Showing posts with label Great people.... Show all posts
Showing posts with label Great people.... Show all posts

Monday

మూడు ఫస్టుల మహిళ...

మూడు ఫస్టుల మహిళ...

జుడిషియల్ అకాడమి మొదటి మహిళా డైరెక్టర్. మొదటి మహిళా రిజిస్ట్రార్ (విజిలెన్స్). ఇప్పుడు మొదటి మహిళా రిజిస్ట్రార్ జనరల్... ముగ్గురూ ఒక్కరే. ఆ ఒక్కరే పెనుమల్లి మస్తానమ్మ. మన రాష్ట్ర హైకోర్టుకి మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులైన సందర్భంగా 'నవ్య' కలిసినప్పుడు ఆవిడ తన కెరీర్ గురించి, కుటుంబం గురించి చెప్పిన వివరాలివి...

"రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టానని తెలియగానే ప్రశంసలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. వాస్తవానికి ఈ పనికి మగా ఆడా భేదం లేదు. ఎవరైనా నిర్వర్తించాల్సిన విధులు ఒకటే. కాకపోతే హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించబడిన మొదటి మహిళని కావడం వల్లే ఈ హడావిడంతా. ఒకరకంగా చూస్తే మా తరానికి ఇది గొప్ప విషయమే. కాని ఇప్పుడు జుడిషియల్ విభాగంలోకి కూడా మహిళలు మగవాళ్లతో సమానంగా వస్తున్నారు. ముందు ముందు ఇటువంటి పొజిషన్లలో ఆడవాళ్లూ వస్తారు. అప్పుడు ఇది అంత పెద్ద వార్త అవ్వకపోవచ్చు (నవ్వుతూ).

మొదట్నించీ చదువంటే ఇష్టం
నెల్లూరు జిల్లాలోని చౌకచర్ల మా స్వగ్రామం. మాది రైతుకుటుంబం. ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా బాగా చదివిస్తున్నారు కాని మేము చదువుకునే రోజుల్లో గ్రామాల్లో అమ్మాయిలను బడికి పంపేవారు కాదు. ఒకవేళ చదివించినా ఐదో తరగతి వరకే. ఆ తరువాత ఇంట్లోనే... పెళ్లీడు వచ్చిన తరువాత పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేవారు. చదువు పట్ల నాకున్నఆసక్తి, పట్టుదలకు అమ్మానాన్నల ప్రోత్సాహం కలవడంతో సైన్సు డిగ్రీ పట్టా అందుకోగలిగాను.

డిగ్రీ అయిన వెంటనే సుబ్బరామిరెడ్డి గారితో వివాహమయ్యింది. మా పెళ్లప్పుడు ఆయన లా ప్రాక్టీసు చేసేవారు. పాప పుట్టిన ఏడాదికి నా భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో నెల్లూరులోని లా కళాశాలలో చేరాను. 1977లో లా చదువు పూర్తయ్యింది. బాల్యంలో ఎలాగైతే చదువంటే ఇష్టం ఉండేదో... అలాగే కాస్త పెద్దయ్యాక ఏదైనా చేయాలనే తపన ఉండేది. దానికి తగ్గట్టుగా పుట్టింటితో పాటు అత్తింటి సహకారం కూడా లభించడంతో దిగ్విజయంగా చదువుకోగలిగాను. కెరీర్‌లో నిలదొక్కు కోగలిగాను. పుట్టింటి వైపు చూసుకుంటే నేనొక్క దాన్నే ఉన్నత చదువులు చదివినదాన్ని అప్పట్లో. అత్తింట్లో మాత్రం అందరూ బాగానే చదువుకున్నారు.

