Wednesday

అరాఫత్‌పై విషప్రయోగం...!


పాలస్తీనా యోధుడు యాసర్ అరాఫత్ విషప్రయోగం వల్లే మరణించారా? స్విట్జర్లాండ్‌లో నిర్వహించి న ఓ పరిశోధన అ వుననే చెబుతోంది. పొలోనియం అనే విషపదార్ధం వల్లే ఆయన మృతి చెందారని ఆ పరిశోధన ను ఉటంకిస్తూ అల్‌జజీరా చానెల్ పేర్కొంది. 2004లో కొన్ని వారాల పాటు చికిత్స పొందిన అనంతరం అరాఫత్ పారిస్ సైనిక ఆస్పత్రిలో మృతి చెందారు.

అప్పట్లో అరాఫత్ శరీర అంతర్గత అవయవాల నుంచి సేకరించిన నమూనాలను ఆయన భార్య సుహాకు అందజేశారు. వాటి ఆధారంగానే విషప్రయోగం జరిగినట్టుగా విశ్లేషించారని లాసన్నే యూనివర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ రేడియేషన్ ఫిజిక్స్‌లో ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బోచడ్ తెలిపారు.


0 comments:

Post a Comment