రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మహర్దశ పట్టనున్నదని చెప్పలేముకానీ, ప్రస్తుతమున్న మందకొడి తనం నుంచి కొద్ది చురుకు పుంజుకుందన్న ఆశ కనిపిస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర వాణిజ్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు-2012 జరిగింది. ఈ సదస్సుకోసం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను ఖర్చు చేసి 120 దేశాల్లో రోడ్‌షోలను నిర్వహించింది. ఇంతచేసినా 43 దేశాల నుంచి 1500మంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. 'కొత్త తరానికి చెందిన నవ్యతకు పట్టం కట్టే భాగస్వామ్యాలు' అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.
భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు 243 ప్రతిపాదనలు వచ్చాయని, వీటి ద్వారా సుమారుగా ఏడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు నిరంతరం మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సదస్సులో హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగాన్ని నిరంతరాయంగా ప్రోత్సహించడంలో భాగంగా నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాని ప్రభావం లేదని తొమ్మిది శాతం వృద్ధిరేటును సాధించామని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం 25 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరులు, పారిశ్రామిక విధానాలు ఇతర అంశాలను సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులకు విందు సందర్భంగా సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రత్యేకంగా వివరించినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. జపాన్, ఇండోనేషియా, అమెరికా, యూఏఈ, అఫ్ఘానిస్థాన్, కువైట్, శ్రీలంక, సౌదీ అరేబియా తదితర దేశాల ప్రతినిధులు సిఎంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వరుస కుంభకోణాలు, అస్తవ్యస్త పారిశ్రామిక విధానాలు,భూసేకరణలో జాప్యం, విద్యుత్ సంక్షోభం, వగైరా ప్రతికూలతల కారణంగా పెట్టుబడుల విషయంలో కార్పొరేట్ సంస్థలు సంశయిస్తున్నాయి.
నూతన పారిశ్రామికవేత్తలు, కొత్త తరహా పరిశ్రమలు, వినూత్న సాంకేతికత తదితర అంశాల ప్రాతిపదికన దేశ, విదేశీ సంస్థలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చ జరగవలసి ఉంది. అందుకు భిన్నంగా కేవలం రాష్ట్రానికి మదుపులను రాబట్టే అంశంపైనే ఈ సదస్సు నడిచింది. రాష్ట్రంలో చివరిసారిగా 2003లో చంద్రబాబునాయుడు హయాంలో ఈ భాగస్వామ్య సదస్సు జరిగింది. ఆ తర్వాత కూడా అనేక చిన్న, పెద్ద పారిశ్రామిక సదస్సులు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2010లో ప్రతిపాదించిన భాగస్వామ్య సదస్సు జరగలేదు. గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కూడా ఉద్యమాల కారణంగా వాయిదా పడింది.
అయితే గత సదస్సుల సందర్భంగా జరిగిన ఒప్పందాలలో 20 శాతానికి మించి ఎన్నడూ వాస్తవ రూపం దాల్చలేదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి అడపాదడపా జరిపే ఇలాంటి మేళాల్లో నిరుపయోగమైన ఎంఓయూల జాతర పద ్ధతికి స్వస్తి చెప్పాలి. ఒక ఖచ్చితమైన ప్రణాళికతో, నిర్దిష్ట కాలపరిమితితో పెట్టుబడి సేకరణ ప్రచారాలను చేపడితే నికార్సయిన ఒప్పందాలు జరిగేందుకు అవకాశముంటుంది. అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుల ద్వారా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు బాగా లబ్ధి పొందాయి. దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలు ఆ రాష్ట్రాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడ్డాయి.