లా చదువు పూర్తయిన తరువాత ప్రాక్టీసు మొదలుపెట్టాలి. అప్పుడేమో మావారు ఏలూరులో మెజిస్ట్రేట్‌గా ఉన్నారు. నేను అక్కడ ప్రాక్టీసు చేయలేను. దాంతో నా ప్రాక్టీసు కోసమే ఆయన తనని హైదరాబాద్‌కి బదిలీ చేయమని కోరారు. ఆ విధంగా 1982లో ప్రాక్టీసు మొదలుపెట్టాను. అప్పటికి నా వయస్సు 33 ఏళ్లు. మా అప్పుడు మెజిస్ట్రేట్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాయాలంటే మూడేళ్లు లా ప్రాక్టీసు చేయాల్సిందే. అప్పుడే పరీక్షకు అర్హత ఉండేది. అందుకని 82 నుంచి 85 వరకు ప్రాక్టీసు చేశాను.

85లో సర్వీసు కమిషన్ ద్వారా ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఎంపికయ్యాను. ఆ తరువాత 1991లో సీనియర్‌సివిల్ జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. 1997లో జిల్లా జడ్జిగా విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్, కరీంనగర్‌లలో విధులు నిర్వర్తించాను. ఆ తరువాత వరసగా హైదరాబాద్‌లో చీఫ్ జడ్జి సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, డైరెక్టర్ జుడిషియల్ అకాడమి పదవులు చేపట్టాను. తరువాత ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాను.

వేగం.. నేర్పు ఒక మార్గం....
జడ్జిగా విధులు నిర్వర్తించాలంటే నిత్యవిద్యార్థిలా రోజూ చదువుకుంటూ ఉండాల్సిందే. మా ఇంట్లో ఎలా ఉండేదంటే పిల్లలోపక్క, నేనోపక్క కూర్చుని చదువుకుంటుండే వాళ్లం. జడ్జిగా వ్యవహరించేప్పుడు ప్రతీ అంశాన్ని ఎంతో సునిశితంగా గమనించాల్సి ఉంటుంది. కేసులని స్టడీ చేసి పాయింట్స్ రాసుకుని తెల్లవారి ఉదయమే ఎనిమిది గంటలకు స్టెనోకి డిక్టేట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఆఫీసు సమయం అయిపోగానే ఫైళ్లు మూసేసి ఇంటి పనులు చేసుకోవడం ఈ పనిలో సాధ్యం కాదు.

అలాగని వృత్తి కోసం కుటుంబ జీవితాన్ని, కుటుంబ జీవితం కోసం వృత్తి ధర్మాన్ని నిర్లక్ష్యం చేయలేదు నేను. రెండింటి కీ సమస్థానం ఇచ్చాను. ఇందుకు నిదర్శనం నా కుటుంబమే. నా పిల్లలు బాగా స్థిరపడ్డారు. సుమ, మనుక్రాంత్, మాధురీష్‌లు మా పిల్లలు. పెద్దపాప, బాబు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇద్దరూ స్టేట్స్‌లో ఉన్నారు. చిన్న పాప ఎంబిఎ చేసింది. బెంగళూరులో ఉంటుంది. నేను, మా ఆయన ఒకే రంగంలో ఉండడం, జిల్లా జడ్జిగా పనిచేసిన ఆయన అనుభవం నాకెంతోగానో ఉపయోగపడుతున్నాయి.

వృత్తిని, కుటుంబాన్ని బాలెన్స్ చేయాలంటే పనిపట్ల అంకితభావంతో పాటు పనిలో వేగం ఉండాలి. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ చేయగా చేయగా ఆ వేగం, నేర్పు అలవడతాయి. దాంతో కుటుంబం, వృత్తి ధర్మాలను సమంగా నిర్వర్తించే సామర్థ్యం దానంతటదే ప్రతీ మహిళకీ అలవడుతుంది.

