Wednesday

ఊడిపోయే దంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం

చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్లు సోకడం వల్ల దంతాలు కదలడం, ఊడిపోవడం జరుగుతుంటుంది. సాధారణంగా దంతాలన్నీ ఊడిపోతే తీసి పెట్టుకునే కట్టుడు పళ్లు అమర్చే పద్ధతి ఉండేది. తాజాగా మొత్తం ఊడిపోయిన దంతాల స్థానంలో ఫిక్డ్స్ దంతాలను అమర్చే ఆధునిక వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. చిగుళ్లలోని ఇన్‌ఫెక్షన్‌ను సమూలంగా తొలగించడంతోపాటు దవడలో ఇంప్లాంట్స్ వేసి దంతాలను ఫిక్స్ చేసే పద్ధతి ఎంతో సురక్షితమైనదని అంటున్నారు డెంటల్ ఇంప్లాంట్ సర్జన్.


నారాయణరెడ్డికి 74 ఏళ్లు. 50 ఏళ్ల వయసు వరకు దంతాలకు ఎటువంటి సమస్య లేదు. ఆ తర్వాత నుంచి చిగుర్ల నుంచి రక్తం రావడం, చిగుర్లు వాయడం, నోటి నుంచి దుర్వాసన, ముందు దంతాలు ఎత్తు రావడం ప్రారంభమైంది. అయితే నొప్పి లేదు కదాని దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. మూడేళ్ల తర్వాత 5, 6 పళ్లు కదిలి ఊడిపోయాయి. తర్వాత డాక్టర్‌ను కలుసుకోగా చిగుర్ల వ్యాధి వచ్చినందున సర్జరీ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్ దూరమవుతుందని, అలాగే కదిలే పళ్లు తీయించుకుని తీసి పెట్టుకునే పళ్లు కట్టించుకోవాలని సలహా ఇచ్చారు. సర్జరీ ఉంటే నొప్పి ఉంటుందన్న భయంతో నారాయణరెడ్డి డాక్టర్ సలహాను పట్టించుకోలేదు. కదులుతున్న పళ్లు వాటికవే ఊడిపోతాయన్న ఆలోచనతో ఆయన ఆ విషయాన్ని వదిలేశాడు.

కాలక్రమంలో ఒకటి రెండు మినహా మిగిలిన దంతాలన్నీ ఊడిపోయాయి. ఆ మిగిలిన ఒకటి రెండు కూడా కదులుతున్నాయి. మళ్లీ డాక్టర్‌ను సంప్రదించగా ఎముక పూర్తిగా అరిగిపోయిందని, ఇంప్లాంట్స్ చేసేందుకు తగినంత ఎముక లేదని, ఈ పరిస్థితిలో ఏమీ చేయలేమని తేల్చేశారు. దీంతో నారాయణరెడ్డిలో భయం మొదలైంది. ముఖంలో ముడుతలు వచ్చాయి. మాట స్పష్టత పోయింది. నమిలే పరిస్థితి లేకపోవడంతో మెత్తటి ద్రవ పదార్థం లాంటి ఆహారం తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో శక్తి తగ్గిపోయింది. వీటికి తోడు గుండె జబ్బు వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఎలా అయినా కట్టుడు పళ్లు పెట్టించుకోవాలన్న దృఢ నిశ్చయంతో తన మిత్రుని సలహా మేరకు మా ఆసుపత్రిని ఆయన సంప్రదించారు.

