Tuesday

మరిన్ని హంగులతో ఫైర్‌ఫాక్స్ 10...!


నెట్ బ్రౌజింగ్ టూల్ ఫైర్‌ఫాక్స్ మరో కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఫైర్‌ఫాక్స్ 10 పేరుతో విడుదల చేస్తోన్న ఈ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఫైర్‌ఫాక్స్ 10లో సైలెంట్ అప్‌డేట్ మెకానిజంను పొందుపర్చారు. అంటే మీరు ఫైర్‌ఫాక్స్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్నట్లయితే మీకు తెలియకుండానే న్యూ వెర్షన్ అప్‌డేట్ అయిపోతుంది. ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మరింత వేగంగా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకునేందుకు వీలుగా ఫీచర్స్‌ను పొందుపరిచారు. ఈ వెర్షన్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ ఎక్స్‌టెన్షన్ సపోర్ట్. పాత వెర్షన్‌లో ఉన్నా మరింత డెవలప్ చేసి అందిస్తున్నారు.

అలాగే పాత వెర్షన్‌లో సాఫ్ట్‌వేర్‌లో దొర్లిన తప్పులను ఇందులో సవరించారు. సెక్యూరిటీకి సంబంధించిన లోపాలను తొలగించారు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే వారికి కూడా ఫైర్‌ఫాక్స్10 ఉపయుక్తంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్స్ ఉపయోగించే వారు కూడా దీన్ని ఎంచుకోవచ్చు. పాత వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌చేసే ప్లాన్‌లో భాగంగానే ఈ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఫైర్‌ఫాక్స్ 9 విడుదలయిన సంగతి తెలిసిందే.

0 comments:

Post a Comment