Showing posts with label Did you Know?. Show all posts
Showing posts with label Did you Know?. Show all posts

Friday

.:: Current Affairs - Telugu Medium ::. ( ఆగస్టు 2012 )



ఫోర్బ్స్ జాబితాలో మెర్కెల్‌కు మొదటి స్థానం2012 సంవత్సరానికి ప్రపంచంలో శక్తివంతులైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఆగస్టు 22న విడుదల చేసింది. 100 మంది మహిళలతో కూడిన జాబితాలో జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌కు మొదటి స్థానం దక్కింది. గతేడాది ఆమె రెండోస్థానంలో ఉన్నారు. ద్వితీయస్థానంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ , తృతీయ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్‌కు ఏడోస్థానం దక్కింది.
ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోస్థానంలో నిలిచారు. గత సంవత్సరం ఈ జాబితాలో ఆమెకు ఏడోస్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఇంద్ర నూయీ(పెప్సీ కంపెనీ చైర్మన్) 12వ స్థానం, పదశ్రీ వారియర్ (సిస్కో సిస్టమ్స్ సీటీవో) 58వ స్థానం, చందా కొచ్చర్ (ఐసీఐసీఐ సీఈవో)59వ స్థానం, కిరణ్ మజుందార్‌షా(బయోకాన్ అధిపతి) 80వ స్థానంలో ఉన్నారు.
పాలపుంతను పోలిన జంట గెలాక్సీలుఅంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.
డబ్ల్యూటీవోలో చేరిన రష్యా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో రష్యా ఆగస్టు 22న చేరింది. 18 సంవత్సరాల చర్చల తర్వాత డబ్ల్యూటీవోలో రష్యా సభ్యత్వం పొందింది. గత జూలైలో రష్యా ఉభయ సభలు డబ్ల్యూటీవోలో చేరికకు ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు దిగుమతి సుంకాలు, సబ్సిడీలపై డబ్ల్యూటీవో ఆంక్షలు విధిస్తుంది. డబ్ల్యూటీవో చేరిక వల్ల తయారీ రంగం, వ్యవసాయ రంగం దెబ్బతింటాయని రష్యా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇథియోపియా ప్రధాని జెనావీ మృతిఇథియోపియా ప్రధాన మంత్రి మెలెస్ జెనావీ(57) అనారోగ్యంతో ఆగస్టు 21న మరణించారు. జెనావీ 1995 నుంచి ఇథియోపియా ప్రధానిగా ఉన్నారు. 1991లో నియంత కల్నల్ యెంగిస్లూ హైలే మారియ్ పాలన ముగియడంతో మెలెస్‌కు చెందిన ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జెనావీ 1995, 2000, 2005, 2010 ఎన్నికల్లో విజయం సాధించారు.
అమెరికా హైపర్ సోనిక్ విమాన పరీక్ష విఫలంఅమెరికా ప్రయోగించిన ‘ఎక్స్-51ఏ వేవ్ రైడర్’ అనే మానవ రహిత విమాన పరీక్ష విఫలమైంది. గంటకు 6,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ఉద్దేశించిన ఈ విమాన పరీక్షను ఆగస్టు 14న నిర్వహించింది. స్కామ్ జెట్ ఇంజిన్‌తో నడిచే వేవ్ రైడర్ నియంత్రణ కోల్పోయి పసిఫిక్ మహాసముద్రంలో కూలింది.


లక్ష్య-1 పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కురియన్రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.జె. కురియన్ ఆగస్టు 21న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న కె. రహ్మన్ ఖాన్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియడంతో కురియన్ ఎన్నిక అనివార్యమైంది.
క్యాట్ చైర్మన్‌గా జస్టిస్ ఆలంకేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా జస్టిస్ సయ్యద్ రఫత్ ఆలం ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
పృథ్వి-2 పరీక్ష విజయవంతం పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వాస్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.
కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభంకోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.
కొత్త ఈసీ నసీమ్ జైదీఎన్నికల కమిషనర్ (ఈసీ)గా సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ ఆగస్టు 7న నియమితులయ్యారు. ఇదివరకు ఈసీగా పనిచేసిన వీఎస్ సంపత్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పదోన్నతి పొందడంతో జైదీని కొత్త ఈసీగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. జైదీ 2017 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జైదీ యూపీ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జూలై 31న పౌర విమానయాన శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జైదీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మండలిలో భారత్ ప్రతినిధిగా 2005- 2008 వరకూ వ్యవహరించారు. భారత విమానాశ్రయాల సంస్థ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో మరో ఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ ఉన్నారు.
విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్షమధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.
అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.
రెండోసారి ఉపరాష్ట్రపతిగా అన్సారీరెండోసారి ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 7న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీ 252 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన అన్సారీ ఎన్‌డిఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్‌పై విజయం సాధించారు. మొత్తం 790 మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల్లో మూడు ఖాళీలుపోగా 787 మందికి గానూ 736 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 8 చెల్లలేదు. 47 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. చెల్లిన 728 ఓట్లలో అన్సారీకి 490, జస్వంత్ సింగ్‌కు 238 ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 నుంచి 1962 వరకు) తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి రెండుసార్లు ఎన్నికైన అభ్యర్థి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ 1961 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆఫ్గనిస్తాన్, యూఏఈ దేశాల్లో ప్రధాన దౌత్య అధికారిగా పనిచేశారు. 1993-95 కాలంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. 2007 ఆగస్టు 11 నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.
రాష్ట్రంలో క్రీడలకు 2శాతం రిజర్వేషన్లుఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 29 క్రీడాంశాల్లో రిజర్వేషన్లు వర్తింప చేస్తారు. క్రీడా పోటీ, స్థాయి గెలుపొందిన పతకాల ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డుసీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.
గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతిమెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు నేసిన గొల్లభామల చీరకు జియోగ్రాఫీ ఇండికేషన్ అప్లికేషన్(జీఐఏ) గుర్తింపు లభించింది. ఈ జీఐఏ జాబితా వరుస సంఖ్య 188గా నిలవడంతో ఈ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1940లో సిద్దిపేటకు చెందిన రచ్చ రాందాస్, కాంటసాయిలు కలిసి మొదట ఈ చీరను తయారు చేశారు.
పర్యాటక రంగంలో రెండోస్థానంలో రాష్ట్రంస్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో 2011లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2011లో 15.31 కోట్ల మంది రాష్ట్రాన్ని సందర్శించారు. కాగా 2011లో ఉత్తరప్రదేశ్‌ను 15.54 కోట్ల మంది సందర్శించడంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర(24.7 శాతం), రెండో స్థానంలో తమిళనాడు(17.3 శాతం), మూడోస్థానంలో న్యూఢిల్లీ(11.1శాతం) నిలిచాయి. 2011లో మొత్తం 1.94 కోట్ల మంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు.
 
రాజస్థాన్‌లో అమల్లోకి విచారణ హక్కు చట్టంవిచారణ హక్కు చట్టాన్ని దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రం ఆగస్టు 1 నుంచి అమలులోకి తెచ్చింది. పాలనాపరమైన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ఈ చట్టం సాయపడుతుంది. పాలనాపరమైన అంశాలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించని ఉద్యోగులకు ఈ చట్టం కింద రూ.500 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తా మని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు.
పదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే రిజర్వేషన్లు ఇకపై పదేళ్ల కొకసారి రొటేషన్‌పై మారనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన పదేళ్ల విధానానికి ఆగస్టు 1న రాష్ట్ర మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రాష్ట్రప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిధిలో కనీసం ఐదు శాతం జ నాభా ఉంటేనే ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఎంపీ. ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీల సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కూడా మంత్రుల బృందం సానుకూలత చూపించింది.
హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిహైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ప్రతిపాదనకు రాజకీయ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఇందుకు రాజ్యాంగంలోని 371 ప్రకరణకు సవరణ చేయవలసి ఉంది. వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని ఆరు జిల్లాలను(గుల్బర్గా,యాదగిరి, రాయచూర్, బీదర్, కొప్పళ, బళ్లారి)హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంగా పేర్కొంటారు. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వలన ఈ ప్రాంతానికి ప్రాంతీయ మండలి లేదా బోర్డు ఏర్పాటు చేస్తారు. ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తారు. అభివృద్ధికి అత్యధిక గ్రాంట్లు విడుదలవుతాయి.
జీటీఏ సభ్యుల ప్రమాణ స్వీకారంగూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)లోని 45 మంది సభ్యులతోపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిమల్ గురుంగ్ ఆగస్టు4న ప్రమాణ స్వీకారం చేశారు. గూర్ఖాలాండ్ కొండ ప్రాంత అభివృద్ధికి జీటీఏ కృషి చేస్తోంది. కొంత కాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. 2011 జూలై 18న కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం జీటీఏ ఏర్పాటైంది. కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజెఎం) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జూలై 29 జీటీఏకు జరిగిన ఎన్నికల్లో పోటీ లేకుండా 45 స్థానాలను జీజేఎం గెలుచుకుంది.



