మధుమేహం కోసం తీసుకునే ఓ చవకైన మందును దీర్ఘకా లం వాడే రోగుల్లో కేన్సర్ ముప్పు త క్కువగా ఉంటుందని దక్షిణకొరియా పరిశోధకులు గుర్తించారు. టైప్-2 మధుమేహ నియంత్రణ కోసం 'మెట్‌ఫార్మిన్'ను ఉపయోగించే వా రికి కేన్సర్ వచ్చే అవకాశం తక్కువని ఇక్కడి సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన అధ్యయన బృందం తేల్చింది.
సాధారణంగా మధుమేహ రోగుల్లో రొమ్ము, కాలేయం, క్లోమ గ్రంధి కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, మెట్‌ఫార్మిన్‌ను ఉపయోగించడం వల్ల వారిలో ఈ ముప్పు తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఈ మందు అడ్డుకుంటోందని వివరించారు. తమ విస్తృత సర్వే ఫలితాలు, ప్రయోగ శాలలో కేన్సర్ కణాలపై చేసిన పరిశోధన దీన్నే «ద్రువీకరిస్తున్నదన్నారు.

0 comments:
Post a Comment