అలిపిరి వద్ద ఏర్పాటయ్యే మైథలాజికల్ థీమ్ పార్క్‌తో తిరుపతి నగర శోభ మరింత ఇనుమడి ంచనుంది. అలిపిరి వద్ద రూ. 300 కోట్ల భారీ పెట్టుబడితో 'టెంపుల్స్ ఆఫ్ ఇండియా అండ్ మైథలాజికల్ థీమ్ పార్క్' ఏర్పాటు చేసేందుకు శ్రీవైష్ణవి ఇన్‌ఫ్రా వెంచర్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ సంస్థకు-రాష్ట్రపర్యాటక శాఖకు మధ్య కుదిరిన ఒప్పందపత్రాలపై శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, వైష్ణవి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎఎస్ రావు సంతకాలు చేశారు.
ఇందుకోసం అలిపిరి వద్ద ప్రభుత్వం వైష్ణవి సంస్థకు 38 ఎకరాల భూమిని కేటాయించనుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, త్రీస్టార్‌హోటల్, యాంఫీ థియేటర్, షాపింగ్‌మాల్, సాంస్కృతిక కేంద్రం, చిల్డ్రన్స్‌పార్క్, రెండు-మూడు రెస్టారెంట్లు ఏర్పాటు కానున్నాయి. థీమ్‌పార్క్‌లో దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలైన పూరీ, అన్నవరం, సింహాచలం, అహోబిలం, గురువాయూర్ తదితర ఆలయాల నమూనాలను ఏర్పాటు చేస్తారు.

0 comments:
Post a Comment