Wednesday

కాల్ చార్జి 30 పైసలే లోకల్, ఐఎస్‌డి, ఎస్‌టిడి కాల్ చార్జీలు భారీగా తగ్గించిన ఎంటిఎస్


సిడిఎంఎ సర్వీసులను అందిస్తున్న ఎంటిఎస్ ఇండియా కొత్త పథకం కింద తన కస్టమర్లు నిమిషానికి 30 పైసలు మాత్రమే చెల్లించి లోకల్, ఎస్‌టిడి, రోమింగ్, ఐఎస్‌డి కాల్స్‌ను మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. దీనితో పాటు ఎస్ఎంఎస్‌కు 30 పైసలు, ఒక ఎంబి డేటా డౌన్‌లోడ్‌కు కూడా 30 పైసలే చార్జ్ చేస్తున్నట్టు కంపెనీ చీఫ్ మార్కెటింగ్, సేల్స్ ఆఫీసర్ (ఇండియా) లోనిద్ ముసటో ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎస్‌డి కాల్స్‌లో నిమిషానికి 30 పైసలు కేవలం అమెరికా, కెనడాలకు మాత్రమే వర్తిస్తుంది.

అది కూడా నెలలో 100 నిమిషాలకే పరిమితం. ఆపరేటర్లు ఇచ్చే ఎంట్రీ లెవల్ ఫోన్‌తో ఎంటిఎస్ ప్లానెట్ ద్వారా ఉచితంగానే ఫేస్‌బుక్‌ను వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎంటిఎస్‌కు దేశవ్యాప్తంగా 1.6 కోట్లకు పైగా కస్టమర్లున్నారు. కొత్త, పాత కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను అందుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

0 comments:

Post a Comment