బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకిచెందిన పరిశోధకులు చర్మకణాల నుంచి కృత్రిమ ధమనులు, సిరలను సృష్టించగల విధానాన్ని రూపొందించారు. తమ ఆవిష్కరణ గుండెపోటు బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న సంజయ్‌సిన్హా తెలిపారు. దాదాపు నాలుగు సంవత్సరాలు పరిశోధనలు చేసిన సంజయ్ బృందం.. దాదాపు 90 శాతం సామర్థ్యంతో పనిచేసే రక్తనాళాలను తయారుచేయగలిగింది. వీటిని వైద్యులు గుండె శస్త్రచికిత్సల సమయంలో వినియోగించుకోవచ్చని సంజయ్ హామీ ఇస్తున్నారు.
0 comments:
Post a Comment