మయన్మార్ ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ మయన్మార్‌ను 'బర్మా' అని సంబోధించడం మానాలని మయన్మార్ అధికారులు ఆదేశించారు. ఇటీవలి థాయ్‌ల్యాండ్, యూరప్ పర్యటనల్లో సూకీ తన స్వదేశాన్ని 'బర్మా'గా సంబోధించారు. అయితే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందంటూ ఎన్నికల సంఘం సూకీని హెచ్చరించింది.
రెండు దశాబ్దాల క్రితం మయన్మార్ ప్రభుత్వం 'బర్మా' అన్న పేరులో వలసవాద ఛాయలు ఉన్నాయంటూ దానిని మయన్మార్‌గా మార్చింది. అయితే సూకీ.. ఆమె పార్టీ, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఈ పేరు మార్పిడిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ దేశాల అధినేతలకు సైతం మయన్మార్‌ను ఎలా పిలవాలో అర్థం కావడం లేదు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాలు ఇటీవలి తమ ప్రసంగాలలో ఆ దేశాన్ని 'బర్మా'గానే పేర్కొన్నారు.

0 comments:
Post a Comment