అది అపోహ
మగవాళ్లే సమర్థవంతంగా పనులు చేయగలరనే అపోహ ఉంది సమాజంలో. బహుశా ఆడవాళ్లకి ఉన్నన్ని బాధ్యతలు వాళ్లకి ఉండకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆడవాళ్లు మాత్రమే చూసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవి చక్కబెట్టుకుంటూ తామనుకున్న లక్ష్యాలను చేరుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఇందుకు ఆడవాళ్లు స్మార్ట్‌గా వర్క్ చేయడంతో పాటు కాస్త కుటుంబ సహకారం కూడా కావాలి. అప్పుడు ఏ రంగంలోనైనా మగవాళ్లతో పోటీపడటమే కాకుండా అనుకున్న లక్ష్యాలను అలవోకగా అందుకోగలు గుతారు.

అసంతృప్తి ఎరుగను
భర్త, పిల్లలు అందించే ప్రేమ, ప్రోత్సాహం మంచి టానిక్‌లా పనిచేస్తాయి. నాకు ఆ టానిక్ పుష్కలంగా లభించింది. ఇది కుటుంబపరంగా లభించిన వరం అయితే, వృత్తిపరంగా ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేయగలగడం ఒక అదృష్టం. ఈ రెండూ కలిసి సంపూర్ణ మహిళ అన్న తృప్తిని మిగిల్చాయి నాకు. జీవితంలో ఏది సాధించాలన్నా ఒక లక్ష్యం ఉండాలి. అయితే ఆ లక్ష్యం ఆకాశానికి నిచ్చెన వేసినట్టు కాకుండా మనలోని సామర్ధ్యానికి తగ్గట్టు ఉండాలి. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకోవాలి. అంతే సిన్సియర్‌గా వాటి సాధనకు కృషి చేయాలి. ఇదే నేను నమ్మే సూత్రం. సానుకూలంగా ఆలోచించి, నాకు ఇచ్చిన పనిని నిబద్ధతతో చేస్తాను. కష్టపడతాను. అదే నన్ను ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది.

ఇప్పుడు నాకు 59 యేళ్లు. మా జనరేషన్‌కి కాబట్టి ఈ స్థాయికి రావడానికి ఇంత సమయం పట్టింది. ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడమే తక్కువ. కాని ఇప్పుడున్న తరం బాగా చదువుతున్నారు. చాలా వేగంగా ఉన్నారు. నా తరువాత ఇంకెందరో మహిళలు ఈ పదవుల్లో చిన్న వయసులోనే చేరే అవకాశం ఉంది. అటువంటి వాళ్లందరికీ నేను చెప్పేదొక్కటే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ అనేది చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు విషయాల పట్ల సునిశిత మైన అవగాహన కలుగుతుంది. దాంతో పరిస్థితులని బట్టి మసలుకునే నేర్పు వస్తుంది. ఇది అన్ని రకాలుగా పైకెదగడంలో ఉపయోగపడుతుంది.''
Read more >>

అంగ్ సాన్ సూకీకి డాక్టరేట్

అంగ్ సాన్ సూకీకి డాక్టరేట్



రెండు ద శాబ్దాలుగా మయన్మార్‌లో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చే సిన యోధురాలు అంగ్ సాన్ సూకీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ఢి ల్లీలోని జామియా మిలియా ఇస్లామి యా యూనివర్సిటీ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉప కులపతి నజీబ్ జంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసి సూకీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
Read more >>

ఆగిన కెమెరా కన్ను తొలి మహిళా ఫొటోగ్రాఫర్ వ్యారావాలా కన్నుమూత ( Homai Vyarawalla )

ఆగిన కెమెరా కన్ను తొలి మహిళా ఫొటోగ్రాఫర్ వ్యారావాలా కన్నుమూత ( Homai Vyarawalla )

ఈ ఫోటోలో ఉన్న హోమి వ్యారావాలా భారతీయ తొలి మహిళా ప్రెస్ ఫోటోగ్రాఫర్. అంతా మగ వాళ్లే కనిపించే ప్రెస్ ఫోటోగ్రఫీ రంగంలోకి 1930ల్లోనే అడుగుపెట్టి 40 ఏళ్ల పాటు దేశ రాజకీయ పరిణామాలను అత్యంత ప్రతిభావంతంగా రికార్డు చేశారు. గత ఏడాది పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఆమె మొన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 98 ఏళ్లు.

