Wednesday

15 లక్షల లోపు గృహరుణాలపై 1% వడ్డీ రాయితీ మరో ఏడాది కొనసాగింపు


ఇల్లు కట్టుకోవాలని గానీ, కొనుక్కోవాలని గానీ అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఇంటి విలువ రూ. 25 లక్షల లోపు ఉండి, రుణం రూ. 15 లక్షల లోపు ఉంటే వడ్డీపై ఒక శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటు.. సుప్రీంకోర్టుకు అదనపు భ వన నిర్మాణం, ఫాస్పాటిక్, పొటాషిక్ ఎరువుల రవాణా చార్జీల చెల్లింపు, తమిళనాడులో పీసీపీఐఆర్‌కు ఆమో దం, కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కోసం ఏర్పాటుచేసే క్లస్టర్లకు రూ. 50 కోట్ల వరకు ప్రభుత్వ సా యం వంటి నిర్ణయాలు కేబినెట్‌లో తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర హోంమంత్రి చిదంబరం మీడియాకు వెల్లడించారు. గృహరుణాల మీద వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజానీకానికి వెసులుబాటు కల్పిస్తూ రూ. 15 లక్షల లోపు రుణాలపై ఇస్తున్న 1% వడ్డీ రాయితీని మరో ఏడాది పొడిగించారు.

సబ్సిడీ పరిమితి రూ. 15 లక్షల రుణానికి రూ. 14,912, రూ. 10 ల క్షల రుణానికి రూ. 9,925 ఉంటుందని చిదంబరం తెలిపారు. ఇక సుప్రీంకోర్టు ప్రాంగణం ఇరుకిరుగ్గా ఉండటం తో అదనపు భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ. 884.30 కోట్ల వ్యయం అవుతుంది. ప్రగతి మైదాన్‌కు సమీపంలోని 12.19 ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. మరోవైపు.. అనియంత్రిత ఫాస్పాటిక్, పొటాషిక్ ఎరువుల రవాణా ఖర్చులను భరించాలని కూడా ప్ర భుత్వం నిర్ణయించింది. సింగిల్‌సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్‌పీ) తప్ప అన్నింటికీ ఇది వర్తిస్తుంది.

0 comments:

Post a Comment