Friday

పుట్టిననాడే... జీవితకాలం చెప్పొచ్చు టెలోమియర్ల పొడుగే కీలకం యూకే శాస్త్రజ్ఙున ప్రకటన మానవులపై ఇంకా ప్రయోగాలు చేయాల్సిందని వివరణ


సాధారణంగా ప్రతి వ్యక్తికీ తాను ఎన్నేళ్లు బతుకుతానో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలా అనుకునేవారు ఇక జాతకా లు చూపించుకోనక్కర్లేదు. చిలకజోస్యాలు చెప్పించుకోనక్కర్లేదు. హస్తసాముద్రికం, ముఖసాముద్రికం అంటూ ఎవర్నిపడితే వాళ్లని నమ్మక్కర్లేదు. సైన్స్‌ని ఆశ్రయిస్తే చాలు.

అవును.. ఒక మనిషి జీవితకాలం ఎం తో దాదాపు కచ్చితంగా చెప్పే కీలకమైన జన్యుసూచికనొకదాన్ని కనుగొన్నామని గ్లాస్గో యూనివర్సిటీ(యూకే) శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వారు చెబుతున్న ఆ కీలక జీన్ ఇండికేటర్లు.. టెలోమియర్లు.మనిషి శరీరంలోని క్రోమోజోముల కొసభాగంలో ఉండి, వాటిని క్యాప్‌లాగా మూసి ఉంచే నిర్మాణాలివి. ఏ జీవి అయినా పుట్టిన సమయంలో ఇవి పొడుగ్గా ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ వాటి పొడవు తగ్గుతుంటుం ది.

తమ అధ్యయనంలో భాగంగా గ్లాస్గో వర్సిటీ శాస్త్రజ్ఞులు జీబ్రా ఫించ్ రకానికి చెందిన 99 పక్షులను ఎంచుకున్నారు. అవి పుట్టిన 25 రోజులకు వాటి డీఎన్ఏల్లో ఉన్న టెలోమియర్లు ఎంత పొడవున్నా యో కొలిచారు. తర్వాత ప్రతి ఏడాదీ వాటి రక్తపు నమూనాలను సేకరించి అందులోని క్రోమోజోములను అంటి ఉన్న టెలోమియర్ల పొడవును లెక్కిస్తూ వచ్చారు. ఎక్కువ పొడవు టెలోమియర్లు ఉన్న పక్షులు దాదాపు 8.7 సంవత్సరాలు బతకడం గమనార్హం.

ఫించ్ పక్షుల్లో అది అత్యంత సుదీర్ఘ జీవితకాలం కిందే లెక్క. ఫించ్‌ల తరహాలోనే సకశేరుకాలైన (వెన్నెముక గల జీవులు) మానవుల్లో కూడా టెలోమియర్ల పొ డవును లెక్కించడంద్వారా వారి జీవితకాలం తెలుసుకోవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత లేదని,ఇంకా ప్రయోగాలు జరగాల్సి ఉందని ఈ అధ్యయనం చేసిన బ్రిట్‌హెయిడింగర్ అన్నారు.

"టెలోమియర్లు మేం పరిగణనలోకి తీసుకున్నవాటిలో ఒక అంశం మాత్రమే, విభిన్న వ్యక్తుల జీవితకాలాన్ని నిర్ధారించడంలో వేర్వేరుఅంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిఉంది''అని ఆయనవి వరించారు."మరణానికిచాలా కారణాలుంటాయి.టెలోమియర్లు క్రమే పీనశించిపోవడంఒక్కటే కారణంకాకపోవచ్చు''అని వ్యాఖ్యానించారు.

0 comments:

Post a Comment