Sunday

థైరాయిడ్‌ రోగులకు వరం రేడియో యాక్టివ్‌ అయోడిన్‌

థైరాయిడ్‌ ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని, థైరారుుడ్గ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయటంలో చోటు చేసుకున్న వైద్యపరమైన అభివృద్ధిని గురించి వైద్య నిపుణులు ప్రజలను జాగృతం చేసి, వారికి అవగాహన కల్పిస్తున్నారు. థైరారుుడ్గ క్యాన్సర్‌ చికిత్సలో రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ చికిత్స ప్రాధాన్యాన్ని, ప్రభావశీలతను గురించి అవగాహనను వ్యాపింప జేయవలసిన అవసరాన్ని గురించి నిపుణులు ప్రత్యేకంగా వివరించి చెప్పారు.

Untitaగత కొద్ది సంవత్సరాలుగా థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరగటం కనిపించింది. అయితే, వీటిలో చాలా కేసులను నయం చేయగలగటం ఒక శుభవార్త. మొత్తం థైరాయిడ్‌ను లేదా అందులో కొంత భాగాన్ని, లింఫ్‌ నోడ్లను తొలగించేందుకు శస్తచ్రికిత్సను చాలా వరకు చేపట్టటం జరిగిం ది. ఇక ఇప్పుడు రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ చికిత్సను మెల్లిగా, శస్తచ్రికిత్స చేసిన తర్వాత మిగిలి పోయిన క్యాన్సర్‌ కణాలను చంపేందుకు లేదా శరీరంలో వ్యాపించి ఉన్న లేదా చికిత్స తర్వా త తిరిగి కనిపించే థైరాయిడ్‌ క్యాన్సర్‌ను తొలగించేందుకు ఎక్కు వగా ఉపయోగించడం జరుగుతోంది. థైరాయిడ్‌ క్యాన్సర్‌ చికిత్స కు ఇది ఒక వరప్రసాదంలాగా మారింది అని అంటున్నారు నిపుణులు.

మెడకు దిగువ భాగంలో నెలకొని ఉండే థైరాయిడ్‌ గ్రంధి శరీర కణాలకు కావలసిన శక్తిని అందించే, మెటబాలిజమ్‌ (జీవ క్రియ)ను నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంటుంది. హైపోథైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, అవటు (గాయిటర్‌), ప్రమాదరహితమైన కణుతులు, థైరాయిడిటిస్‌, ఆటో-ఇమ్యూన్‌ (సహజ రోగనిరోధక) థైరాయిడ్‌ వ్యాధులు మరియు థైరాయిడ్‌ క్యాన్సర్‌ వంటి థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులు ప్రపంచవ్యాప్తం గా సాధారణంగా కనిపిస్తూ, లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. ద ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీని అనుసరించి, 4.2 కోట్ల భారతీయులు థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతుం డగా, వారిలో దాదాపు 90 శాతం గుర్తించకుండా మిగిలిపోతు న్నాయి.

థైరాయిడ్‌ క్యాన్సర్‌, అత్యంత సాధారణమైన ఎండోక్రైన్‌ మాలి గ్నెన్సీ. దీనికి గల లక్షణాలలో మెడలో కణితి, మెడ ముందు వైపు దిగువ భాగంలో నొప్పి, మెడలో శోషరస (లింఫ్‌) నోడ్‌లు వాయటం, స్వరం కరకుగా రావటం, శ్వాస పీల్చటం మరియు మింగటంలో సమస్య. భౌతిక పరిశీలన, రక్త పరీక్షలు, థైరాయిడ్‌, ఇతర స్కాన్‌లు, థైరాయిడ్‌ అల్ట్రాసౌండ్‌, సన్నని - సూదుల ఆస్పిరేషన్‌ బయాప్సీ, శస్తచ్రికిత్సా బయాప్సీలను, రోగులలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ను కనుగొనేందుకు ఉపయోగిం చవచ్చు. చాలా వరకు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసులలో, మొత్తం థైరాయిడ్‌ను తొలగించవలసి ఉంటుంది. 

ఆ తర్వాత రోగులు జీవితాంతం థైరాయిడ్‌ ప్రత్యామ్నాయ హార్మో న్లను తీసుకోవలసి ఉంటుంది. మెడలో క్యాన్సర్‌ కలిగిన లింఫ్‌ నోడ్లను కూడా తొలగించ వలసి ఉంటుంది. శస్త్ర చికిత్స తర్వాత జరిపే రేడి యో యాక్టివ్‌ అయోడిన్‌ థెరపీతో, శరీరంలో మిగిలిపోయిన థైరాయిడ్‌ టిష్యూ, క్యాన్సర్‌ కణాలను చంపే అయోడిన్‌ను తీసుకుంటుంది.థైరాయిడ్‌ తొలగించిన తర్వాత రేడియోయాక్టివ్‌ అయోడిన్‌ థెరపీ ఇప్పుడు దేశంలోని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. ఇందుకో సం ప్రత్యేకమైన సౌకర్యాలు అవసరం అవుతాయి. వీటిలో ఐసొలేషన్‌ గదులు, ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా ఉంటాయి.

