పైలట్ రహిత యుద్ధ విమానం లక్ష్య-1ని విజయవంతంగా ప్రయోగించారు. ఇక్కడి చాందీపూర్ మధ్యంతర క్షిపణి ప్రయోగశాల నుంచి దీన్ని నిర్వహించారు. అత్యాధునిక డిజిటల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉదయం 11.40 గంటలకు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏడీఈ) ఆధ్వర్యంలో అభివృద్ధి పరిచినట్లు అధికారులు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి లక్ష్య ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారతీయ వైమానిక దళం వినియోగిస్తోంది. కాగా, ఈ నెల 25, 27 తేదీలలో లక్ష్య-11 పీటీఏను కూడా ఇదే కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.

0 comments:
Post a Comment