అంగారకుడి చంద్రుడు ఫోబోస్‌పై పరిశోధనలకు ఉద్దేశించిన రష్యా అంతరిక్ష నౌక ఫోబోస్-గ్రంట్ ఆదివారం కాలిపోయి కూలిపోయింది. అంగారకుడి రెండు ఉపగ్రహాల్లో ఫోబోస్ అతి పెద్దది. దీనిపై మట్టి నమూనా సేకరణకు ఫోబోస్ -గ్రంట్‌ను ప్రయోగించారు. భూమి నుంచి 345 కిలోమీటర్లకు మించి ప్రయాణించకుండానే ఇది భూకక్ష్యలోకి జారి, కాలిపోయింది. అది చిలీలోని వెల్లింగ్టన్ దీవి వద్ద కూలిపోయిందని రష్యా సైనిక, అంతరిక్ష భద్రత బలగాలు తెలిపాయి. నిర్దేశించిన మేరకు 2014 నాటికి ఫోబోస్-గ్రంట్ మట్టి నమూనాలు సేకరించి భూమికి తిరిగి రావాల్సి ఉంది.
0 comments:
Post a Comment