కోరుకుంటే కోర్టుకు సహకరిద్దాం
కయానీ నేతృత్వంలో సైనిక కమాండర్ల భేటీ
సుప్రీం, సైన్యానికి వ్యతిరేకంగా సభా విశ్వాసం కోరను: గిలానీ
24 గంటల్లోనే దుబాయ్ నుంచి జర్దారీ రాక

తొలి వేటు ఎవరిది? సుప్రీంకోర్టుదా లేక సైన్యానిదా?. అవినీతి కుంభకోణాలతో కుళ్లి కంపుకొడుతున్న పాకిస్థాన్ పాలనా వ్యవస్థపై చివరి మేకు కొట్టేదెవరన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "మాకు కేసుతో తప్ప కుట్రలు, కూల్చివేతల'తో సంబంధం లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రకటించగా, అధ్యక్షుడు జర్దారీ తదితరులపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూడాలని సైన్యం నిర్ణయించింది. బంతిని కోర్టులోకి నెట్టింది.
ఇక, దుబాయ్ పర్యటనకు తరలిపోయిన అధ్యక్షుడు జర్దారీ 24 గంటలు గడవకముందే స్వదేశం చేరుకున్నారు. ఇదంతా చూస్తుంటే సర్కారుకు సైన్యం ఆటవిడుపు ఇచ్చినట్టే కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం పిలుపు మేరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. దేశాన్ని ప్రభుత్వం నుంచి కాదు.. సైన్యం నుంచి కాపాడాలని ప్రధాని జిలానీ పిలుపునిచ్చారు.
జర్దారీ సహా పలువురు అవినీతిపరులపై గతంలో తీసివేసిన అవినీతి కేసుల్లో తిరిగి దర్యాప్తు జరపమని ఎన్ని సార్లు చెప్పాలని, ఇలాగయితే జర్దారీతో పాటు ప్రధాని గిలానీపైనా చర్య తీసుకోవాల్సి ఉంటుందన్న సుప్రీంకోర్టు హెచ్చరికలు గిలానీ సర్కారులో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇదే అదుపుగా ప్రభుత్వంపై సైన్యం, ఐఎస్ఐ విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారమిక్కడ ఆర్మీ అధిపతి కయానీ నేతృత్వంలో సైనిక ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. దేశంలో సుడులు తిరుగుతున్న రాజకీయ సంక్షోభంపై కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. ''తొందర పడొద్దు. ప్రభుత్వానికి సోమవారం దాకా సుప్రీంకోర్టు గడువిచ్చింది. ఆ లోగా గతంలో మూసేసిన కేసుల్లో తిరిగి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.
లేనిపక్షంలో ప్రధాని గిలానీని అనర్హుడిగా ప్రకటిస్తామని హెచ్చరించింది. అవినీతిలో కూరుకుపోయి అప్రతిష్టపాలైన ప్రభుత్వంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేదాకా ఆగుదాం. ఏమి చేయాలనేది ఆ తరువాత నిర్ణయించుకుందాం'' అని నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తన కథనంలో వెల్లడించింది. "సుప్రీంకోర్టును బలపరుద్దాం.
అవసరమైన సహకారం అందిద్దాం. కోర్టు తీర్పు అమల్లో మన సహాయం కోరితే తప్పక చేద్దాం'' అని కమాండర్లు నిర్ణయించినట్టు పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ సైనిక అధికారి తెలిపారు. సుప్రీంకోర్టు చరిత్ర తెలిసిన వారెవరూ ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. వంద రాబందులను తిన్న.. అన్నట్టు పూర్వ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్.. సుప్రీం చీఫ్ జస్టిస్ ఇఫ్తికర్ చౌధురీ దెబ్బకు పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం వెలువడే తీర్పు 'ప్రజాస్వామ్య' ప్రభుత్వ భవిష్యత్తును తేల్చేయనుంది. ఇదిలా ఉండగా, కోర్టు పరుషఆదేశాలు, సైన్యం,ఐఎస్ఐ హెచ్చరికల నేపథ్యంలో మొదలైన జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గిలానీ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రజాస్వామ్యం కావాలో, నియంతృత్వం కావాలో తేల్చుకోమని కోరారు. సమావేశం మొదలైన వెంటనే.. అధికార పక్ష సభ్యులు " జిలానీ రాజకీయ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉన్న'దంటూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరగనుంది. అంతకుముందు.. సైన్యాన్ని ఉద్దేశించి గిలానీ నేరుగానే విమర్శలు గుప్పించారు. వ్యవస్థల మధ్య ఘర్షణ కోరవడం లేదని, అందుకనే సుప్రీంకోర్టు, సైన్యానికి వ్యతిరేకంగా సభా విశ్వాసం కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. సంక్షోభం నుంచి బయటపడటానికి తమకు ప్రతిపక్షాల మద్దతు అక్కర్లేదని తేల్చి చెప్పారు.
సైన్యం తిరుగుబాటుపై ఆందోళనతో ఉన్న జర్దారీ..24 గంటల్లోనే దుబాయ్ పర్యటన ముగించుకొని స్వదేశం చేరుకున్నారు. జర్దారీ దుబాయ్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, స్నేహితుని కుమారుడి నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొన్నారని అధ్యక్ష భవనం తెలిపింది.

0 comments:
Post a Comment