2012-13 లో 6.7 శాతం వృద్ధి 2012-13లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండగలదని సి. రంగరాజన్ నేతృత్వంలోని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) రూపొందించిన ఆర్థిక వ్యవస్థ అంచనాల నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను పీఎంఈఏసీ ఆగస్టు 17న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది. వ్యవసాయ వృద్ధిరేటు 0.5 శాతంగా (2011-12లో 2.8 శాతం), తయారీ రంగ వృద్ధి రేటు 4.5 శాతంగా (2011-12లో 2.5 శాతం), మైనింగ్ రంగంలో వృద్ధి 5.3 శాతంగా (2011-12లో 3.4 శాతం), సేవల రంగంలో వృద్ధి 8.9 శాతంగా(2011-12లో 3.4 శాతం) నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వాణిజ్య లోటు 18,110 కోట్ల డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశీయ పొదుపు రేటు 31.7 శాతంగా ఉంటుంద ని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థ బయటపడి మళ్లీ పుంజుకోవాలంటే మౌలిక రంగంలో పెట్టుబడులను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా రాజన్కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా (సీఈఏ) రఘురాం జి.రాజన్ ఆగస్టు 11న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజన్ గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు గౌరవ ఆర్థిక సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థిక వేత్తగా పని చేశారు.
 
ఆర్‌బీఐ -త్రైమాసిక పరపతి విధానంత్రైమాసిక పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జూలై 31న ప్రకటించింది. రెపో రేటు 8 శాతంగా, రివర్స్ రెపో రేటు 7 శాతం కొనసాగించింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)4.75లో కూడా మార్పు చేయలేదు. చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం 24 నుంచి 23 శాతానికి తగ్గించింది. బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ బాండ్లలో తప్పనిసరిగా పెట్టడాన్ని ఎస్‌ఎల్‌ఆర్ అంటారు. ఎస్‌ఎల్‌ఆర్ తగ్గించడం వల్ల ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ప్రస్తుత తగ్గింపులో రూ. 68,000 కోట్లు అందుబాటులోకి రాగలవని అంచనా. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతానికి తగ్గించింది. గతంలో 7.3 శాతం వృద్ధిని అంచనా వేసింది. మార్చినాటికి ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరగవచ్చని అంచనా. గతంలో ఈ అంచనా 6.5 శాతం.


పాలపుంతను పోలిన జంట గెలాక్సీలు
అంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.
 
లక్ష్య-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.
 
పృథ్వి-2 పరీక్ష విజయవంతం పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వా
స్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.
కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభంకోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.
 
భారత్‌కు ఎంబ్రాయెర్ 145
గగన తల నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ఎంబ్రాయెర్ 145 నిఘా విమానాన్ని భారత్ సమకూర్చుకుంది. దీనికి ఎంబ్రాయెర్ 145 ఏఈడబ్ల్యూసీ (ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్)గా పేరు పెట్టారు. బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయెర్ తయారు చేసిన ఈ విమానంలో భారత్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే(ఏఈఎస్‌ఏ) రాడార్‌ను అమర్చారు. ఆగస్ట్ 17న బ్రెజిల్‌లోని శావ్‌జోస్ డాస్ కాంపోస్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులకు బ్రెజిల్ కంపెనీ ఈ విమానాన్ని అప్పగించింది. 2014 నాటికి ఇటువంటి మూడు విమానాలతోపాటు ఇతరత్రా సాంకేతిక సహకారం అందించాలని బ్రెజిల్ కంపెనీతో భారత్ కుదుర్చుకున్న 210 మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా తొలి విమానం మన దేశానికి అందింది. ఇది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను అన్ని వైపుల నుంచీ పసిగట్టగలదు.
 
విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్షమధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.
 
అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.
 
ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డుసీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.
 
అంగారక యాత్రకు క్యాబినెట్ ఆమోదంఅంగారక పరిశోధన కోసం చేపట్టే యాత్రకు కేంద్ర క్యాబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. అంగారక యాత్రలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘మార్స్ ఆర్బిటర్’ అనే ఉపగ్రహాన్ని అంగారకుడిపైకి పంపుతుంది. భారత్ తొలిసారి చేపట్టే అంగారక యాత్ర 2013 నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది.
అరుణ గ్రహంపై వాతావరణం, పుట్టుక, పరిణామం, అక్కడ జీవ రాశుల మనుగడకు అవకాశాలు వంటి అంశాలను ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. ఇది మార్స్‌ను చేరడానికి 300 రోజులు పడుతుంది. ఈ యాత్రకు రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ అధునాతన వెర్షన్ రాకెట్ ద్వారా దీనిని పంపిస్తారు. ఇంతవరకూ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా దేశాలు అంగారక యాత్రలు జరిపాయి. భారత్ 6వ దేశంగా ఇప్పుడు వీటి సరసన చేరనుంది.
ఐఎన్‌ఎస్ ‘బాజ్’ జాతికి అంకితంయుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘బాజ్’ను జూలై 31న అండమాన్ నికోబార్‌లో నౌకాదళం అధిపతి అడ్మిరల్ నిర్మల్ వర్మ ప్రారంభించారు. దీంతో హిందూ మహా సముద్ర ప్రాంతం(ఐఓఆర్)పై నౌకాదళం మంచి పట్టు సాధిస్తుంది. ఐఓఆర్‌లో పెరుగుతున్న చైనా ఆధిపత్యం నేపథ్యంలో భారత్ దక్షిణ ప్రాంతంలో అండమాన్ నికోబార్‌లో ఈ నౌకను మోహరించడం అనివార్యమైంది.


గంగాధర్‌కు సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు చిన్న కథల రచయిత వేంపల్లి గంగాధర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘మొలకల పున్నమి’కి ఈ పురస్కారం దక్కింది.
గుంటూరు రైతుకు శాంసంగ్ అవార్డుగుంటూరు జిల్లా రూపెనగుంట్లకు చెందిన తొండెపి గురవయ్య ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే‘హెర్బిస్ప్రేయర్’ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. నిర్వాహకులు ప్రకటించిన మొత్తం మూడు అవార్డుల్లో గురవయ్య రెండో స్థానం పొంది రూ.3 లక్షల ప్రైజ్‌మనీ, ధ్రువీకరణ పత్రం సాధించారు. కాగా ప్రథమ బహుమతిని (5 లక్షలు) అహ్మదాబాద్‌కు చెందిన యువ ఇంజనీర్ లియో మావ్‌లీ సొంతం చేసుకున్నారు.
రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ‘ఆక్సియోస్టాట్’ను ఈయన రూపొందించారు. జీఐబీబీఎస్‌గా పిలిచే జియో థెర్మల్ ఏసీలను కనుగొన్న ముంబైకి చెందిన అరుణ్ షెనోయ్ మూడో ప్రైజ్(2 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టే విభిన్న రంగాలవారికి ఏటా ఇచ్చే ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. గురవయ్య కనుగొన్న ఈ ‘హెర్బిస్ప్రేయర్’ పరికరం వల్ల తక్కువ సమయంలో, కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్‌కు అమర్చుకుని రైతులు విత్తనాలను జల్లుకోవచ్చు.
 
పట్నాయక్‌కు డామైన్ డట్టోన్ అవార్డుప్రతిష్టాత్మక డామైన్-డట్టోన్ అవార్డు-2012 ఒడిశా రాష్ట్ర లెప్రసీ అధికారి డా. పి.బి.కె.పట్నాయక్‌కు లభించింది. కుష్టు వ్యాధి నిర్మూలనకు చేసిన కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. గతంలో ఈ పురస్కారం లభించిన వారిలో మదర్ థెరిస్సా, బాబా ఆమ్టే తదితరులు ఉన్నారు. ఈ అవార్డును డామైన్-డట్టోన్ సొసైటీ ఫర్ లెప్రసీ ఎయిడ్ అందజేస్తుంది. దీన్ని 1944లో అమెరికా సైన్యానికి చెందిన మెడికల్ కోర్ ప్రారంభించింది. కుష్టు వ్యాధి నివారణకు విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు.
మెహతాకు రాజీవ్ సద్భావన అవార్డుజైపూర్ కేంద్రంగా పని చేసే భగవాన్ మహావీర్ వికలాంగ్ సేవా సమితి వ్యవస్థాపకుడు డీఆర్ మెహతా ఈ ఏడాది రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లోని 26 దేశాల పేద ప్రజలకు ఈ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. న్యూఢిల్లీలో ఆగస్ట్ 19న జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మెహతాకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
 
అశోక్ సేన్‌కు యూరీ మిల్నర్ప్రపంచంలో భారీ మొత్తంలో నగదు బహుమతినిచ్చే ‘యూరీ మిల్నర్ ఫండమెంటల్ ఫిజిక్స్’ ప్రైజ్ -2012 సంవత్సరానికి భారతీయ శాస్త్రవేత్త అశోక్ సేన్‌కు లభించింది. ఈ అవార్డు కింద రూ.16.7కోట్ల (30 లక్షల అమెరికన్ డాలర్ల) నగదు బహుమతి ఇస్తారు. సేన్ ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌లోని హరిశ్చంద్ర పరిశోధనా సంస్థలో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సేన్‌తోపాటు ఏడుగురు అమెరికా శాస్త్రవేత్తలకు, పారిస్‌కు చెందిన ఒకరికి ఈ అవార్డును ప్రకటించారు. వీరికీ రూ.16.7కోట్ల చొప్పున పారితోషికం ఇస్తారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతికి మూడు రెట్లు ఎక్కువ నగదు బహుమతిని ఇచ్చే ఈ అవార్డు ప్రపంచంలోనే అత్యధిక నగదు అవార్డు. ఈ ప్రైజ్‌ను రష్యాకు చెందిన యూరీ మిల్నర్ ప్రారంభించారు. భౌతిక శాస్త్రాన్ని అభ్యసిస్తూ, 1989లో అర్ధంతరంగా చదువు మానేసిన మిల్నర్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డు నెలకొల్పారు. సేన్ పరిశోధనలకు గుర్తింపుగా గతంలో పద్మశ్రీ(2001), శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (1994), భారతీయ సైన్స్ అకాడమీ(1995) అవార్డులు వరించాయి. లండన్ రాయల్ సొసైటీ ఫెలో(1998)గా కూడా సేన్ ఎంపికయ్యారు.
 