ఫోటోగ్రఫీ విడిచి పెట్టిన తరువాత ఆమె ఒక్క ఫోటో కూడా తీయలేదు. ' కెరీర్ బాగున్న దశలో మీరు ఎందుకు ఫోటోగ్రఫీని వదిలేశార'ని అడిగితే... 'మా ఫొటోగ్రాఫర్లకు కొన్ని నియమాలు ఉండేవి. డ్రస్ కోడ్ కూడా ఉండేది. ఒకరిని ఒకరం ఎంతో గౌరవించుకునేవాళ్లం. వేరు వేరు పత్రికలకు పనిచేసినప్పటికీ అందరం సహోద్యోగులుగానే ఉండే వాళ్లం. కాని తరువాత తరువాత పరిస్థితులు చెత్తగా తయారయ్యాయి.

కొత్త తరం ఫోటోగ్రాఫర్లు త్వరగా సంపాదించాలనే తాపత్రయంలో ఉండేవాళ్లు. ఆ గుంపులో నేను ఒకదాన్ని కాదల్చుకోలేదు. అందుకే వదిలేశాను'' అని సమాధానం చెప్పారు. హోమి పుట్టిన సంవత్సరం 1913, పదమూడేళ్లకే వివాహం అయ్యింది. మొదటి కారు నంబర్ ప్లేట్ 'డిఎల్‌డి13'. ఇవన్నీ కలిసి వచ్చేలా 'డాల్డా13' అనే పేరుతో ఫోటోలు ప్రచురించుకునేవారామె.

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై నిలబడి స్వాతంత్య్ర ప్రకటన చేస్తున్న చారిత్రక దృశ్యాన్ని కెమెరాలో బంధించిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్ హోమై వ్యారావాలా తనువు చాలించారు. 98 ఏళ్ల వ్యారావాలా ఆదివారం ఉదయం వడోదరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. మూడు రోజుల కిందట మంచం మీద నుంచి కిందపడటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. 1913 డిసెంబర్ తొమ్మిదో తేదీన పార్శీ కుటుంబంలో ఆమె జన్మించారు. 1942లో ఢిల్లీ చేరుకున్న ఆమె ఫొటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు, భారతదేశ చరిత్రను తిరగరాసిన ఎన్నో అపూర్వ స్వాతంత్య్ర సమర ఘట్టాలను తన కెమెరాతో బంధించారు. 

తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌గానే కాక, స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘటనలను నమోదు చేసిన అరుదైన మహిళగా గుర్తించడంతోపాటు వ్యారావాలాను పద్మ విభూషణ్ బిరుదుతో కేంద్రం సత్కరించింది. ఆమె తీసిన ఛాయాచిత్రాలను "ఇండియా ఇన్ ఫోకస్, కెమెరా క్రానికల్స్ ఆఫ్ హోమై వ్యారావాలా'' పేరిట సబీనా అనే ఔత్సాహికురా లు పుస్తకంగా తీసుకొచ్చారు. చాలాకాలం తెర మరుగున ఉన్న వ్యారావాలా పేరు 2006లో నానో కార్ల రాకతో మరోసారి వెలుగులోకొచ్చింది. టాటా తొలి నానోను ఆమెకే విక్రయించింది.










Read more >>

Friday

Top 10 Life Changing Books...

Top 10 Life Changing Books...

As we go along our life’s journey we face many challenges which eventually help us become more mature and deepen our self-realization. In life, we never stop learning and we never stop growing, so there is really no destination but it’s purely the journey that counts.
Life changing self help books can be a great source of inspiration and guidance in your life’s journey, they help your get new insights, widen your perspective and get you to look at areas that you have never considered before.