మన రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి కోసం అనేక హామీలతో నానా తంటాలు పడుతున్నప్పటికీ సానుకూలత సాధించలేకపోవడం దురదృష్టకరం. అప్పటికీ విదేశాలకు తొమ్మిది మంది ఉన్నతాధికారులను పంపి లాబీయింగ్ చేయించినా తగినంత స్పందన రాలేదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా సర్వత్రా మార్కెట్లు నిరాశాజనకంగా ఉండడంతో అనేక కార్పొరేట్ సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు ఎంఒయూల జాతరలో కొత్త ప్రాజెక్టులే కాకుండా పూర్వమెప్పుడే ఆమోదం పొందిన పాత ప్రాజెక్టులను కూడా క్యూ కట్టించారన్న ఆరోపణలున్నాయి. కళ్లుచెదిరే అంకెలను ప్రదర్శించడం కోసం ఆర్భాటంగా వందల సంఖ్యలో ఎంఒయూలు కుదుర్చుకోవడం కంటే నికరంగా ఆచరణ రూపంలోకి వచ్చే పదుల సంఖ్యలోని ప్రాజెక్టులు మేలు.
పర్యావరణ, ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమాలు రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ ఈ భాగస్వామ్య సదస్సు సందర్భంగా విద్యుత్, పెట్రో ప్రాజెక్టుల ప్రతిపాదనలే ప్రధానంగా ముందుకొచ్చాయి. ఎన్‌టిపిసి, ఏపీ జెన్‌కో, ఏపి పవర్ డెవలప్‌మెంట్, సింగరేణి కాలరీస్, జీవీకే, నెల్‌కాస్ట్, థర్మల్‌టెక్, పవర్‌టెక్ తదితర సంస్థలకు చెందిన రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. కెజీ బేసిన్‌లో నిక్షేపాల వెలికితీత పునాదిగా ఆయిల్, గ్యాస్ రంగంలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు రానున్నాయి. యష్ బిర్లా గ్రూప్ రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయలతో పాలీ సిలికాన్ మైనింగ్, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఆయుర్వేద గ్రామ నిర్మాణం అనే మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధపడింది.
ప్రస్తుత జీడీపీలో 16 శాతంగా ఉన్న ఉత్పత్తుల రంగం వాటాను 25 శాతానికి లక్ష్యంగా ఏడు భారీ పెట్టుబడి, ఉత్పత్తి కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఈ సదస్సులో ప్రకటించారు. ఈ కారిడార్ల ద్వారా 2012 నాటికి పది కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై-ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల అనుమతుల్లో చోటు చేసుకున్న అవినీతిని నియంత్రించేందుకు 'జీ టు బి' అనే వెబ్ పోర్టల్‌ను కేంద్రం ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటగా ప్రారంభిస్తోంది. దీని ద్వారా పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన నుంచి అనుమతి మంజూరు వరకు సాగే ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే నడపొచ్చు.
దేశంలో ఆర్థికంగా త్వరగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఫార్మా, ఐటీ, వైద్య సేవల రంగాల్లో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉంది. అయితే ఈ సదస్సు సందర్భంగా ఆయా రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలు పెద్దగా రాలేదు. సెజ్‌లు, ఐటీ పార్కుల పేరిట గత ఏడేళ్ళలో లక్ష ఎకరాలకు పైగా భూముల్ని కేటాయించారు. ఏవో కొద్ది సంస్థలు మినహా ఇందులో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. గనులు, భూములు, ఓడరేవులు పొందడం కోసం ప్రభుత్వ అధినాయకులు సూచించిన ఆశ్రిత సంస్థల్లో మదుపులు పెట్టవలసిన దుస్థితి.
పరిశ్రమలకు అనుమతుల మంజూరులో రాజకీయ జోక్యం, అవినీతి కారణంగా కుంభకోణాలు వెలుగులోకి రావడం, వాటిపై సిబిఐ దర్యాప్తు, కోర్టు కేసులు లాంటి చిక్కుల కారణంగా కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావడంలేదు. అనేక పారిశ్రామిక ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, సరఫరాలో అవతవకలు, విద్యుత్ చార్జీల పెంపుల్లాంటి సమస్యలు పారిశ్రామిక అభివృద్ధికి అవరోధంగా ఉన్నాయి. ఈ అవరోధాలను అధిగమించి సదస్సులో కుదిరిన ఒప్పందాలన్నీ అమలుకు నోచుకుంటే రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మహర్దశ వచ్చినట్లే.

0 comments:
Post a Comment