Wednesday

బొల్లి వ్యాధి హోమియోతో దూరం


చర్మవ్యాధులు అంటేనే తెలియని భయం. ముఖం మీద, కనురెప్పల పైన, వేళ్లపైన తెల్లటి మచ్చలు కనిపిస్తే చాలు ఆందోళనతో మానసికంగా కుంగిపోయి జీవితంలో అన్నీ కోల్పోయామనే భావనలోకి వెళ్లిపోతారు. బొల్లి వ్యాధి బారినపడిన వారి పరిస్థితి ఇది. ఎన్ని మందులు వాడినా తగ్గని ఈ వ్యాధికి హోమియోపతి ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుందని అంటున్నారు డాక్టర్ .



బొల్లి లేదా తెల్లమచ్చల వ్యాధి శారీరకంగా పెద్దగా బాధపెట్టకపోయినా మానసికంగా కుంగదీసేలా చేస్తుంది. ఈ వ్యాధి బారినపడిన ప్రతీ ఒక్కరూ నిరాశతో కనిపిస్తారు. శరీరంపై తెల్లమచ్చలు ఎందుకు వస్తాయి? అనిప్రశ్నిస్తే ముందుగా చర్మం గురించి చెప్పుకోవాలి. చర్మం శరీరంలోని అన్ని ముఖ్యమైన భాగాలను కప్పివుంచి రక్షణకవచంలాగా పనిచేస్తుంది. చర్మంలో మూడు పొరలుంటాయి.

అవి ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. వయసుతో పాటు చర్మంలో మార్పులు రావడం సహజం. వయసు పెరిగేకొద్దీ చర్మంలోని రక్తనాళాలు, గ్రంధులకు రక్తసరఫరా తక్కువ కావడం వల్ల ముడతలు పడతాయి. చర్మంలోని కాంతి తగ్గి, కాంతివిహీనంగా కనిపిస్తుంది. జీవనశైలిలోని మార్పులు, మానసిక ఒత్తిడుల వల్ల శరీరంలో కలిగే రసాయనిక మార్పుల వల్ల రక్షణ వ్యవస్థ మెలనోసైట్స్ అనే కణజాలంపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలోని మెలనోసైట్స్ నశిస్తాయి. దీనివల్ల మనకు తెల్లమచ్చలు ఏర్పడతాయి. ఇది ప్రారంభంలో ఒకే చోట కనిపించినా క్రమంగా శరీరమంతటా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది.

కారణాలు
జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం వల్ల కలిగే అలర్జీ, జీవనశైలిలోమార్పులు, అతిగా కాఫీ, టీ తాగే అలవాటు ఉండటం, వాడిన నూనె మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం, మసాలాలు విరివిగా వాడటం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌ఫెక్షన్స్, తాగే నీటిలో రసాయనాలు, ఆహార లోపం, విటమిన్లలోపం, సౌందర్యసాధనాలు విరివిగా వాడటం వంటివి కూడా కారణమవుతాయి. ఈ కారణాల వల్ల రక్తంలో మలినాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. జీవనవిధానంలో మార్పుల వల్ల రక్తంలో టాక్సిన్స్ ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, తీవ్రమైన శారీరక శ్రమ వల్ల రక్తంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుని ల్యూకోడెర్మా, సొరియాసిస్ వంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి.

లక్షణాలు
చాలా మందిలో తెల్లమచ్చలు, ముఖం, పెదవుల మీద, కనురెప్పల మీద మొదలవుతాయి. క్రమేణా పాదాలు, అరచేతులు, వేళ్లకు వ్యాపిస్తుంది. ఎండను వేడిమిని తట్టుకోలేకపోతారు. చర్మం తెల్లగా మారిన ప్రాంతంలోని వెంట్రుకలు తెల్లగా మారుతాయి. కొన్నిసార్లు ఈ మచ్చలు అకస్మాత్తుగా శరీరమంతా పాకుతాయి. ఎండలో ఎక్కువగా తిరిగినపుడు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు తొందరగా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది.

శోభి
శరీరంపైన గోధుమ రంగులో మచ్చలు, తెల్లటి మచ్చలు కలిసి వచ్చే సమస్యని శోభి అంటారు. ఫంగస్ తరహా పరాన్నజీవి వల్ల ఈ మచ్చలు వస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చెమట ఎక్కువగా పోస్తున్నప్పుడు, చమురు గ్రంధులు సెబమ్ అనే చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ ఫంగస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ మచ్చలు ముందు చిన్నవిగా మొదలయి పెద్దగా మారతాయి. ఛాతీ, వీపు, మెడ, మెడ కింద భాగాల్లో కనిపిస్తాయి. దురద ఉండదు కానీ సన్నగా పొట్టు మాదిరిగా రాలుతుంటుంది. ఈ మచ్చలకు ప్రారంభదశలో చికిత్స తీసుకోకపోతే క్రమేణా చర్మమంతా మందంగా, దళసరిగా, నల్లగా తయారవుతుంది.

వ్యాధి నిర్ధారణ
చాలా మంది ఈ మచ్చలను సొరియాసిస్ అనుకుని భయపడుతుంటారు. కానీ సొరియాసిస్ తెల్లగా, పొట్టుపొట్టుగా రాలుతూ ఉంటుంది. కొన్ని రకాల రక్తపరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, సీబీపీ. సీరమ్ ఐజీఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. చాలా కేసులలో రోగి మానసిక, శారీరక కుటుంబ చరిత్రతో వ్యాధినిర్ధారణ చేయబడుతుంది. చికిత్స ఈ వ్యాధి బారినపడిన వారికి మానసిక ఉత్సాహాన్ని అందించాలి. ఆందోళనను తగ్గించాలి. డయాబెటిస్ ఉన్న వారు వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. ఈ వ్యాధి అంటువ్యాధి కాదు. స్నేహితులకు, పిల్లలకు, భాగస్వామికి సంక్రమించడం జరగదు. చాలా మందిలో మానసిక ఒత్తిడులు, హార్మోన్ల సమస్యలు, ఎండలో ఎక్కువగా తిరగడం, కొన్ని ఇన్‌ఫెక్షన్ల వల్ల, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇది మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బారినపడినపుడు దాని గురించి మరింత ఆలోచించకుండా యెగా, మెడిటేషన్ లాంటివి చేయాలి, పోషకాహారం తీసుకోవాలి.

హోమియో చికిత్స
హోమియో వైద్యం ప్రకృతి నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాస్త్రీయతను సంతరించుకున్న ఈ విధానం వ్యాధినిర్ధారణతో పాటు వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స చేయడం జరుగుతుంది. ఫోటోథెరపీ లాంటి విధానాలతో తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది కానీ శాశ్వత ప్రయోజనం లభించదు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో పూర్తికాలం చికిత్సతీసుకుంటే ఈ వ్యాధికి తగిన పరిష్కారం లభిస్తుంది.

0 comments:

Post a Comment