In this article I will enlist the top 10 life changing books. Many good self-help books are there, so this is not an end-all list. So here’s list of some of 10 life changing books, that gave us deep insights on self-realization, making our life more productive and abundant.

1.) Ask and It’s Given (Abraham Hicks)

This self help book is a life changer. It talks about law of attraction in a completely new perspective. It points you towards understanding your true nature, and your true power as a creator. If you really get the message in this book, you can shift into a life of ease and comfort by leveraging the power your thoughts and emotions. Your world will not be the same again, when you know the truth of your reality that’s vocalized in this book. In fact, I believe that if you get the message in this book, you don’t need to read any other self help book, period.

2.) The Power Of Now (Eckhart Tolle)
This life changing book by Eckhart Tolle is highly transformative and powerful. It will cause a huge shift in your consciousness, making you aware of your true self. Though it has the tone of a “spiritual book”, in actuality it contains a very practical and powerful teaching. It helps you become aware of your power in the present moment.

3.) Think and Grow Rich (Napolean Hill)

If you read Ask and it’s Given, and you get the message, then it’s not really necessary for you to read this book. However, it’s a highly powerful book for people who are new to understanding the power of thought and its creative potential.

4.) How to Stop Worrying and Start Living (Dale Carnegie)

This book makes for a refreshing read and it has a powerful positive tone to it. It talks about how the habit of worrying can be poisonous to our life, and how we can change this habit to become more hopeful and positive minded.

5.) Awaken the Giant Within (Anthony Robbins)

If you are go-getter, and you are looking to make your life more powerful by changing your current belief systems, then this is the book for you. It draws heavily on techniques of NLP, but it also goes beyond it. Anthony Robbins is a highly acclaimed motivational speaker and author known for his power to instigate dynamic changes quickly.

6.) Fit for Life (Harvey Diamond)

This book gave me a whole new perspective on eating right. This book is not about raw food diets, or veganism, but more about how to eat in a manner that helps your body stay healthy and fit. Some of the insights I gained from this book have really changed my life for the better.

7.) The Now Habit (Neil Fiore)


This is the right book for people who want to get organized in their work life in specific, though it’s not limited to your professional life. Neil gives many tips and insights on how to get more done in less time, and how to keep your life smooth and efficient.

8.) Rich Dad Poor Dad (Robert Kiyosaki)

This life changing book makes for an excellent reading and helps you get a perspective on how limiting beliefs can keep you from getting rich and affluent. If you have limiting beliefs about how to make money, then this is the book to read.

9.) The 7 Habits of Highly Effective People (Stephen Covey)

This was among the first few life altering self help books that I read during my undergrad years, and I found it really inspiring. A good book for professionals and students alike, it gives you a strong message on how to improve your productivity.

10.) The Power of Positive Thinking (Norman Vincent Peale)

This life transforming book should be your starting point if you are new to understanding the power of thought and how it shapes your life. It’s amazing how we create our own reality through our thoughts and how we can harness this power to consciously create the reality we want for ourselves

Read more >>

Tuesday

Swami Vivekananda Rare pics

Swami Vivekananda Rare pics
Swami Vivekananda, the great soul of humanity was born at 6:33, a few minutes before sunrise, on Monday, January 12,1863. It was the day of the great Hindu festival Makarasamkranti, (Makara Sankranti) when special worship is offered to the Ganga by millions of devotees.
Vivekananda House in South Pasadena
Swami Vivekananda stayed in this house for six weeks in 1900.
On the left is the Vivekananda House as it is today. On the right is
Swami Vivekananda standing in front of the house in 1900.


During his stay in Pasadena, Swami Vivekananda would picnic
in the hills behind the Vivekananda House

Swami Vivekananda (seated with turban) and actor Joseph Jefferson (standing with hat) pose with other guests at Green Acre, circa 1894. The programs at the Green Acre School included speakers from all over the world. The intent was to create dialog on religion, philosophy, the nature of the soul and world peace.



"Arise! Awake! And Stop Not; Till The Goal Is Reached!"
Read more >>