తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో గ్రామస్థుల సహకారంతో ఊరంత భోగి పిడకల దండను తయారుచేశారు. రెండుకిలోమీటర్ల భోగి పిడకల దండ జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో రికార్డులు కొట్టనున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆ దండను కొలిచి ధ్రువీకరణ పత్రం అందించేందుకు అమలాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎంఎస్‌సీ భాస్కరరావు శుక్రవారం ప్రయత్నించారు.
అయితే అంత దండను అంతా ప ట్టుకుని ఉండగానే కొలవడం సాధ్యమవుతుందని ఆయన వెనుదిరిగారు. భోగి పండుగ రోజున గ్రామస్థులంతా కలిసి భోగిపిడకల దండను ఊరేగించే సమయంలో అ«ధికారులు కొలతలు వేసేందుకు స్థానికులు రంగం సిద్ధం చేశారు. సమనస గ్రామానికి చెందిన మామిళ్లపల్లి దొరబాబు, ప్రసన్న దంపతులు, పులిమే సురేష్ గ్రామస్థుల సహకారంతో స్వచ్ఛమైన ఆవుపేడతో పిడకల దండను తయారుచేసిన విషయం పాఠకులకు విదితమే. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సమనస గ్రామ నడిబొడ్డున అతిపెద్ద భోగి మం టను వేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు నాలుగు టన్నుల కలపను సిద్ధంచేశారు.
500 మంది వరకు పిల్లాపాపలతో కలిసి గ్రామస్థులు ఈ దండను మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా భోగిమంట వద్దకు తీసుకెళ్తారు. గ్రామంలోని ముత్తైదువులంతా పిల్లాపాపలతో వచ్చి డూడూ బసవన్నలు, జం గమ దేవరులు, కొమ్మదాసర్ల ఆశీర్వచనాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

0 comments:
Post a Comment