భారతీయ హజ్ కమిటీ హజ్ యాత్రికులకు ఉచిత సిమ్ కార్డులను అందజేస్తోంది. సౌదీ టెలికాం కంపెనీ ఈ సిమ్ కార్డులను అందిస్తోందని భారతీయ హజ్ కమిటీ వైస్ ఛైర్మన్ అబూబకర్ తెలిపారు. సౌదీ అరేబియా ప్రభుత్వ సహకారంతో పంపిణీ చేస్తున్న ఈ సిమ్ కార్డులలో.. భారతీయ హజ్ కమిటీ సభ్యుల నంబర్లు, మక్కా అధికారుల నంబర్లే కాకుండా యాత్రికుల సౌకర్యార్థం అన్ని అత్యవసర సేవలు, ఆసుపత్రుల నంబర్లూ ఉంటాయని ఆయన ప్రకటించారు.
అయితే ఈ సిమ్ కార్డులను కేవలం ప్రభుత్వం ద్వారా మక్కా యాత్రకు వెళుతున్న వారికి మాత్రమే అందిస్తారు. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వెళ్లే యాత్రికులకు ఈ సౌకర్యం ఉండదని వివరించారు. తమిళనాడులో హజ్ యాత్రకు ఎన్నికైన 3,315 మంది యాత్రికులకు ఈ సిమ్ కార్డులను అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

0 comments:
Post a Comment