మెహతాకు రాజీవ్ సద్భావనా అవార్డుపద్మభూషణ్ డి.ఆర్.మెహతా 20వ ‘రాజీవ్‌గాంధీ సద్భావనా అవార్డు’కు ఎంపికయ్యారు. ఈయన భగవాన్ మహావీర్ వికలాంగ సాహిత్య సమితి (బీఎంవీఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు. 1975లో ఏర్పాటైన ఈ సంస్థ ‘జైపూర్ కాలు’తో వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఈ కృత్రిమ కాలును ఆప్ఘనిస్థాన్, అంగోలా వంటి దేశాల్లో యుద్ధ బాధితులకు కూడా అందజేశారు. మత సామరస్యం, శాంతికి తోడ్పడినందుకు అందజేసే ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుకరిస్తారు.


క్రీడా అవార్డులుద్రోణాచార్య అవార్డులు: క్రీడా రంగంలో కోచ్‌లకు ఇచ్చే ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు 2012 సంవత్సరానికి ఆరుగురు కోచ్‌లు ఎంపికయ్యారు. అస్లాం షేర్‌ఖాన్ నేతృత్వంలోని కమిటీ వీరిని ఎంపిక చేసింది. వివరాలు.. యశ్వీర్ సింగ్ (రెజ్లింగ్); వీరేంద్ర పూనియా (అథ్లెటిక్స్); సునీల్ దేవాస్(కబడ్డీ); హరీందర్ సింగ్ (హాకీ); సత్యపాల్ (పారా అథ్లెటిక్స్); ఫెర్నాండెజ్ (క్యూబా,బాక్సింగ్); విదేశీ కోచ్‌కు ఈ అవార్డు దక్కడం ఇదే ప్రథమం
ధ్యాన్‌చంద్ అవార్డులు: ఈ అవార్డులు నలుగురు మాజీ క్రీడాకారులకు దక్కాయి. వివరాలు.. జగ్ రాజ్‌సింగ్ మాన్(అథ్లెటిక్స్); గుణ్ దీప్ కుమార్ (హాకీ); వినోద్ కుమార్(రెజ్లింగ్); సుఖ్‌బీర్ సింగ్ టోకాస్ (పారా స్పోర్ట్స్)
లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు: జె.ఎస్. భాటియా (అథ్లెటిక్స్), భవానీ ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: క్రీడలను ప్రోత్సహించినందుకుగాను ఇచ్చే ఈ అవార్డు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, ఎయిర్ ఇండియా స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు దక్కింది.
భారత్‌కు అండర్ -19 ప్రపంచకప్అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. టౌన్స్‌విల్లే(ఆస్ట్రేలియా)లో ఆగస్టు 26న జరిగిన ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్‌ను భారత్ మూడోసారి గెలుచుకుంది (2000, 2008లలో కూడా విజేతగా నిలిచింది). భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా, ఆస్ట్రేలియా కెప్టెన్ బసిస్టో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గా ఎంపికయ్యారు.
లాన్‌‌సపై జీవితకాల నిషేధంప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ(యూఎన్‌ఏడీఏ) జీవిత కాల నిషేధం విధించింది. దీంతో 1998 నుంచి ఇప్ప టి వరకు సాధించిన అన్ని విజయాలు రద్దవుతాయి.
యూఎన్‌ఏడీఏ తనపై చేస్తున్న ఆరోపణలపై పోరాడకూడదని ఆర్మ్‌స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడంతో నిషేధం అనివార్యమైంది. 1996లో వృషణాల క్యాన్స ర్ బారిన పడ్డాడు. బతకడం అసాధ్యమనుకున్న దశ నుంచి పలు శస్త్ర చికిత్సలతో కోలుకున్నాడు. తిరిగి సైక్లింగ్ సాధన ఆరంభించి.. 1999 నుంచి 2005 వరకు వరుసగా ఏడు టూర్‌డి ఫ్రాన్‌‌స టైటిళ్లు గెలుచుకున్నాడు. ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరిలో ధైర్యాన్ని నింపాడు.
 
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన లక్ష్మణ్ హైదరాబాద్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీవీఎస్ లక్ష్మణ్ (37) అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆగస్టు 19న ప్రకటించాడు. 1996లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన లక్ష్మణ్ 1998లో వన్డేలలో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 134 టెస్ట్ట్‌లు ఆడి 17 సెంచరీలతో 8781 పరుగులు, 81 వన్డేల్లో ఆరు సెంచరీలతో 2338 పరుగులు చేశాడు. 2001లో కోల్‌కతా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన 281 పరుగులు.. భారత బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో చేసిన మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్. లక్ష్మణ్‌కు 2001లో అర్జున, 2011లో పద్మశ్రీ అవార్డులు లభించాయి. 2002లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.
2012 క్రీడా బహుమతులు2012 సంవత్సరానికి రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 19న ప్రకటించింది. ఇద్దరు క్రీడాకారులకు సంయుక్తంగా రాజీవ్ ఖేల్ రత్న, 25 మందికి అర్జున అవార్డులు దక్కాయి. ఖేల్ రత్న లభించిన వారికి మెడల్‌తోపాటు రూ.7.5 లక్షలు, అర్జున అవార్డు కింద మొమెంటో రూ. 5 లక్షల నగదు బహూకరిస్తారు.
రాజీవ్ ఖేల్త్న్ర:విజయ్ కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్(రెజ్లింగ్). వీరిద్దరూ ఇటీవల ముగిసిన లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు.
అర్జున అవార్డులు:
దీపిక, బొంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవితా రౌత్ (అథ్లెటిక్స్), అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్ (బ్యాడ్మింటన్), ఆదిత్య మెహతా (బిలియర్డ్స్), వికాస్ కృషన్ (బాక్సింగ్), యువరాజ్ సింగ్ (క్రికెట్), సర్దార్ సింగ్ (హాకీ), యష్‌పాల్ సోలంకీ (జూడో), అనూప్ కుమార్ (కబడ్డీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్నురాజ్ సింగ్, ఓంకార్ సింగ్, జైదీప్ కర్మాకర్ (షూటింగ్), దీపికా పల్లికల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్‌లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీతా పోగట్ (రెజ్లింగ్), బిమల్‌జిత్ సింగ్ (వుషు), దీపా మల్లిక్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్), రామ్‌కరణ్ సింగ్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్).
ఫెదరర్‌కు సిన్సినాటి టైటిల్ఏటీపీ సిన్సినాటి మాస్టర్‌‌స టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)గెలుచుకున్నాడు. ఆగస్ట్ 20న సిన్సినాటి (అమెరికా)లో జరిగిన ఫైనల్లో నొవోక్ జకోవిచ్‌ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఐదుసార్లు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా 21 మాస్టర్స్ టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డును ఫెదరర్ సమం చేశాడు. మహిళా సింగిల్స్ టైటిల్‌ను చైనాకు చెందిన లీనా గెలుచుకుంది. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మహేష్ భూపతి, రోహన్ బోపన్నలను ఓడించి రాబర్‌‌ట లిండ్ స్టెడ్ (స్వీడన్), హోరియా టెకాపు (రొమేనియా) టైటిల్ సాధించారు.
టెస్టుల్లో నెంబర్ వన్ దక్షిణాఫ్రికాఇంగ్లండ్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా.. దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుచుంది. గతేడాది భారత్ నుంచి టాప్ ర్యాంకును ఇంగ్లండ్ సాధించింది.
దీపిక పల్లికల్ రికార్డుభారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు ప్రవేశించింది. తద్వారా ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా పల్లికల్ రికార్డు సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన తారా మస్సార్ చేతిలో ఓడిపోయింది.
 
రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్‌కు రజతంలండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెజ్లర్ సుశీల్ కుమార్ 66 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో వరసగా రెండు ఒలింపిక్స్‌ల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. సుశీల్ కుమార్ స్వస్థలం ఢిల్లీ.
యోగేశ్వర్‌కు కాంస్యంభారత్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. పురుషుల రెజ్లింగ్ 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన జోంగ్ మయాంగ్‌పై విజయంతో యోగేశ్వర్ ను కాంస్య పతకం వరించింది. క్వాలిఫయింగ్ నుంచి రెప్‌చేజ్ వరకు యోగేశ్వర్ తన హవా కొనసాగించాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఓడినా... కీలకమైన రెప్‌చేజ్‌లో మూడుబౌట్లు గెలిచి భారత్‌కు ఐదో పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన యోగేశ్వర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి.
100, 200 మీటర్ల రేసులో బోల్ట్ రికార్డ్ 100 మీటర్ల స్ప్రింట్ రేసులో ఉసేన్ బోల్ట్ (జమైకా) 9.63 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 6న జరిగిన ఈ రేసులో బోల్ట్ రికార్డ్ సృష్టించాడు. బీజింగ్ ఒలింపిక్స్ 100 మీటర్ల రేసును 9.69 సెకెన్లలో పూర్తిచేసి నెలకొల్పిన రికార్డును బోల్ట్ లండన్‌లో అదిగమించాడు. బోల్ట్‌కు స్వర్ణపతకం దక్కగా మరో జమైకన్ మొహాన్ బ్లేక్ 9.75 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఆగస్టు 9న జరిగిన 200 మీ. పరుగులో, ఉసేన్ 4 ఁ 100 మీటర్ల రిలే పరుగులోను స్వర్ణ పతకాలు సాధించాడు. మూడు స్వర్ణాలు గెలిచిన తొలి స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మేరీ కోమ్‌కు కాంస్య పతకంభారత మహిళా బాక్సర్ మేరీకోమ్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఆగస్టు 8న 51 కిలోల ప్లయ్ వెయిట్ సెమీ ఫైనల్స్‌లో బ్రిటన్ బాక్సర్ నికోలో ఆడమ్స్ చేతిలో మేరీకోమ్ ఓడిపోయింది. దీంతో ఆమెకు కాంస్యం దక్కింది. ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ ప్రవేశ పెట్టిన తొలిసారే భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టింది.
అమెరికాకు ఫుట్ బాల్‌లో స్వర్ణం:ఒలింపిక్ ఫుట్‌బాల్ స్వర్ణ పతకాన్ని అమెరికా గెలుచుకుంది. ఫైనల్స్‌లో జపాన్‌ను ఓడించింది.
హాకీలో జర్మనీకి స్వర్ణం: హాకీలో జర్మనీకి స్వర్ణం.
అమెరికాకు మహిళ బాస్కెట్ బాల్: మహిళ బాస్కెట్‌బాల్ టైటిల్‌ను అమెరికా గెలుచుకుంది. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అమెరికా స్వర్ణం సాధించింది.
నార్వేకి మహిళ హ్యాండ్‌బాల్: మహిళ హ్యాండ్‌బాల్‌లో నార్వే స్వర్ణం సాధించింది. మాంటెనెగ్రోను నార్వే ఓడించింది. పురుషుల హ్యాండ్‌బాల్‌లో స్వీడన్‌ను ఓడించి ఫ్రాన్స్ స్వర్ణం సాదించింది.
మహిళ వాలీబాల్‌లో బ్రెజిల్‌కు స్వర్ణం: మహిళ వాలీబాల్‌లో బ్రెజిల్ స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో బ్రెజిల్ అమెరికాను ఓడించింది. పురుషుల వాలీబాల్ టైటిల్‌ను రష్యా గెలుచుకుంది. ఫైనల్లో బ్రిటన్‌ను ఓడించి రష్యా విజయం సాధించింది.
లండన్ ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో అమెరికాఆగస్టు 12న ముగిసిన లండన్ ఒలింపిక్స్‌లో 46 స్వర్ణపతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రజత, కాంస్య పతకాలతో కలిపి మొత్తం 104 పతకాలు అమెరికా సాధించింది. 38 స్వర్ణాలతో చైనా, 29 స్వర్ణాలతో బ్రిటన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 6 పతకాలు సాధించి 55వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా 6 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. మొత్తం 204 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొనగా 85 దేశాలు మాత్రమే పతకాలు సాధించాయి. భారత్ 55వ స్థానంలో నిలిచింది.
పతకాలు సాధించిన భారత్ విజేతలువిజయకుమార్ - షూటింగ్ - రజతం
సుశీల్ కుమార్ - రెజ్లింగ్ - రజతం
సైనా నెహ్వాల్ - బ్యాడ్మింటన్ - కాంస్యం
గగన్ నారంగ్ - షూటింగ్ - కాంస్యం
మేరీ కోమ్ - బాక్సింగ్ - కాంస్యం
యోగేశ్వర్ దత్ - రెజ్లింగ్ - కాంస్యం
పతకాల పట్టికలో మొదటి పది దేశాలుజట్టు స్వ ర కాం మొఅమెరికా 46 29 29 104
చైనా 38 27 22 87
బ్రిటన్ 29 17 19 65
రష్యా 24 25 33 82
ద.కొరియా 13 8 7 28
జర్మనీ 11 19 14 44
ఫ్రాన్స్ 11 11 12 34
ఇటలీ 8 9 11 28
హంగేరి 8 4 5 17
ఆస్ట్రేలియా 7 16 12 35
 
విజయ్ కుమార్‌కు రజతంషూటర్ విజయ్ కుమార్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విజయ్‌కుమార్ ఆగస్టు 3న పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకం గెలిచాడు. క్వాలిఫైయింగ్‌లో 600కుగాను 585 పాయింట్లు సాధించి ఒలింపిక్స్ రికార్డును అధిగమించిన విజయ్ ఫైనల్‌లో 40కు 30 పాయింట్లు స్కోర్‌చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఒకే క్రీడా విభాగంలో రెండు పతకాలు రావడం ఇదే తొలిసారి కాగా షూటింగ్‌లో రజతం రావడం రెండోసారి. భారత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న విజయ్ 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని కైవసం చేసుకున్నాడు.
ముర్రేకు పురుషుల సింగిల్స్ టైటిల్ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. ఆగస్టు 5న ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్‌పై ముర్రే విజయం సాధించాడు.
మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను అమెరికాకు చెందిన వీన స్ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌లు గెలుచుకున్నారు.
మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ స్వర్ణపతకం సాధించింది.
పురుషుల డబుల్స్: అమెరికాకు చెందిన మైక్ బ్రియాన్, బాబ్ బ్రియాన్‌లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
సైనాకు కాంస్యంఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్ ్సలో భారత్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కాంస్యం లభించింది. మూడో స్థానానికి ఆగస్టు 4న జరిగిన పోటీలో ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌వాంగ్ గాయంతో పోటీ నుంచి విరమించుకోవడంతో సైనాకు కాంస్యం దక్కింది. భారత్‌కు ఇది మూడో పతకం.
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన క్రీడాకారిణిగా సైనా ఘనత సాధించింది. సెమీస్‌లో ప్రపంచ నెంబర్‌వ న్ యిహాన్ వాంగ్ చేతిలో ఓడిన సైనా కాంస్యం కోసం కూడా తనకన్నా మెరుగైన ర్యాంకర్‌తోనే ఆడింది. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన మొదటి మహిళ, భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో మహిళగా సైనా రికార్డు సృష్టించింది.
పురుషుల సింగిల్స్: లిన్ డాన్ (చైనా) పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన లీ చాంగ్‌పై లిన్ డాన్ విజయం సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా లిన్ డాన్ స్వర్ణం సాధించాడు.
పురుషుల డబుల్స్: చైనాకు చెందిన కాయ్‌యున్, ఫు హాయ్ ఫింగ్‌లు డెన్మార్క్‌కు చెందిన మథియస్ బో, కర్‌స్టన్ ముంగిన్సన్‌లను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
మహిళల సింగిల్స్: చైనాకు చెందిన లీ జురుయ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. యిహాన్ వాంగ్ పై లీ జురయ్ విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో పోటీ పడిన ఇద్దరు ఒకే దేశానికి చెందినవారు.
మహిళల డబుల్స్: టియాన్ క్వింగ్ , జావోయిలు స్వర్ణాన్ని గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన మిజుకి ఫుజి, రీకా కాకివాలపై వీరు విజయం సాధించారు.
వన్డే సిరీస్ విజేత భారత్శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంకలో ఆగస్టు 4న జరిగిన చివరి, ఐదో వన్డేను భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇర్ఫాన్ పఠాన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు.


