Wednesday

దైవకణం ఛాయలు కనుగొన్నాం: సెర్న్ శాస్త్రవేత్తలు

సృష్టిలో ప్రతికణానికీ ద్రవ్యరాశినిచ్చే.. హిగ్స్‌బోసాన్ కణం ఛాయలను కనుగొన్నామని స్విట్జర్లాండ్‌లోని సెర్న్ ఫిజిక్స్ రీసెర్చి సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాన్నే శాస్త్రజ్ఞులు గాడ్స్ పార్టికల్ (దైవకణం లేదా విశ్వకణం)గా వ్యవహరిస్తారు. ఆ కణం ఉనికిని కనుగొనేందుకే స్విట్జర్లాండ్‌లోని సెర్న్‌లో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం విస్తృతస్థాయి ప్రయోగాలు నిర్వహిస్తోంది. 

భూగర్భంలో 27 చదరపు కిలోమీటర్ల మేర 'లార్జ్ హ్యాడ్రన్ కొల్లైడర్'ను నిర్మించి.. ఎలక్ట్రాన్లను కాంతివేగంతో ఢీ కొట్టించడం ద్వారా బిగ్ బ్యాంగ్ పరిస్థితులను సృష్టించడం, ఆ సమయంలో ఉద్భవించే శక్తిలో ఈ హిగ్స్ బోసాన్ కణం ఉనికిని కనుగొనడం వారి అంతిమ లక్ష్యం. ఇందుకోసం సెర్న్‌లో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. 

ఒకటి అట్లాస్ బృందం. ఇందులో 3000 మంది శాస్త్రవేత్తలున్నారు. మరొకటి సీఎంఎస్ (కాంపాక్ట్ మ్యుయాన్ సొలెనాయిడ్) టీమ్. తమ రెండు బృందాలు విడివిడిగా చేసిన ప్రయోగాలు దాదాపు ఒకే ఫలితాలనిచ్చాయని వారు చెబుతున్నారు. "తాజా ప్రయోగాల్లో హిగ్స్‌బోసాన్ ఉనికికి సంబంధించిన గుర్తులు కనిపించాయి. కానీ, కచ్చితమైన ఆధారమేదీ లభించలేదు'' అని సీఎంఎస్ బృందంలోని సీనియర్ ఫిజిసిస్ట్ ఆలివర్ బుష్‌మెల్లర్ వివరించారు.

0 comments:

Post a Comment