Monday

రోజూ వార్తలు చదువు, చూడు.. అదే ఆరోగ్యం.. దానితోనే దీర్ఘ జీవితం...


 చాలా కాలం, ఆరోగ్యంగా, ఉత్సాహంగా బతకాలనుకొంటున్నారా.. అయితే క్రమం తప్పకుండా రోజూ వార్తా పత్రికలు చదవండి. టీవీలో వార్తలు చూడండి. లేదా ఇంటర్నెట్‌లో వార్తా సమాచారం కోసం వెతకండి... అంటూ రోమ్‌లోని 'కేథలిక్ యూనివర్సిటీ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్' సలహా ఇస్తోంది. వర్తమాన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించే వారు, సహజంగా తమ ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తారని, తద్వారా వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ అధ్యయనంలో తేలినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. 

తమ అధ్యయనం కోసం వీరు వెయ్యి మందిని పరిశీలించారు. వీరిలో ఎక్కువగా వార్తా పత్రికలు చదివే, అలాగే టీవీ వార్తలు చూసే, నెట్‌లో వార్తా సమాచారం గమనించే వాళ్ల ఆహారపు అలవాట్లు చాలా ఆరోగ్యదాయకంగా ఉంటున్నాయని, అదే ఈ వార్తల జోలికి పోని దానయ్యల ఆరోగ్య పరిస్థితి తీసికట్టుగానే ఉందని తేలినట్లు డైలీ మెయిల్ రాసింది. ఇలా వార్తలు చదివే, చూసే వాళ్లు తమ ఆహారంలో ఎక్కువగా పళ్లు, తాజా చేపల వంటివి ఉండేలా చూసుకొంటున్నారని, తద్వారా ఊబకాయం, గుండె వ్యాధులు, కేన్సర్ బెడద ప్రమాదం బాగా తగ్గిందని విశ్లేషించింది.

0 comments:

Post a Comment