మంత్రిగా జానారెడ్డి రికార్డుఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం మంత్రిగా కొనసాగి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి రికార్డు నెలకొల్పారు. ఆగస్టు 24 నాటికి ఆయన మంత్రిగా 14 సంవత్సరాలు 11 నెలలు పదవీ కాలాన్ని చేసుకున్నారు. దీంతో 14 సంవత్సరాల 10 నెలల 28 రోజులు మంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి రికార్డును అధిగమించారు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. జానారెడ్డి ఎన్టీఆర్ హయాంలో ఆపద్ధర్మంతో కలిపి మూడు పర్యాయాలు..1983, 1984, 1985లలో(6 ఏళ్ల రెండు రోజులు) మంత్రిగా పని చేశారు. తర్వాత 1992 కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో నాలుగో దఫా రెండేళ్ల రెండు నెలల నాలుగు రోజుల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతిచంద్రుడిపై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(82) ఆగస్టు 25న అమెరికాలోని సిన్‌సిటీలో మరణించారు. 1969 జూలై 20న అపోలో 11 వ్యోమనౌక ద్వారా ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టారు. ఈయనతోపాటు చంద్రమండల యాత్రకు వెళ్లిన బృందంలో ఎడ్విన్ ఆల్ట్రిన్, మైకేల్ కాలిన్స్ ఉన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ట్రిన్‌లు మూడు గంటలపాటు చంద్రుడిపై గడిపారు. నమూనాలు సేకరించి ఫోటోలు తీసారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించారు.
గంగాధర్‌కు సాహిత్య అకాడమీ అవార్డుతెలుగు చిన్న కథల రచయిత వేంపల్లి గంగాధర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘మొలకల పున్నమి’కి ఈ పురస్కారం దక్కింది.
గుంటూరు రైతుకు శాంసంగ్ అవార్డుగుంటూరు జిల్లా రూపెనగుంట్లకు చెందిన తొండెపి గురవయ్య ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే‘హెర్బిస్ప్రేయర్’ను కనుగొన్నందుకు ఈ అవార్డు దక్కింది. నిర్వాహకులు ప్రకటించిన మొత్తం మూడు అవార్డుల్లో గురవయ్య రెండో స్థానం పొంది రూ.3 లక్షల ప్రైజ్‌మనీ, ధ్రువీకరణ పత్రం సాధించారు. కాగా ప్రథమ బహుమతిని (5 లక్షలు) అహ్మదాబాద్‌కు చెందిన యువ ఇంజనీర్ లియో మావ్‌లీ సొంతం చేసుకున్నారు.
రక్తం గడ్డకట్టేందుకు ఉపకరించే ‘ఆక్సియోస్టాట్’ను ఈయన రూపొందించారు. జీఐబీబీఎస్‌గా పిలిచే జియో థెర్మల్ ఏసీలను కనుగొన్న ముంబైకి చెందిన అరుణ్ షెనోయ్ మూడో ప్రైజ్(2 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టే విభిన్న రంగాలవారికి ఏటా ఇచ్చే ఈ అవార్డులకు దేశ వ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. గురవయ్య కనుగొన్న ఈ ‘హెర్బిస్ప్రేయర్’ పరికరం వల్ల తక్కువ సమయంలో, కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్‌కు అమర్చుకుని రైతులు విత్తనాలను జల్లుకోవచ్చు.
 
మిస్ వరల్డ్ వెన్ జియా యూచైనాకు చెందిన వెన్ జియా యూ (23) 2012 ప్రపంచ సుందరిగాఎంపిక య్యారు. ఆగస్టు 18న ఓర్డోస్ (చైనా)లో జరిగిన పోటీలో వెన్‌జియా యూ విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి రన్నరప్‌గా సోఫీ మౌల్డ్స్(వేల్స్), రెండో రన్నరప్‌గా జెస్సికా కహావటి (ఆస్ట్రేలియా) నిలిచారు. భారత్‌కు చెందిన వాన్యా మిశ్రాకు ఆరో స్థానం దక్కింది. చైనాకు ఈ టైటిల్ రావడం ఇది రెండో సారి. 2007లో ఆ దేశానికి చెందిన జాంగ్ జిలిన్ మిస్ వరల్డ్ కిరీటం ద క్కించుకుంది.
కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతికేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (67) ఆగస్టు 14న చెన్నైలో కాలేయ వ్యాధితో మరణించారు. 1980లో తొలిసారి లాతూర్ స్థానం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన రెండు స్లారు (1999-2003, 2004-08 మధ్య కాలంలో) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 2009 నుంచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.
చిత్రకారుడు కాపు రాజయ్య మృతిప్రముఖ చిత్రకారుడు కళారత్న కాపు రాజయ్య (83) ఆగస్ట్ 20న మెదక్ జిల్లా సిద్ధిపేటలో మరణించారు. డ్రాయింగ్ టీచర్‌గా ఎందరికో తర్ఫీదునిచ్చిన రాజయ్య అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. 1990లో ఆయన కల్లుగీత కార్మికుల జీవితంపై రూపొందించిన చిత్రానికి జాతీయ అవార్డు లభించింది.
1990లో కేంద్ర అకాడెమీ పురస్కారం 2000లో రాష్ర్ట ప్రభుత్వ హంస పురస్కారంతో పాటు అనేక సత్కారాలు ఆయన పొందారు.
మన్మోహన్ రికార్డుభారతదేశ 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆగస్ట్ 15న ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తద్వారా జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఎర్రకోటపై ఎక్కువ సార్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించారు. మన్మోహన్ 2004 ఆగస్ట్ 15న తొలి సారిగా ఎర్రకోటపై జెండా ఎగరవేశారు. మన్మోహన్ కంటే ముందు ఆ పదవిలో ఉన్న బీజేపీ నేత వాజ్‌పేయి ఆరు సార్లు జాతీయ పతాకావిష్కరణ చేశారు.
 
లోక్‌సభ నాయకుడిగా ‘షిండే’కేంద్ర హోం మంత్రిగా కొత్తగా నియమితులైన సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ నాయకుడిగా ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, షిండేని లోక్‌సభ నాయకుడిగా నామినేట్ చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆగస్టు 3న ప్రకటించారు. లోక్‌సభ నాయకుడిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో షిండేని నియమించారు.


From :-
Sakshi
Read more >>

Sunday

అబ్దుల్ కలాం 'టర్నింగ్ పాయింట్'

అబ్దుల్ కలాం 'టర్నింగ్ పాయింట్'

అబ్దుల్ కలాంకు మంత్రి పదవి: 98లో వాజపేయి ఆఫర్- vajpayee wanted induct kalam as minnister in NDA

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆ పదవిలో కూర్చోవడానికి నాలుగేళ్ల ముందే కేంద్రమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చింది. 1998లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరాలంటూ కలాంను ఆహ్వానించారు. అయితే కాలం ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇటీవల రాసిన టర్నింగ్ పాయింట్స్ పుస్తకంలో కలాం ఈ విషయాలను పేర్కొన్నారు.

వాజ్‌పేయి అహ్వానాన్ని అంగీకరించి ఉంటే రాష్ట్రపతిగా ఎంపిక కాక ముందు అబ్దుల్ కలాం కేంద్ర మంత్రి అయ్యేవారు. వాజ్‌పేయి కోరిక తీరి ఉంటే కలాం కేంద్ర మంత్రిగా మరో కొత్త పాత్రలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించేవారు. అయితే, ఆయన అప్పటికే దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నందున వాజ్‌పేయి ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు.

1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఏడాది మార్చి 15న అర్ధరాత్రి వాజ్‌పేయి నుంచి ఫోన్ వచ్చిందని, తాను కొత్త మంత్రివర్గం ఏర్పాటు కోసం జాబితా సిద్ధం చేస్తున్నానని తనను కూడా అందులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తనకు చెప్పారని, దీంతో తాను కొంత సమయం ఇస్తే ఆలోచించుకుని చెబుతానని బదులిచ్చానని, ఆలోచించుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి కోరారని, అప్పటికప్పుడు తన సన్నిహిత మిత్రులతో సంప్రదింపులు మదలు పెట్టానని, తెల్లవారుజామున మూడు గంటల వరకూ మాట్లాడుకుంటూనే ఉన్నామని, ఆ తర్వాత రోజు ఉదయం తాను ప్రధాని నివాసానికి వెళ్లి, మంత్రివర్గంలో చేరరాదన్న నిర్ణయాన్ని చెప్పానని కాలం తన పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ బృందం దేశ ప్రయోజనాలకు సంబంధించి కీలకమైన రెండు బాధ్యతలు నెరవేర్చడంలో తలమునకలై ఉందని, ఒకటి అగ్ని క్షిపణిని అభివృద్ధి పరచడం, రెండోది అణు కార్యక్రమానికి చెందిన వరుస పరీక్షలు నిర్వహించడమని, ఈ రెండు పనులు ఎంతో కీలకమైనవని, తన పూర్తి సమయాన్ని వాటికి సంబంధించిన పనుల కోసం వెచ్చించాల్సి ఉందని, దేశం కోసం ఈ పనులు చేసేందుకు మీరు అనుమతిస్తే ముందుకు సాగుతాను అని చెప్పానని రాశారు. దీంతో మీ భావాలను తాను అభినందిస్తున్నానని, మీ లక్ష్య సాధనలో మీరు ముందుకు సాగిపోవచ్చని వాజ్‌పేయి బదులిచ్చారని కలాం పేర్కొన్నారు.