సర్జరీ విధానం
మొదటగా కదిలే పళ్లు ఉన్న చోట, వాచిన చిగుర్లకు వ్యాపించిన ఇన్‌ఫెక్షన్ తొలగించడానికి లేజర్ గమ్ సర్జరీ చేశాము. తర్వాత రక్త పరీక్షలు చేసి పైపళ్లు ఒక్కొటొక్కటిగా తొలగించి అక్కడ ఉన్న ఇన్‌ఫెక్షన్‌ను లేజర్‌తో నిర్మూలించాము. పళ్లు తీసిన సాకెట్‌లోనే మొత్తం 10 ఇంప్లాంట్స్ వేశాము. మొత్తం పైపళ్లు తీయడానికి, ఇంప్లాంట్స్ అమర్చడానికి 2 గంటల సమయం పట్టింది. పేషెంట్‌ను ఇంటికి పంపించి వేసి మరుసటి రోజు రమ్మన్నాము. మరుసటి రోజు కింది పళ్లు అన్నీ తీసివేయడం జరిగింది. కింది దవడలో ఇన్‌ఫెక్షన్‌ను తొలగించి 8 ఇంప్లాంట్స్ వేశాము. అదే రోజు కొలతలు తీసుకుని 24 గంటల్లోనే మొత్తం పళ్లను అమర్చాము. ఇప్పుడు నారాయణరెడ్డి 10 అన్ని రకాల ఆహారాన్ని నమిలి తింటున్నారు.

సర్జరీ ఎలా చేస్తారు?
లోకల్ అనస్థీషియాతో పైదవడలో 10 ఇంప్లాంట్స్, కింద దవడలో 8 ఇంప్లాంట్స్ అమర్చడం జరుగుతుంది. వాటి పైన పైదవడలో 14 ఫిక్డ్స్ పళ్లు(సిరామిక్ ఫిక్డ్స్ బ్రిడ్జి), కింది దవడలో 14 ఫిక్డ్స్ పళ్లను అమరుస్తాము. ఈ ఇంప్లాంట్స్ ఎవరైనా వేసుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. ఆరోగ్యవంతంగా ఉండే ఎవరైనా ఈ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. అలాగే ఈ ఫిక్డ్స్ పళ్లను వేసుకున్న తర్వాత ఆహారం నమిలేటప్పుడు నొప్పి గాని, ఇబ్బంది గాని ఉంటుందేమోనని కూడా భయపడుతుంటారు. అలాంటిదేమీ ఉండదు. ఫిక్డ్స్ పళ్లను అమర్చుకున్న తర్వాత ఆహారాన్ని నమలడంలో ఎలాంటి నొప్పి ఉండదు. ఇంప్లాంట్స్ పూర్తిగా కుదురుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు మాత్రం మెత్తటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నాలుగు నెలల తర్వాత అన్ని రకాల గట్టి పదార్థాలు తినవచ్చు. నమలడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఇంప్లాంట్స్ సురక్షితమా?
ఇంప్లాంట్స్ వల్ల ఇన్‌ఫెక్షన్లు సోకుతాయన్న అపోహ కూడా కొందరిలో ఉంటుంది. అయితే ఇంప్లాంట్స్ వల్ల ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశమే లేదు. అంతేగాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. విదేశాలలో సంవత్సరానికి 20-30 లక్షల మంది ఇంప్లాంట్స్ వేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతర మార్గాలలో దంతాలు అమర్చే విధానాలు పోయి ఇంప్లాంట్స్ ద్వారా మాత్రమే పళ్లు రిప్లేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే, ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్డ్స్ పళ్లు అమర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదు. 20 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు ఎవరైనా వీటిని అమర్చుకోవచ్చు. బయట ఊళ్ల నుంచి వచ్చే పేషెంట్స్ నాలుగైదు రోజులు ఉండేటట్లు వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మూడు రోజుల్లో ఇంప్లాంట్స్ వేయడం, దంతాలు ఫిక్స్ చేయడం పూర్తవుతుంది. తర్వాత ఒకటి రెండు రోజులు చెకప్ కోసం ఉండాల్సి ఉంటుంది.

ఫిక్డ్స్ పళ్లను అమర్చుకున్న తర్వాత ఆహారాన్ని నమలడంలో ఎలాంటి నొప్పి ఉండదు. ఇంప్లాంట్స్ పూర్తిగా కుదురుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు మాత్రం మెత్తటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నాలుగు నెలల తర్వాత అన్ని రకాల గట్టి పదార్థాలు తినవచ్చు.

0 comments:

Post a Comment