Monday

ప్రపంచ పటంలో భరత్ స్థానం పదిలం...


 ప్రపంచ పటంలో భారత్ స్థానాన్ని పదిలంగా నిలబెట్టగలిగేది భావి భారతపౌరులైన నేటి విద్యార్థులేనని కేంద్రమంత్రి పురందేశ్వరి అ న్నారు. మూడు రోజులపా టు జరిగిన దుగ్గిరాల జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ధి ఉత్సవ ము గిం పు సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతి«థిగా హాజరైనమంత్రి పురందేశ్వరి మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నిటికి తన మేధోసంపత్తిని చాటిచెప్పగల సత్తా నేడు భారతదేశానికుందని, ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్యను ఆర్జించి దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. గురువులు తమ గురుతర బాధ్యతను నిర్వహించిన నాడే విద్యార్ధి ఉన్నత స్థితికి ఎదుగుతాడని అన్నారు.

దుగ్గిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాల పూర్వ వైభవాన్ని నిలుపుకునేందుకు అందించిన సహకారం నాటి వారి గురువులు నేర్పిన సంస్కారానికి ప్రతీక అని అన్నా రు. గవర్నరు ప్రిన్సిపల్ కార్యదర్శి రమేష్‌కుమార్‌ను మంత్రి పురందేశ్వరి, ఎంపీ రాయపాటి సత్కరించారు. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, జల్లి విల్సన్ పలువురు పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment