పుడు నొప్పి గాని, ఇబ్బంది గాని ఉంటుందేమోనని కూడా భయపడుతుంటారు. అలాంటిదేమీ ఉండదు. ఫిక్డ్స్ పళ్లను అమర్చుకున్న తర్వాత ఆహారాన్ని నమలడంలో ఎలాంటి నొప్పి ఉండదు. ఇంప్లాంట్స్ పూర్తిగా కుదురుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు మాత్రం మెత్తటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నాలుగు నెలల తర్వాత అన్ని రకాల గట్టి పదార్థాలు తినవచ్చు. నమలడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఇంప్లాంట్స్ సురక్షితమా?
ఇంప్లాంట్స్ వల్ల ఇన్‌ఫెక్షన్లు సోకుతాయన్న అపోహ కూడా కొందరిలో ఉంటుంది. అయితే ఇంప్లాంట్స్ వల్ల ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశమే లేదు. అంతేగాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. విదేశాలలో సంవత్సరానికి 20-30 లక్షల మంది ఇంప్లాంట్స్ వేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతర మార్గాలలో దంతాలు అమర్చే విధానాలు పోయి ఇంప్లాంట్స్ ద్వారా మాత్రమే పళ్లు రిప్లేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే, ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్డ్స్ పళ్లు అమర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదు. 20 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు ఎవరైనా వీటిని అమర్చుకోవచ్చు. బయట ఊళ్ల నుంచి వచ్చే పేషెంట్స్ నాలుగైదు రోజులు ఉండేటట్లు వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మూడు రోజుల్లో ఇంప్లాంట్స్ వేయడం, దంతాలు ఫిక్స్ చేయడం పూర్తవుతుంది. తర్వాత ఒకటి రెండు రోజులు చెకప్ కోసం ఉండాల్సి ఉంటుంది.

ఫిక్డ్స్ పళ్లను అమర్చుకున్న తర్వాత ఆహారాన్ని నమలడంలో ఎలాంటి నొప్పి ఉండదు. ఇంప్లాంట్స్ పూర్తిగా కుదురుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు మాత్రం మెత్తటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నాలుగు నెలల తర్వాత అన్ని రకాల గట్టి పదార్థాలు తినవచ్చు.
Read more >>