2004లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రచ్చ
2004లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రచ్చ పైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇన్నాళ్ల తర్వాత బహిర్గతం చేశారు. రాష్ట్రపతిగా తన ఐదేళ్ల పదవీ కాలానికి సంబంధించిన అనుభవాలతో కలాం 'టర్నింగ్ పాయింట్' అనే పుస్తకాన్ని రాశారు. అది త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు మీడియాకు వెల్లడయ్యాయి. 2004 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధానిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యర్థిత్వంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ఆమెతో ప్రమాణ స్వీకారం జరిపించడానికి రాష్ట్రపతి భవనం సిద్ధమైందని కలాం తన పుస్తకంలో వెల్లడించారు.

వివాదాస్పద నిర్ణయాల పేరిట రాసిన పుస్తకంలోని ఓ శీర్షికలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోనియా ప్రధాన పదవిని కోరుకొని ఉంటే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం మినహా రాజ్యాంగపరంగా మరో ప్రత్యామ్నాయమేమీ ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే అనూహ్యంగా సోనియానే మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారన్నారు. సోనియా ప్రధాని కాకపోవడమే కాదు.. మన్మోహన్ ఆ పదవిని చేపట్టడమూ తనను అమితాశ్చర్యానికి గురిచేసిందని కలాం వెల్లడించారు.

ఆ సమయంలో చాలామంది నేతలు కలిసి ఒత్తిళ్లకు లొంగకుండా సోనియాను ప్రధానిగా నియమించాలని విజ్ఞప్తి చేశారని, దీన్ని మన్నించడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు కూడా ఏమీ లేవని, ఆమె సిద్ధమై ఉంటే సోనియాను నియమించడం తప్ప తనకు మార్గాంతరం లేదని స్పష్టం చేశారు. ఊ పుస్తకం ద్వారా కలాం సోనియా అభ్యర్థిత్వానికి తాను మోకాలడ్డానన్న వాదనను పటాపంచలు చేశారు.

అప్పట్లో అబ్దుల్ కలామే సోనియా అభ్యర్థిత్వంపై విముఖత చూపినట్లుగా కథనాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అటు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే, ఇటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఏ పోటీ పడ్డాయని తెలిపారు. ఆ సంకట సమయంలో తాను ఆందోళన పడటానికి తగిన కారణమే ఉందన్నారు. అయినా.. పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కే తొలి అవకాశం ఇవ్వాలని నిర్ణయించానని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ లేఖ పంపానని చెప్పారు. ఫలితాలు వెల్లడవగానే సోనియా.. ప్రధానిని వెంట పెట్టుకొని తన వద్దకు వచ్చిన సందర్భాన్ని వివరించారు.

సోనియా కలవాలనుకుంటున్నారని తనకు తెలిపారని, ఆ రోజు (మే 18) మధ్యాహ్నం 12. 30 గంటల సమయంలో మన్మోహన్‌ను వెంటబెట్టుకొని ఆమె వచ్చారని, ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం తమ పార్టీకి ఉన్నట్టు చెప్పారని, కానీ, పార్టీకి మద్దతు ఇస్తూ వివిధ పార్టీలు ఇచ్చిన సమర్థన లేఖలను మాత్రం అప్పుడు ఇవ్వలేదన్నారు. 19న అందిస్తానని చెప్పారని, కానీ, అదేరోజు రాత్రి కలవాలనుకుంటున్నట్టు సోనియా నుంచి ఈ మెయిల్ అందిందన్నారు. ఆ వెంటనే ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించరాదంటూ అనేకమంది వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఈ మెయిల్ వరద పారించాయన్నారు.

ఆ రాత్రి జరిగిన భేటీలో సోనియా.. మద్దతు లేఖలను అందించానని తెలిపారు. ఆ వెంటనే తాను ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించానని చెప్పారు. మీరు సమ్మతిస్తే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పానని, అప్పుడే ఆమె మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించారని, తమ పార్టీ ఆయనను ప్రధానమంత్రిగా ఖరారు చేసినట్టు వెల్లడించారని, ఆ నిర్ణయం తనను అమిత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సోనియా ప్రమాణ స్వీకారానికి చేసిన ఏర్పాట్లను అప్పటికప్పుడు మార్చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మే 22న మన్మోహన్ సింగ్ ప్రమాణం చేశారని, అప్పటికీగానీ.. పెద్ద భారం తప్పిపోయినట్టు తాను ఊపిరి పీల్చుకోలేకపోయానని వివరించారు. ఐదేళ్లలో ఇలాంటి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడేందుకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అయితే ప్రతిసారీ తన ఆలోచనలు నిష్పక్షపాతంగా ఉండేటట్టు చూసుకున్నానని, నిర్ణయానికి ముందు న్యాయ, రాజ్యాంగ నిపుణులను తీసుకున్నానని గుర్తుచేశారు. హార్పర్ కోలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ కలాం పుస్తకం వచ్చేవారం మార్కెట్‌లోకి విడుదల కానుంది.

2002లో గుజరాత్ గోద్రా అనంతర అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించాలని తాను నిర్ణయం తీసుకోవడం గురించి కూడా కలాం ఈ పుస్తకంలో వివరించారు. పర్యటన వద్దని మంత్రిత్వ, అధికారవర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైందని పేర్కొన్నారు. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి కూడా ఈ సమయంలో పర్యటన అవసరమని భావిస్తున్నారా అని అడిగారని, దానికి తాను చాలా ముఖ్యమైన బాధ్యత అని బదులిచ్చానని వివరించారు.

అయితే, సోనియాపై కలాం వ్యాఖ్యలకు ఇప్పుడు విలువ లేదని జేడీ(యూ) పెదవి విరిచింది. ఈ పని ఆయన 2004లోనే చేసి ఉంటే దేశానికి మంచి జరిగేదని ఆ పార్టీ చీఫ్, ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవిని వదులుకొని సోనియా పెద్ద త్యాగమేమీ చేయలేదని బిజెపి ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ గుర్తు చేశారు. గతించిన చరిత్రగా ఈ ఉదంతాన్ని సిబిఐ జాతీయ నేత రాజా అభివర్ణించారు.

Read more >>

Tuesday

ఎడ్యు న్యూస్...

ఎడ్యు న్యూస్...

మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు అందజేయనున్న వివిధ రకాల స్కాలర్‌షిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీలు..
ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15, 2012.

ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో టెక్నికల్ కోర్సులు (ఐటీఐ సహా) 11వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు: మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ అందజేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వివరాలకు: www.apsmfc.com
www.minorityaffairs.gov.in

డీఎస్సీకి పాత షెడ్యూల్ ప్రకారమే ఫీజు చెల్లింపు
రాష్ట్రంలో 21,363 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్విహ ంచే డీఎస్సీ-2012 రాత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు పాత షెడ్యూలు ప్రకారమే జూలై 12వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో 13వ తేదీలోగా సమర్పించాలి.

రాత పరీక్షలను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబర్ 28న విడుదల చేస్తారు. డీఎస్సీ రాత పరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటికే 2,29,832 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్‌లో అర్హత పొందిన వారి నుంచి మరో 2 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

మ్యాట్-2012
ఎంబీఏ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)-2012కు ప్రకటన వెలువడింది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 13, 2012
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 2, 2012
వెబ్‌సైట్: www.aima-ind.org
Read more >>

విస్తృత అవకాశాల వేదిక... ఫిజియోథెరపీ

విస్తృత అవకాశాల వేదిక... ఫిజియోథెరపీ

హెల్త్‌కేర్ రంగంలో అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న రంగం ఫిజియోథెరపీ. వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టులు పనిచేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా అభ్యర్థులు లేకపోవడంతో.. ఇటీవల కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ పెరిగింది.

జీవన విధానంలో వస్తున్న మార్పులు, ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఏర్పడుతుండడం, స్పోర్ట్స్, ఫిట్‌నెస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో ఫిజియోథెరపీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో విస్తృత అవకాశాల వేదికగా నిలుస్తోన్న ఫిజియోథెరపీ కెరీర్‌పై ఫోకస్..

ప్రస్తుతం వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదంలో గాయపడి కాలు, చేయి ఫ్రాక్చర్ అవడం.. లేదా బెణికినప్పుడు చేసే చికిత్స విధానాల్లో ఫిజియోథెరపిస్టులు పాలుపంచుకుంటారు. వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. క్రీడాకారులకు ఫిట్‌నెస్ సెంటర్లలో ట్రైనర్‌గా సేవలందించడానికి కూడా ఫిజియోథెరపిస్ట్‌లు అవసరం.

