రాష్ట్ర ప్రభుత్వం రానున్న మూడేళ్లలో ఏడాదికి 5 లక్షల వంతున 15 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం భాగస్వామ్య సదస్సులో దేశ విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రం లో 25ఏళ్ల లోపు వయస్సున్న యువత 54 శాతం ఉన్నారని, వారికి సరైన దారి చూపించే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండ గా నిలవాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2011 చివరి నాటికి లక్ష మంది కి ఉపాధి కల్పించిందని ఆయన చెప్పారు.
ఈ ఏడాది లక్ష ప్రభుత్వోద్యోగాలు అందించాలని నిర్ణయించిందని, ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పా రు. ఇందుకోసం కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి గా తొలగించినట్టు ఆయన తెలిపారు. రానున్న ఏడాది కాలంలో నియమించుకోనున్న లక్ష మంది ఉద్యోగులను పూర్తిగా ప్రతిభ ప్రాతిపదిక మీదనే తీసుకుంటామని, వారు ఉద్యోగం పొందడానికి పోటీ పరీక్షల్లో సాధించిన మార్కులే గీటురాయి అని ఆయన వివరించారు. ప్రభుత్వంలో పలుకుబడి ఉండడం లేదా పలుకుబడి గల వారి సిఫారసు తీసుకురావడం ద్వారా మాత్రమే ప్రభుత్వోద్యోగం పొందగలమన్న దురభిప్రాయం ఇంతవరకు యువతలో ఉన్నదని, దాన్ని తొలగించి ప్రతిభ గల వారికే ప్రభుత్వోద్యో గం వస్తుందన్న నమ్మకం కలిగించేందుకు ఈ నియామక ప్రక్రియ దోహదపడుతుందని ఆయన వివరించారు.
స్థానికులకే పెద్ద పీట కొత్త ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఉపాధి అవకాశాల్లో అధిక శా తం స్థానికులకే దక్కేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నిర్దిష్ట శాతంలో ఉద్యోగాలు స్థానిక యువతకు ఇవ్వాలన్న షరతు ఎంఓయులోనే విధిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. స్థానిక యువతలో తమకు ఉపయోగపడే నైపుణ్యాలు కొరవడ్డాయని, అందుకే తాము వెలుపలి నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటున్నామని ఆయా పారిశ్రామిక వర్గాలు చెబుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు రాజీవ్ యువ కిరణాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే యువతలో నైపుణ్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చొరవ చేపడుతున్నదని ఆయన వెల్లడించారు.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నిపుణులైన యువ త పారిశ్రామిక రంగానికి సిద్ధంగా అందుబాటులో ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. పారిశ్రామిక కారిడార్ స్థలం ఎంపికకు కృషి రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ పారిశ్రామిక కారిడార్‌కు అనుకూలమైన స్థలాలను గుర్తించి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలియచేస్తుందని, దానిపై తుది నిర్ణయం కేంద్రానిదేనని ఆయన చెప్పారు. ఎంత ఎక్కువ భూమి కేటాయిస్తే అంత భారీ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కావడానికి అవకాశం ఉం టుందని కేంద్రం తమకు తెలిపిందని ఆయన చెప్పారు. ఆ కారిడార్ కోసం 25 వేల హెక్టార్ల భూమి అవసరమని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. భూమితో పాటు నీరు, విద్యుత్, కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కూడా అవసరమవుతాయంటూ ఈ లక్షణాలన్నీ గల భూములు ఎక్కడ ఉండేది గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన పేర్కొన్నారు.

0 comments:
Post a Comment