మీరు బయటకు వెళుతున్నారా? అయితే ముక్కుకు ఒక మాస్క్ ధరించండి. ఎందుకంటారా? మనదేశంలో గాలి స్వచ్ఛమైనది కాదని, విషపదార్థాలున్నాయని అధ్యయనంలో తేలింది. యేల్ అండ్ కొలంబియా విశ్వవిద్యాలయాలు 132 దేశాల్లో గాలిలో ఉన్న స్వచ్ఛతపై నిర్వహించిన అధ్యయనంలో ఇండియా చివరి వరుసలో నిలిచింది. ఎన్విరాన్‌మెంట్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాకింగ్స్ పేరుతో ప్రతీ రెండేళ్లకొకసారి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. స్విట్జర్లాండ్, నార్వే దేశాలు ర్యాకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.
ఇక్కడి గాలి స్వచ్ఛంగా ఉందని తేలింది. గత రెండేళ్లుగా మన దేశంలో అడవులు, బయోడైవర్సిటీ, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ప్రభుత్వ పనితీరు బాగానే ఉందని కానీ నీటి వనరులు, శుభ్రత ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయని సర్వేలో వెల్లడయింది. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఈ ఇండెక్స్ రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు.

0 comments:
Post a Comment