ఫిజియోథెరపీకి సంబంధించి మన రాష్ట్రంలో ఒకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ఉండే ఒకేషనల్ కోర్సుకు అర్హత పదో తరగతి. ఫిజియోథెరపిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం.. బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. ఈ కోర్సును బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)గా వ్యవహరిస్తారు. తర్వాత పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బీపీటీ:
బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ). కోర్సు కాల వ్యవధి: నాలుగున్నరేళ్లు (ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి). మన దేశంలో దాదాపు 180 కాలేజీలు బీపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

ఇందులో 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ-విజయవాడ, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లను ఖరారు చేస్తుంది. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది
వివరాలకు: http://119.226.156.211

కావల్సిన స్కిల్స్:
ఫిజియోథెరపీ ఒక ప్రత్యేకమైన రంగం కాబట్టి ఇందులో రాణించాలంటే... కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. ఒక సమస్యకు శాస్త్రీయంగా కారణాలు చెప్పడంతోపాటు పరిష్కార మార్గాలను సూచించే నైపుణ్యం తప్పనిసరి. గంటల తరబడి పనిచేయగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. పేషెంట్ల పట్ల సానుభూతితోపాటు సహనంతో వ్యవహరించాలి. దాంతోపాటు వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలగాలి. మంచి పరిశీలన సామర్థ్యం ఉండాలి. నూతన విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి తప్పనిసరి.

అవకాశాలు:
వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టుల అవసరం ఉంటోంది. ప్రస్తుతం మన దేశంలో డిమాండ్‌కు సరిపడా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేరు. ఒక అంచనా ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉండాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కోర్సు పూర్తి చేసిన వెంటనే ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లు, హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లు, రక్షణ శాఖ, హెల్త్ క్లబ్‌లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, మానసిక చికిత్సాలయాలు, స్పోర్ట్స్ క్లినిక్స్‌లలోను ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా... వివిధ రిహాబిలిటేషన్ సెంటర్లల్లో కూడా అవకాశాలుంటాయి.

క్రీడారంగం కూడా చక్కని కెరీర్ అవెన్యూగా నిలుస్తోంది. ఇందులో క్రీడాకారులకు ఫిజియోలుగా, ట్రైనర్లుగా అవకాశం ఉంటుంది. ఫిట్‌నెస్‌పై ప్రజల్లో పెరుగుతన్న అవగాహనతోపాటు తదనుగుణంగా ఏర్పాటవుతున్న ఫిట్‌నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్ లు ఫిజియోథెరపిస్ట్‌లకు డిమాండ్‌ను పెంచాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఎంఎన్‌సీలు కూడా విధిగా ఫిట్‌నెస్ సెంటర్లను నిర్వహిస్తుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ఫిజియోథెరపీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెసర్/ఫ్యాకల్టీగా చేరొచ్చు. సొంతంగా క్లినిక్‌లను ప్రారంభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా వీరికి చక్కని అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫిజియోథెరపిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది.

వేతనాలు:
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఫిజియోథెరపిస్ట్‌లకు నెలకు * 10,000 నుంచి * 30,000 వరకు వేతనం లభిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఫ్రెషర్స్‌కు ప్రారంభంలో నెలకు * 10,000 నుంచి * 15,000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రారంభంలో నెలకు *30,000 వరకు చెల్లిస్తున్నారు. తర్వాత హోదాను బట్టి సీనియర్ ఫిజియోథెరపిస్ట్‌కు * 45,000, సూపరింటెండెంట్ కేడర్‌కు * 60-70 వేల వరకు వేతనం లభిస్తుంది.

చీఫ్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాక నెలకు *80,000 వరకు సంపాదించవచ్చు. టీచింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకున్నా వారికి ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి ప్రారంభంలో నెలకు * 10,000 తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీ హోదాను బట్టి నెలకు * 40,000 వరకు సంపాదించవచ్చు. చాలా మంది ఫిజియోథెరపిస్ట్‌లు సొంత ప్రాక్టీస్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారణంగా ఒక్కో సిట్టింగ్ దాదాపు * 250 నుంచి * 400 వరకు చార్జ్ చేస్తారు.

విదేశాల్లో:
ఫిజియోథెరపిస్ట్‌లకు విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, కెనడాలలో ఫిజియోథెరపిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. నేషనల్ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని దేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఫిజియోథెరపిస్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, కెనడా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాలు వీరికి చక్కటి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. భారతీయ కరెన్సీలో నెలకు రూ. 50,000 నుంచి రూ.2 లక్షల వరకు లభిస్తుంది.

ఉన్నత విద్య:
బీపీటీ తర్వాత పీజీ స్థాయిలో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సులో కూడా కౌన్సెలింగ్ ద్వారానే ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జూలై/ఆగస్టు/సెప్టెంబర్‌లలో వెలువడుతుంది. రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలు వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆసక్తిని బట్టి పీహెచ్‌డీ కోర్సును చేయవచ్చు.

ఎంపీటీ-స్పెషలైజేషన్స్:
ఆర్థోపెడిక్స్
న్యూరాలజీ
కార్డియాలజీ అండ్ వ్యాస్కులర్ ప్లామెంటరీ
స్పోర్ట్స్ మెడిసిన్

నిమ్స్: రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలతోపాటు నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)- హైదరాబాద్ కూడా ఫిజియోథెరపీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. వివరాలు..
కోర్సు: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).

అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు/సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.

ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ):
అర్హత: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలై/ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. రాత పరీక్ష ఆగస్టు/సెప్టెంబర్ లలో ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.
వివరాలకు: http://nims.ap.nic.in
.................

దేశంలోని ప్రముఖ ఫిజియోథెరపీ కాలేజీలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-ముంబై
వెబ్‌సైట్: www.aiipmr.gov.in/
పండిట్ దీన్‌దయాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.iphnewdelhi.in
పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-చండీగఢ్
వెబ్‌సైట్: www.pgimer.nic.in
కేఈఎం హాస్పిటల్ అండ్ సేథ్ జీఎస్ మెడికల్ కాలేజ్-ముంబై
వెబ్‌సైట్: www.kem.edu
......................


100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సు
గతంలో విద్యార్థుల్లో అంతగా అవగాహన లేక పోవడంతో బీపీటీ కోర్సుకు ఆదరణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి చాలా మారింది. హెల్త్ సెక్టార్ విస్తరిస్తుండడం... పెరుగుతున్న అవకాశాల ఫలితంగా బీపీటీ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది.

ప్రస్తుతం ఇది 100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సుగా గుర్తింపు పొందుతుంది. కోర్సు పూర్తి చేసిన వారికి కేవలం హెల్త్ సెక్టార్‌లోనే కాకుండా.. ఫిట్‌నెస్ సెంటర్లు, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఎంఎన్‌సీలు ఫిట్‌నెస్ సెంటర్‌ను కచ్చితంగా నిర్వహిస్తుండడం కూడా బీపీటీ అభ్యర్థులకు వరంగా మారింది. విదేశాల్లో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తున్నారు.

పీజీ చేస్తే ప్రారంభంలోనే నెలకు రూ. 18,000 వేతనం అందుకోవచ్చు. అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో ఫిజియోథెరపిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. గల్ఫ్ దేశాల విషయానికొస్తే.. అక్కడి ప్రతినిధులు ఇక్కడికే వచ్చి అవసరమైన అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. బీపీటీ తర్వాత ఎంపీటీ కోర్సులు చేయవచ్చు. ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కోర్సు చేయొచ్చు.
-విశ్వనాథ్, ప్రిన్సిపల్, కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
ఫిజియోథెరపీ అండ్ పారామెడిక్స్
.................


అన్నీ పరిశీలించి ప్రవేశించాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఫిజియోథెరపీ కళాశాలకు కనిష్టంగా 30 నుంచి గరిష్టంగా 50 మంది పేషెంట్స్ కెపాసిటీ ఉన్న ఔట్ పేషెంట్ విభాగం ఉండాలి. దీంతోపాటు అనాటమీ, ఎలక్ట్రోథెరపీ తదితర ల్యాబ్ సౌకర్యాలు, ఒక్కో కళాశాలలో బ్యాచ్‌కు 50 మంది చొప్పున గరిష్టంగా నాలుగు బ్యాచ్‌లు మాత్రమే ఉండాలి. అదేవిధంగా ప్రతి కళాశాల వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా ఉండాలి.

ఫిజియోథెరపీ విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యం కలగాలనే ఉద్దేశంతో విధించిన నిబంధనలివి. కాబట్టి విద్యార్థులు కళాశాలను ఎంచుకునే ముందు వీటన్నిటినీ పరిశీలించాలి.
Read more >>

పరిశోధనలకు ప్రోత్సాహం..

పరిశోధనలకు ప్రోత్సాహం..

ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్

అందించేది: కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర,సాంకేతిక శాఖ విభాగం

ఉద్దేశం: 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులను పరిశోధనలవైపునకు ఆకర్షించడానికి కేంద్రప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్‌డ్ రీసెర్చ్’ (ఇన్‌స్పైర్) స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది.

బేసిక్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్‌లలో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు.. రీసెర్చ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. నిష్ణాతులైన యువ శాస్త్రవేత్తలను దేశానికందించే ఉద్దేశంతో ‘స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ (ఎస్‌హెచ్‌ఈ) పేరుతో వీటిని ఇస్తున్నారు. ఈ ఏడాదికి స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్ వెలువడింది.

మొత్తం స్కాలర్‌షిప్స్: 10,000

ఏఏ కోర్సులకు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/సంస్థల్లో బేసిక్, నేచురల్ సెన్సైస్‌లో మొదటి ఏడాది బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న లేదా చదవడానికి నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎర్త్ సెన్సైస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ అందుతుంది.

