Tuesday

అల్ట్రాబుక్‌ల క్రేజ్...!


మారుతున్న కాలానికనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అల్ట్రాబుక్ కంప్యూటర్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ పీసీల స్థానంలో అల్ట్రాబుక్‌లు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలు అంతర్జాతీయ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో కూడిన అల్ట్రాబుక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. అల్ట్రాబుక్‌ల కథ కమామిషు ఏమిటో తెలుసుకుందాం రండి.
ఈ ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ కన్జూమర్స్ ఎలక్ట్రానిక్ షోలో అల్ట్రాబుక్ కంప్యూటర్ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌గా వినియోగదారులను ఆకట్టుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ స్థానంలో ఈ అల్ట్రాబుక్ కంప్యూటర్లు రాజ్యమేలనున్నాయని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. దీంతో 2012 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ అల్ట్రాబుక్‌గా ప్రకటించారు.

నెట్‌బుక్ పోర్టబులిటీ, ఫుల్‌సైజ్ ల్యాప్‌టాప్ సామర్థ్యం, కంప్యూటింగ్ పనితీరుతో అల్ట్రాబుక్ కంప్యూటర్ అందరికీ చేరువ కానుంది. టాబ్లెట్ పీసీని, ల్యాప్‌టాప్‌లలో ఉన్న సౌకర్యాలను కలిపి సంప్రదాయ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టంతో నోట్ బుక్ సైజులో సమర్థంగా పనిచేసేలా అల్ట్రాబుక్‌ను రూపొందించారు.

ఎన్నెన్నో రకాలు
తక్కువ బరువుతోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్స్‌తో అల్ట్రాబుక్‌లు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటెక్స్‌లో ప్రముఖ కంపెనీ ఇంటెల్ సరికొత్త అల్ట్రాబుక్‌ను తాజాగా విడుదల చేసింది. నోట్‌బుక్ తరహాలో ఉన్న ఇవి భిన్నంగా రూపొందించారు. కనీసం అయిదు గంటల బ్యాటరీ బ్యాకప్, ఇంటెల్ కోర్ ఐ సిరిస్ ప్రాసెసర్, డాటా బేస్‌డ్ ఎస్ఎస్‌డి స్టోరేజ్‌తో 20 మిల్లీమీటర్ల మందంతో 1.4 కిలోల బరువుతో అల్ట్రాబుక్ వచ్చింది.

స్లిమ్‌గా ఉన్న ఇవి ప్రయాణంలో ఉపయోగపడనున్నాయి. ఫాస్ట్ స్టార్ట్అప్‌తో పాటు ఇండిగ్రేటెడ్ యాంటీ థెఫ్ట్, ఐడెంటిటీ ప్రోటెక్షన్ కూడా దీనికి ఉన్నాయి. 13.3 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ 3 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 320 జీబీ రెగ్యులర్ హార్డ్‌డ్రైవ్, ప్రత్యేకంగా ఫ్లాష్ మెమోరీ, ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్ 3, ఫాస్టర్ బూట్, షట్‌డౌన్, ఇన్‌స్టాంట్ రెజ్యూమ్‌తో వచ్చాయి.

సరికొత్త ఫీచర్స్
మార్కెట్‌లో ఈ ఏడాది 20 రకాల కొత్త అల్ట్రాబుక్‌లు విడుదల అయ్యాయి. కంపెనీ ఉత్పత్తిదారు, డిజైన్‌ను బట్టి వివిధ రకాల ఫీచర్స్‌తో ఉన్నాయి. డెల్ కంపెనీ ఎక్స్‌పీఎస్ 13 అల్ట్రాబుక్‌ను కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం గల బాడీ, ఇంటెల్ కోర్ ఐ 5, ఐ7 ప్రాసెసర్‌లు, 100 జీబీల స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చింది. లెనివో ఎంటర్‌ప్రైజ్ క్లాస్ అల్ట్రాబుక్‌ను డెడికేటెడ్ గ్రాఫిక్స్‌తోపాటు 1 టీబీ స్టోరేజ్ సౌకర్యంతో విడుదల చేసింది. లెనీవో అల్ట్రాబుక్ 13.3 ఇంచుల డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి వచ్చింది.

లెనీవో లో 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ, 2 జీబీ ర్యామ్ ఉంది. దీంతోపాటు యాపిల్ , డెల్, హెచ్‌పీ, ఆసుస్, తోషిబా కంపెనీలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో సరికొత్త అల్ట్రాబుక్‌లను విడుదల చేశాయి. ఆసుస్ అల్ట్రాబుక్‌లు 11.6 ఇంచుల డిస్‌ప్లేలో కూడా లభ్యమవుతున్నాయి. హెచ్‌పీకంపెనీ 14 ఇంచులు, 13.3 ఇంచుల ఛాసిస్‌తో 9 గంటల బ్యాటరీ లైఫ్‌తో అల్ట్రాబుక్‌ను విడుదల చేశాయి. సామ్్‌సంగ్ సిరీస్ 5, సిరీస్ 9 పేరిట 13, 14, 15 ఇంచులతో బుక్‌ను వెలువరించింది.

యాసర్స్ కూడా ఎస్ 5 పేరిట బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. 75 కొత్త అల్ట్రాబుక్‌లను డిజైన్ చేసి ఈ ఏడాది మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ఇంటెల్ ప్రకటించింది. ట్లాన్స్‌పరెంట్ గ్లాస్‌తో సరికొత్త సౌకర్యాలతో ఇవి రానున్నాయి. విండో 8తో పాటు టచ్‌స్క్రీన్‌తో కూడిన లెనివో యోగా అల్ట్రాబుక్ 13.3 ఇంచులతోనూ రానున్నాయి.

వేగం... సౌలభ్యం
అల్ట్రాబుక్ వేగంగా, సులభంగా పనిచేసేలా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ మదర్‌బోర్డుతో పాటు స్లీక్ సైజులో ఉన్నందువల్ల ప్రయాణాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

కేవలం రెండు సెంటీమీటర్ల మందంతో కూడా ఈ కంప్యూటర్ లభిస్తుంది.

సంప్రదాయ మౌస్, కీబోర్డు స్థానంలో టచ్ ప్యానల్ ఉంటుంది. టచ్ స్క్రీన్‌తో సలువుగా దీన్ని ఆపరేట్ చేయవచ్చు.

తక్కువ ధరకు లభ్యమయ్యే లిథిమ్ పాలిమర్ బ్యాటరీ దీనిలో ఉంటుంది.

విండో 8 మెట్రో ఇంటర్‌ఫేస్‌తో కీబోర్డు స్టాండ్‌బైతో కూడా పనిచేస్తుంది.

దీనికి స్పీచ్ రికగ్నేషన్ సౌకర్యం ఉంది. వాయిస్ కమాండ్‌తో దీన్ని ఆరంభించవచ్చు.

యాంటీ థెప్ట్ టెక్నాలజీ సాయంతో ఈ కంప్యూటర్ చోరీకి గురైతే గుర్తించవచ్చు. ఇందులో డాటాను కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.

తక్కువ కాంపోనెంట్స్‌తో బాగా పనిచేస్తుంది.

వేగంగా పనిచేసే ఓఎస్, సాఫ్ట్‌వేర్‌లు ఇందులో ఉన్నాయి.

చిన్న బ్యాటరీ, ప్యాన్‌తో అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది.

ల్యాప్‌టాప్‌ల కంటే తక్కువ ధరకు ఇవి లభ్యమవుతున్నాయి.

0 comments:

Post a Comment