Monday

డెడ్‌లైన్ పూర్తి అయినా అసాంజ్ లొంగిపోరు


వికీలీక్స్ వ్యవస్థాపకులు జూలియన్ అసాంజ్ బ్రిటిష్ పోలీసులకు లొంగిపోవాల్సిన డెడ్‌లైన్ పూర్తయింది. స్వీడన్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజ్‌ను విచారణ నిమిత్తం స్వీడన్‌కు తరలించాలని బ్రిటిష్ సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఆయన 7వ తేదీలోపు లండ న్ పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో తల దాచుకుంటున్న అసాంజ్.. విచారణ పేరుతో తనను స్వీడన్‌కు తరలించి, అక్కడ్నించి అమెరికా తరలిస్తారని భయపడుతున్నారు.

అమెరికాకు చెందిన రహస్య కేబుల్స్‌ను వెల్లడించినందుకు పర్యవసానంగా తనపై కక్ష తీర్చుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఈక్వెడార్ ప్రభుత్వం తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన అప్పీలును మరోసారి విచారించాలన్న అసాంజ్ కోరికను బ్రిటన్ సుప్రీంకోర్టు గత నెల 14న కొట్టివేసిన సంగతి తెలిసిందే. అసాంజ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన నిధిని నిర్వహిస్తున్న సుసాన్ బెన్.. అసాంజ్ బ్రిటిష్ పోలీసులకు లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అసాంజ్ విచారణ నిమిత్తం అమెరికా ఇప్పటికే ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.

0 comments:

Post a Comment