Friday

కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్ణ


తాజాగా 'నిప్పు' చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి, త్వరలో కృష్ణవంశీ దర్శకత్వంలో మరో భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయట. ఇందులో బాలకృష్ణ పాత్ర వైవిద్యంతో కూడి ఉంటుందనీ, సామాజిక బాధ్యత కలిగివుంటుందనీ అంటున్నారు. దీని కోసం 'సి.ఎం' అనే టైటిల్ పరిశీలనలో వుందట. మామూలుగా ముఖ్యమంత్రిని సి.ఎం. (చీఫ్ మినిస్టర్)  అంటారు. అయితే, ఇక్కడ సి.ఎం. అంటే 'కామన్ మ్యాన్' అని అర్ధమట. దీనిని బట్టే ఇది సామాన్యుడి కథతో రూపొందే చిత్రమని మనకు అర్ధమవుతుంది. పైగా, బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈ టైటిల్ సినిమాకి మంచి మైలేజీ తెస్తుందని భావిస్తున్నారు. యన్టీఆర్ పుట్టిన రోజైన మే 28 న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

0 comments:

Post a Comment