ప్రముఖ కెమెరామెన్ సంతోష్ శివన్ తెర ముందుకు వస్తున్నాడు. 'మకరమంజు' అనే మలయాళ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో రవివర్మగా సంతోష్ శివన్ నటించాడు. కథానాయికలుగా కార్తీక, నిత్యా మీనన్ నటించారు. ఈ చిత్రాన్ని 'రవివర్మ' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్ర కథను విన్న సంతోష్ ఎంతో ఎగ్జిట్ అయి, రవివర్మ పాత్ర తానే పోషిస్తానంటూ ముందుకొచ్చాదట.
ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్న యస్.వి.ఆర్. మీడియా సంస్థ అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ, 'రవివర్మ ఏ పెయింటింగ్ వేయాలన్నా ముందుగా ఓ కాన్సెప్ట్ అనుకుని, ఆయా క్యారెక్టర్లను మోడల్ రూపంలో ముందుంచుకుని పెయింటింగ్ వేసేవాడు. అలాగే ఒకసారి రాజా పురురావసు, ఊర్వశి ప్రేమకథను చిత్రీకరించాలనుకుంటాడు. అందుకు మోడల్ గా వచ్చిన కార్తీకను ఊర్వశిగా, తనను పునరావసుగా ఊహించుకుని ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. తదనంతర కథ ఆసక్తికరంగా సాగుతుంది' అని చెప్పారు. లెనిన్ రాజేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మధు అంబట్ చాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు.

0 comments:
Post a Comment