గుజరాత్‌లోని పఠాన్ వద్ద ఏర్పాటు చేసిన 25 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిని ప్రారంభించినట్లు జిఎంఆర్ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ జి ఎంఆర్ ఎనర్జీ వెల్లడించింది. పఠాన్ ప్లాంట్ ప్రారంభంతో జిఎంఆర్ గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగంలోకి అడుగుపెట్టినట్లయిందని కంపెనీ తెలిపింది. జిఎంఆర్ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన జిఎంఆర్ గుజరాత్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ 25 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్వహణను చేపట్టనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుజరాత్ సౌర విద్యుత్ విధానం కింద 2010లో జిఎంఆర్‌కు ఈ ప్రాజెక్టును కేటాయించగా ఇక్కడ ఉత్పత్తి కానున్న విద్యుత్‌ను 25 ఏళ్లపాటు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు సరఫరా చేయటానికి పిపిఎ ఒప్పందాలను జిఎంఆర్ కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో పునరుత్పాదక ఇంధన విభాగంలో మొత్తం 100 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టాలని జిఎంఆర్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది.
0 comments:
Post a Comment