Friday

అమితాబ్ పాట... విద్యా అభినయం...!


బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత మళ్లీ ఓ సినిమాలో పూర్తి పాట పాడుతున్నాడు. విద్యాబాలన్ కథానాయికగా నటిస్తున్న 'కహానీ' సినిమా కోసం ఆయన ఈ పాట పాడుతున్నారు. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ఏడు నెలల గర్భవతిగా నటిస్తోంది. తప్పిపోయిన తన భర్తను వెతుక్కుంటూ ఆమె కోల్ కతా వీధుల్లో తిరిగే సందర్భంలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా ఈ పాట వస్తుంది. ప్రముఖ కవి రబీంద్రనాథ్ టాగూర్ రాసిన 'ఏక్లా చోలే రే...' కవితలతో కూడిన ఈ పాటను అమితాబ్ ఆర్ద్రత నిండిన స్వరంతో పాడారట. ఈ పాట, పాట చిత్రీకరణ, అందులో విద్యా అభినయం... సినిమాకు హైలైట్ అవుతాయంటున్నారు. మార్చ్ మొదటి వారంలో ఈ 'కహానీ' సినిమా విడుదలవుతుంది.

0 comments:

Post a Comment