ప్రపంచ పోలీసు అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన ఉదంతమిది... ఓ ప్రయోగంలో భాగంగా టెక్సాస్ విశ్వవిద్యాలయ స్టేడియంలో ఎర్రటి బుల్లి మానవ రహిత (డ్రోన్) విమానం గాల్లోకి ఎగిరింది. ఇది ఎంత ఎత్తుకు వెళ్లాలో, ఏ వైపు మళ్లాలో అందులోని కంప్యూటర్‌కు స్పష్టమైన ముందస్తు ఆదేశాలిచ్చారు. కానీ, కాసేపటికే యజమాని మాట వినని పెంకి గుర్రంలా అది మరోవైపు తిరిగింది. దాన్ని నియంత్రిస్తున్న నిపుణులు ఎంత ప్రయత్నించినా స్వాధీనంలోకి రాలేదు. చివరకు 'స్వీయ విధ్వంసం' (సెల్ఫ్ డిస్ట్రక్షన్) ఆదేశం వచ్చిందన్నట్లు ఒక్కసారిగా నేలమీదకు తలకిందులుగా దూసుకొచ్చింది.
నివ్వెరపోయిన నిపుణులు చచ్చీచెడీ చివరి నిమిషంలో ప్రమాదం తప్పించగలిగారు. ఎందుకిలా జరిగిందని విశ్లేషిస్తే... దీన్ని గాల్లోనే హైజాక్ చేస్తామంటూ వెయ్యి డాలర్లకు పందెం కాసిన వర్సిటీ పరిశోధక విద్యార్థులు ఈ ఘనకార్యానికి పాల్పడ్డారని తేలడంతో అవాక్కయ్యారు. ఇందుకోసం 'స్పూఫింగ్' (నకిలీని అసలుగా భ్రమింపజేయడం) పరిజ్ఞానం ఆధారంగా కంప్యూటర్ పోగ్రామ్‌ను రూపొందించడం విశేషం. ఆస్టిన్ రేడియో నావిగేషన్ లేబొరేటరీ ప్రొఫెసర్ టాడ్ హంఫ్రీస్ ఈ బృందానికి నాయకత్వం వహించారని తెలియడంతో అంతర్గత భద్రత అధికారులకు దిమ్మతిరిగింది.

0 comments:
Post a Comment