Sunday

బ్రహ్మంగారి కాలజ్ఞానం -6

వేషాలు ధరియించి పంటలే జూపించి
దేవుడే నేననుచు పలికేరయ
మాయగాండ్రేగాని మహానీయులుగారు
పొట్టకొరకు పగటి వేషాలయ!

భూతప్రేతంబులు కోలాహలంబుగా
వాడవాడలా తిరిగి ఆడేనయా
దయ్యాల పాపన్న మంత్రాలు పారవు
పాపులను దిగమ్రింగి పోయేనయా!

ధనము బలము ముందు న్యాయంబు చెల్లదు
ధర్మదేవతయేడ్చి కుమిలేనయా!
నీతి నియమము లేని కామందులనుజూచి
శీలవంతులకు చింత పుట్టేనయ!

శక్తిస్వరూపిణిని శ్రీ వెంకటేశుడని
లోకంబు కొనియాడు తెలియండయా
ఆశక్తి మహాలక్ష్మి ఆకర్షణే గలది
అన్ని దిక్కులా ధనము గుంజేనయ!

చీకటి వ్యాపార శక్తులదికంబౌను
పేదసాదలబట్టి మ్రింగేరయ
దోపిడీగాండ్రకు దొరతనంబొచ్చేను
దొడ్డవారినెల్ల మ్రింగేరయ!

సత్యమన్నమాట మచ్చుకైనను లేక
తప్పుడు సాక్షాలు పలికేరయా
దైవభీతి లేక దైవసాక్షి పెట్టు
యీ పురుగులెన్నాళ్ళు బ్రతికేరయ!

పాపాలు పెరిగెను పంటలే తగ్గును
అంతు తెలియని ధరలు ఆకాశామంటేను
ప్రబలిపోయిన ప్రజలు పస్తులకు బలి అయి
బంక మట్టిని తిని బ్రతికేరయ!

బనగాని పల్లెలో మేకపోతు యొకటి
మేకవోలె పాలు యిచ్చేనయ
నల్ల ముఖము కోతులా వూరి వాకిట
గుమిగూడి యేడ్చేను తెలియండయా !

భార్యలను హింసించు భర్తలే వచ్చేరు
పతిని అవమానించు భార్యలే వచ్చేరు
సుతుల అవమానించు తండ్రులే వచ్చేరు
తల్లిదండ్రుల తన్ను బిడ్డలే పుట్టేరు!

ఏడేండ్ల నాగయ్య వేదములు చదివేను
ఆరేండ్ల అంకమ్మ అమడబిడ్డల కనును
వెంపల చెట్లకు దోట్లు వేసేరండి
చీమరంధ్రములోన దొంగలే దాగేరు !

కృతయుగంబందున రేణుకా యను శక్తి
త్రేతాయుగంబున సీతయను శక్తి
ద్వాపరయుగంబున ద్రౌపది యను శక్తి
కలియుగంబున పుట్టు యింటింటికొక శక్తి!

ధనము స్త్రీల కొరకు తపియించుచుందురు
కలిమాయ పురుషులు నమ్మండయా
జీవుని కడతేర్చ దేవుడొక్కడేగాని
మూన్నాళ్ళ బ్రతుకని తెలియండయా!

source :-
templesdiary.com

0 comments:

Post a Comment