చిగురిస్తున్న కొత్త ఆశలు
ssa‘హైపర్‌థైరాయిడ్‌ రోగులు ఒక న్యూక్లియర్‌ ఫిజీషియన్‌ వద్దకు, ఐసోటోప్‌ చికిత్సతో ఉపశమనం పొందాలనే గొప్ప ఆశతో వస్తారు. ఒకే ఒక్క రేడియో అయోడిన్‌ ఔట్‌ పేషెంట్‌ ఓరల్‌ డోస్‌తో లాభాన్ని పొందిన రోగులు బాగా ఋణపడి ఉన్నట్లుగాను, దీనిని ఒక అద్భుత మైన వైద్యంగాను భావిస్తారు. అనుకున్న విధంగా ఐసోటోప్‌ గ్రంధి లోకి ప్రవేశించకపోతే ఫిజీషియన్‌కు చికాకు కలుగుతుంది. గతంలో మేము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు భావించి, యాంటీ-థైరాయిడ్‌ మాత్రలిచ్చిన ఫలితాలకు రోగిని తన బాధ తాను పడేందుకు వదిలి పెట్టే వాళ్ళం. ఇప్పుడు ‘రీకాంబినాంట్‌ హ్యూమన్‌ టిఎస్‌హెచ్‌’ (థైరా యిడ్‌ హార్మోన్‌కు ప్రభావ వంతమైన మరియు సురక్షితమైన ప్రత్యా మ్నాయం) రాకతో కొత్త ఆశ చిగురించింది అని అంటున్నారు నిపు ణులు.


‘2009లో ఒక మహిళా రోగికి హైపర్‌థైరాయిడ్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. యాంటీ థైరాయిడ్‌ ఔషధాలకు ఆమె ప్రతి స్పందన సరిగి లేకపోయింది. అందువలన ఆమెకు ఐ-131 (రేడియో అయోడిన్‌ చికిత్స) చికిత్సను సిఫార్సు చేయడం జరిగింది. ఏవైనా థైరాయిడ్‌ హార్మోన్లున్నాయేమో కనుగొనేందుకు ఆమె శరీరం అంతటికీ స్కాన్‌ నిర్వహించాం. థైరాయిడ్‌ గ్లాండ్‌ ఏవీ కనిపించలేదు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ నిర్వహించి చూస్తే సాధారణంగా ఉండే మెడ ప్రదేశంలోనే అట్రోపిక్‌ థైరాయిడ్‌ గ్రంధి కనిపించింది. 

యాంటీ- థైరాయిడ్‌ ఔషధాలను ఇచ్చినప్పటికీ రోగి, మళ్ళీ ఆమె తర్వాత మేనే జ్‌మెంట్‌ జరిపించుకున్నా థైరోటాక్సిక్‌గానే ఉండిపోయింది. అప్పుడు రేడియో అయోడిన్‌ ఐ-131ను నోటి ద్వారా ఇచ్చాం. ఆ తర్వాత 5 రోజులకు స్కాన్‌ను గామా కేమేరాతో నిర్వహిస్తే, థైరాయిడ్‌ గ్రంథి ఐ-131ను బాగా గ్రహించినట్లు దృవీకృతమయ్యిం ది. ఐదు నెలల తర్వాత రోగి, కోరుకున్నట్లుగానే, హైపోథారాయిడ్‌గా మారింది. ఇప్పుడు రోగి, థైరాక్సిన్‌ ప్రత్యామ్నాయ మోతాదును తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంది’

థైరాయిడ్‌ క్యాన్సర్‌, అత్యంత సాధారణమైన ఎండోక్రైన్‌ మాలి గ్నెన్సీ. దీనికి గల లక్షణాలలో మెడలో కణితి, మెడ ముందు వైపు దిగువ భాగంలో నొప్పి, మెడలో శోషరస (లింఫ్‌) నోడ్‌లు వాయటం, స్వరం కరకుగా రావటం, శ్వాస పీల్చటం మరియు మింగటంలో సమస్య.చాలా వరకు థైరాయిడ్‌ క్యాన్సర్‌ కేసులలో, మొత్తం థైరాయిడ్‌ను తొలగించవలసి ఉంటుంది. ఆ తర్వాత రోగులు జీవితాంతం థైరాయిడ్‌ ప్రత్యామ్నాయ హార్మోన్లను తీసుకోవలసి ఉంటుంది.

0 comments:

Post a Comment