రాష్ట్రంలో హెచ్ఐవీ కొత్త రూపు సంతరించుకొంటున్నది. మరింత శక్తివంతంగా విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఎయిడ్స్‌తో సహజీవనం చేసేవారు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) చికిత్సలు మధ్యలో మానేస్తున్నారు. ఫలితంగా ఎయిడ్స్ కారక హ్యుమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) ఔషధ నిరోధకత సంతరించుకొంటున్నది. దీనివల్ల భవిష్యత్తులో ఎయిడ్స్ జఠిలం గా మారి రోగులను త్వరగా మృత్యుముఖంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రంలో హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో ఏడున్నర లక్షల మంది జీవిస్తున్నట్లు అంచనా.
వీరిలో అత్యధిక మంది ్రపైవేటు వైద్యశాలల్లో చికిత్సలు పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోని యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రాల్లో మందుల కోసం 3 లక్షల 40 వేల మంది హెచ్ఐవీ పాజిటివ్‌లు పేర్లు నమోదు చేసుకున్నారు. సీడీ-4 సంఖ్య ఆధారంగా వీరిలో సుమారు లక్షా 40 వేల మందికి ఏఆర్‌టీ చికిత్సలు ప్రారంభించారు. చికిత్సలు పొందుతూ జీవించి ఉన్న ఎయిడ్స్ రోగుల సంఖ్య 80వేలు. మిగిలిన 40 వేల మంది రోగుల్లో కొందరు మృతి చెందగా, మరికొందరు వివిధ కారణాలతో మధ్యలో మందులు మానేసిన వారే. వందకు 20-25 శాతం మంది రోగులు మందులు మానేయడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రమాదకర రీతిలో డ్రాపౌట్స్ మందులు వరుసగా మూడు నెలలు మానేసిన రోగులను డ్రాప్ ఔట్స్‌గా పేర్కొంటా రు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (న్యాకో) మార్గదర్శకాల ప్రకారం 'డ్రాపౌ ట్స్' సంఖ్య మూడు శాతం కంటే మించకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో డ్రాపౌట్స్ 20 శాతం మించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.
క్రమ బద్ధంగా ఏఆర్‌టీ చికిత్సలువాడే రోగుల నుంచి ఇన్‌ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం 90 శాతం తగ్గుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎయిడ్స్ రోగులు పదేళ్లపాటు మందులు వాడిన తర్వాత ఔషధాలను తట్టుకొనే శక్తి హెచ్ఐవీ వైరస్ సంత రించుకొంటుంది. అప్పుడు ఏఆర్‌టీ చికిత్సలు రోగులకు అంతగా పనిచేయవు.
దీనిని ్రపైమరీ రెసిస్టెన్స్‌గా పేర్కొంటారు. ఇటువంటి రోగులకు కొన్ని వైద్య పరీక్షలుచేసి 'సెకండ్ లైన్ ఏఆర్‌టీ థెరపీ' (ప్రొటేజ్ ఇన్హిబిటార్స్) ప్రారంభిస్తారు. రోగులు ఏఆర్‌టీ మందులు మధ్యలో మానేయడం వల్ల ఔషధాలను తట్టుకొనే శక్తి హెచ్ఐవీ సంతరించుకొంటుంది. దీనిని సెకండరీ రెసిస్టెన్స్‌గా పిలుస్తారు. ఔషధ నిరోధకత కలిగిన రోగుల నుంచి వ్యాధి ఇతరులకు సంక్రమిస్తే వారికీ ఈ మందులు అంతగా పని చేయవు.
హెచ్ఐవీ వైరస్‌కు ఉన్న ఉత్పర్తివర్తనాలు (మ్యుటేషన్స్) ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. రోగులు దూరప్రాంతాల నుంచి రాలేక మందులు మధ్యలో మానేస్తున్నట్లు తెలిసీ స్థానికంగా లింక్ ఏఆర్‌టీ కేంద్రాలు తెరిచి అక్కడ నుంచే మందులను పంపిణీ చేస్తున్నారు. అయిన్పటికీ ఆచరణలో ఫలితాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎయిడ్స్ రోగుల పట్ల సమాజంలో వివక్ష పూర్తిగా తగ్గలేదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోగులు దగ్గరలో ఉన్న ఏఆర్‌టీ కేంద్రంలోనే మందులు తీసుకోవాలనే నిబంధన విధించింది. స్థానికంగా పరిచయస్థులు తమను గుర్తిస్తారనే భయంతో రోగులు ఏఆర్‌టీ కేంద్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. దీనివల్ల ప్రమాదకర స్థాయిలో డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతోంది.

0 comments:
Post a Comment