అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లి ఒబామా ట్విట్టర్‌లో ఖాతా తెరిచారు. ఆమె ట్విట్టర్‌లో చేరిన కొద్ది గంటల్లోనే లక్ష మంది అనుచరులను సంపాదించకున్నారు. ట్విట్టర్‌లో చేరడం ఎంతో ఉత్సాహంగా ఉందని.. అందరితో కలిసిపోవడానికి ఇదొక కొత్తదారి అని మిషెల్లి తొలిసారి ట్విట్‌లో పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచారానికి ట్విట్టర్ ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. "ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. మీతో అనుభూతులు పంచుకోవడానికి ట్విట్టర్‌లో చేరాను.. ఇక అందరితో కలిసిపోయేందుకు ముందుకు సాగుతాను'' అని మిషెల్లి ట్విట్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికి ఐదు అకౌంట్లు తెరిచిన మిషెల్లి ఎంవో పేరుతో ట్విట్ చేస్తున్నారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే ట్విట్టర్‌లో 11 మిలియన్ల అనుచరులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఆయన 6 లక్షల 83 వేల ట్విట్టర్ అకౌంట్లు తెరిచారు. మొత్తానికి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్విట్టర్ కీలకం కానుంది.

0 comments:
Post a Comment