కొన్ని కోర్సులకు స్కాలర్‌షిప్ లేదు..
ఇంజనీరింగ్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, ఎలక్ట్రానిక్ సెన్సైస్, మెడికల్ అండ్ బ యోమెడికల్ సెన్సైస్, అప్లైడ్ సెన్సైస్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ పరిధిలోకి రావు.

ఎన్నేళ్లపాటు:
విద్యార్థి ప్రతిభ, ఏటా అకడెమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి స్కాలర్‌షిప్‌ను పొడిగిస్తారు. ఇలా గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్‌ను అందుకునే సదుపాయం ఉంది.

అర్హతలు:
స్టేట్‌బోర్డ్స్/సెంట్రల్ బోర్డ్ 2012లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీరు గుర్తింపు పొందిన వర్సిటీల్లో నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్‌లలో బీఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, సీబీఎస్‌ఈ మెడికల్ బోర్డ్ నిర్వహించే జాతీయస్థాయి పోటీ పరీక్షలలో టాప్ 10,000 ర్యాంకులలోపు సాధించి ఉండటంతోపాటు ఐఐటీలు/ఎన్‌ఐటీల్లో నేచురల్, బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ), జగదీశ్‌చంద్రబోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ (జేబీఎన్‌ఎస్‌టీఎస్) స్కాలర్స్ ఐఐఎస్‌ఈఆర్, నైసర్, డీఏఈ-సీబీఎస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అభ్యసిస్తుండాలి.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో పతకాలు సాధించిన విద్యార్థులు బ్యాచిలర్/మాస్టర్స్ స్థాయీ కోర్సులలో నేచురల్ సెన్సైస్ చదువుతుండాలి.

వయోపరిమితి:దరఖాస్తు సమర్పించేనాటికి వయస్సు కనీసం 17 ఏళ్లు ఉండి, 22 ఏళ్లు మించరాదు.

కటాఫ్ మార్కులు:
స్టేట్‌బోర్డులు, సెంట్రల్ బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. ఆ మార్కుల శాతం సాధించినవారు మాత్రమే ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి కటాఫ్ మార్కుల శాతాలను డీఎస్‌టీ ఇంకా విడుదల చేయలేదు. 2011లో మన రాష్ట్ర విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌లో నిర్దేశించిన కటాఫ్ మార్కుల శాతం 96.2

స్కాలర్‌షిప్ మొత్తం:
ఏడాదికి * 80,000. గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇందులో * 60,000 నగదు స్కాలర్‌షిప్ కింద చెల్లిస్తారు. మిగతా *20,000 సమ్మర్ ప్రాజెక్ట్ కోసం ఇస్తారు.

సమ్మర్‌టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్:
ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధన సంస్థలలో సమ్మర్‌టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో కూడా సమ్మర్ ప్రాజెక్ట్ చేయొచ్చు. దీనికోసం *20,000 మెంటార్‌షిప్ గ్రాంట్ ఉంటుంది.

ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విద్యార్థి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో.. ఎవరి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేశాడో వారి వద్ద అటెస్టేషన్ లెటర్ , ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ వివరాలను డీఎస్‌టీకి పంపాలి. ఇలా స్కాలర్‌షిప్ పొందే ఐదేళ్లు సమ్మర్ టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేయాలి. దీని కోసం కేటాయించే * 20,000 వివిధ సెమినార్లకు హాజరయ్యేందుకు, నివసించడానికి, ఇతర ప్రాజెక్ట్ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

స్కాలర్‌షిప్ విడుదల:
స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదిలో రెండు విడతల్లో (* 30,000 చొప్పున) స్కాలర్‌షిప్ విడుదల చేస్తారు. ఇందుకోసం స్టేట్‌బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్‌బీఐ)లో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ దరఖాస్తు పంపే విధానం:
నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు పదో తరగతి మార్కుల లిస్ట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, ఐఐటీ-జేఈఈ/ఏఐఈఈఈ ర్యాంక్ కార్డ్, గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో చదువుతున్నట్లు లేదా నమోదు చేసుకున్నట్లు డెరైక్టర్/రిజిస్ట్రార్ లెటర్ అటెస్ట్‌డ్ జిరాక్స్ కాపీలను ఆర్డినరీ పోస్టులో పంపాలి. ఎన్వలప్‌పైన ‘అప్లికేషన్ ఫర్ ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్-2012’ అని రాయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు పంపే విధానం:
www.inspiredst.gov.in/online.html లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింటవుట్ తీసుకుని సంబంధిత పత్రాలతో దిగువ చిరునామాకు పంపాలి.

పూర్తిచేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
డెరైక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఐఎస్‌టీఏడీఎస్), డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ-110012.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తును సమర్పించాలి. జూన్ 20, 2012న ప్రకటన వెలువడింది.

వెబ్‌సైట్: www.inspire-dst.gov.in
................

మనదేశంలో చదువుకోవడానికి పెద్ద అడ్డంకి ఆర్థికలేమి. ఎంతోమంది విద్యార్థులకు అపార ప్రతిభాసంపత్తి ఉన్నప్పటికీ పేదరికం వారిని ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకుంటుంది. దీన్ని గుర్తించిన అనేక దేశీయ, విదేశీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మేమున్నామంటూ వారికి భరోసానిస్తున్నాయి. చదువు పూర్తయ్యేవరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తూ విద్యార్థుల కెరీర్ ఉన్నతికి తోడ్పడుతున్నాయి. ఆయా సంస్థలందించే స్కాలర్‌షిప్స్‌పై ఫోకస్..

మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్
స్కాలర్‌షిప్స్ ఫర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్
పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ప్రభుత్వ గుర్తిం పు పొందిన కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందించే మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్స్ కోసం ప్రకటన వెలువడింది. ముంబైలోని కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏటా ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది.

మహిళలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు, అంగవైకల్యం గల పిల్లలకు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సంతానానికి స్కాలర్‌షిప్స్ కేటాయింపులో ప్రాధాన్యతనిస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: మూడేళ్లపాటు నెలకు * 1000 చొప్పున ఏడాదికి (10 నెలలు) * 10,000 ఇస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరిమితి మేరకు మౌఖిక పరీక్షకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దిగువ చిరునామాకు విద్యార్థులు సొంత చిరునామా ఉన్న కవరును పంపి జూలై 16వ తేదీలోగా దరఖాస్తులను పొందాలి.

దరఖాస్తులు పొందడానికి చిరునామా:
శ్రీ జయదీప్ దాస్,
డిప్యూటీ జనరల్ మేనేజర్-మార్కెటింగ్,
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్,
మహీంద్రా హౌస్, టి.ఎస్.రెడ్డి కాంప్లెక్స్,
1-7-1 పార్క్ లేన్, ఎస్.డి.రోడ్,
సికింద్రాబాద్-500003.

దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ: జూలై 16, 2012
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్‌సైట్: www.mahindra.com
....................

రోడ్స్ స్కాలర్‌షిప్
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది రోడ్స్ స్కాలర్‌షిప్. ఈ ఏడాదికిగాను సంబంధిత నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు కనీసం రెండేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ సదుపాయం లభిస్తుంది.

ఒక ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశం పొంది స్కాలర్‌షిప్‌నకు ఎంపిైకై..కోర్సు వ్యవధి ముగిశాక మరో కోర్సులో ప్రవేశం పొందిన కూడా స్కాలర్‌షిప్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది.

ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్‌ఫీజు, విమాన ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తారు.
అర్హత: భారతీయ పౌరులై, అక్టోబర్ 1, 2013 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్, సెన్సైస్, లా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతూ మంచి అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2012. వెబ్‌సైట్: www.rhodesscholarships-india.com
..................

సాహుజైన్ ట్రస్ట్ స్కాలర్‌షిప్స్-న్యూఢిల్లీ
వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సాహుజైన్ ట్రస్ట్ అందించే ఇన్‌లాండ్ స్కాలర్‌షిప్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది.

ఏఏ కోర్సులకు: టెక్నికల్ ట్రేడ్ కోర్సులు
(కంప్యూటర్స్, ఇన్ఫోటెక్ కోర్సులతో సహా)
ప్రొఫెషనల్ కోర్సులు
(ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనవి)
గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఇతర కోర్సు లు చదువుతున్న విద్యార్థులకు అకడెమిక్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: కోర్సును బట్టి నెలకు * 150 నుంచి * 1000 వరకు ఈ స్కాలర్‌షిప్ అందుతుంది.

దరఖాస్తు విధానం: సొంత చిరునామా రాసిన 9 ఇన్‌టూ 4 సెం.మీ ఎన్వలప్‌పై * 5 స్టాంపులు అతికించి సెక్రటరీ, సాహుజైన్ ట్రస్ట్, 18, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, లోఢి రోడ్, న్యూఢిల్లీ-110003 అనే చిరునామాకు పంపి దరఖాస్తులు పొందొచ్చు.
దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ:జూలై20, 2012
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్‌సైట్: http://sahujaintrust.timesofindia.com
Read more >>