Monday

ఒడిసాలో కోళ్ల అమ్మకాలపై నిషేధం...


ఒడిసాలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కుర్దా జిల్లాను వణికించిన ఫ్లూ తాజాగా పొరుగున ఉన్న మయూర్‌భంజ్ జిల్లాకూ విస్తరించింది. అప్రమత్తమైన అధికారులు కోళ్లు, గుడ్ల రవాణా, అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. చిల్కా సరస్సులోనూ బర్డ్ ఫ్లూ లక్షణాలతో పక్షులు చనిపోతున్న నేపథ్యంలో హెచ్5ఎన్1 వైరస్‌పై అధ్యయనానికి రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సోమవారం పర్యటించింది.

0 comments:

Post a Comment