రానున్న కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్ని దూసుకుపోతాయని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ గురు మార్క్ మోబియస్ అంటున్నారు. దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్ధిక వ్యవస్థలపై పాజిటివ్ ఔట్‌లుక్‌ను కొనసాగించనున్నట్లు ఆయ న తన బ్లాగులో పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్న ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మోబియస్ వ్యవహరిస్తున్నారు. ఎమర్జింగ్ దేశాల స్టాక్ మార్కెట్ల ప్రస్తుత స్థాయిలను గమనిస్తే ఇవి ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.
దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్ల పూర్తి విలువ యుఎస్, జపాన్, యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లను మించే అవకాశం ఉందని మోబియస్ వివరించారు. గ్లోబల్ మార్కెట్లతో పాటు ఎమర్జింగ్ మార్కెట్లకు 2011 గడ్డు సంవత్సరంగా ఉన్నదని, డిసెంబర్ ముగిసే నాటికి ఈ దేశాల ఇండెక్స్ రెండంకెల మేర నష్టాలను మూటగట్టుకున్నాయని ఎంఎస్‌సిఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది. రాజకీయ అనిశ్చితి కారణంగా ఈజిప్ట్ మార్కెట్లు రికార్డు స్థాయిలో నష్టపోగా ప్రాంతీయ అంశాల కారణంగా యూరోపియన్ మార్కెట్లైన టర్కీ, హంగరీ, పోలాండ్‌లు కూడా దెబ్బతిన్నాయని మోబియస్ తెలిపారు. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటానికి రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యపరమైన చర్యలు చేపట్టటంతో భారత్‌పై కూడా ప్రభావం పడిందని అన్నారు.
భారత్,చైనాలపై ఇన్వెస్టర్ల దృష్టి 2011లో భారత్, చైనాలు అత్యంత పటిష్ఠవంతమైన దేశాలుగా ఉండటంతో ఇన్వెస్టర్లందరి దృష్టి ఈ రెండు దేశాలపై పడిందని మోబియస్ పేర్కొన్నారు. మరోవైపు కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు, జిడిపి రేషియో, విదేశీ రిజర్వులు గణనీయ స్థాయిల్లో ఉన్నప్పటికి సార్వభౌమ రుణ స్థాయిలు భయపెడుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింతగా బలపడి ఆయా దేశాల మార్కెట్లలోని కంపెనీలపై ప్రభావం పడవచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా గరిష్ఠ స్థాయిల్లో ఉన్న ద్రవ్యోల్బణం, మార్కెట్ ఒడిదుడుకులు ఎమర్జింగ్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేద న్నారు.

0 comments:
Post a Comment