Wednesday

హెచ్ఐవీ కనుగొనే హోం కిట్...!


ఎయిడ్స్ వ్యాధి కారక వైరస్.. హెచ్ఐవీ సంక్రమించిందీ లేనిదీ ఎవరికి వారు స్వయం గా తెలుసుకొనే 'హెచ్ఐవీ టెస్ట్ కిట్'ను మొదటిసారిగా అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. బుధవారం అనుమతించిన ఈ కిట్ ఆధారంగా చేసే ప రీక్షను ఎవరికి వారే నిర్వహించుకోవచ్చు. దీనికి పెద్దగా సాంకేతిక నైపుణ్యం అక్కరలేదు. 'ఓరాక్విక్ ఇన్ - హోం హెచ్ఐవీ టెస్ట్'ను వాడేందుకు నోటిలో ద్రవించే లాలాజలం చాలు. ఈ కిట్ పరీక్షతో 20 నుంచి 40 నిమిషాల్లో హెచ్ఐవీ సోకిందీ లేనిదీ తెలుస్తుంది. నోటి సంబంధమై న పరీక్ష కోసం ఆహార, ఔషధ నియంత్రణ మండలి(ఎఫ్‌డీఏ) 2005 నుంచి ప్రయత్నిస్తోంది.

అమెరికాలో 12 లక్షల మందికి హెచ్ఐవీ సోకినట్టు అంచనా. ప్రతి ఐదుగురిలో ఒకరికి హెచ్ఐవీ ఉన్నట్టు బాధితులకు తెలియ దు! ఏటా 50వేల మందికి కొత్తగా హెచ్ఐవీ సంక్రమిస్తోంది. ఈ కిట్ ద్వారా హెచ్ఐవీ ఉందని తేలినా బెంబేలెత్తాల్సిన పని లేదు. ఇక్కడ కనిపించిన హెచ్ఐవీ పా జిటివ్ ఫలితాన్ని «ద్రువీకరించేందుకు ఇతర పరీక్షలను ని ర్వహించాలని ఎఫ్‌డీఏకి చెందిన డైరెక్టర్ కరేన్ మిథున్ చెప్పారు. ఈ పరీక్ష సాధని(టెస్ట్ కిట్) అక్టోబర్‌లోగా అందుబాటులోకి వస్తోంద ని ఓరాస్యూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డౌగ్లస్ మిచేల్స్ తెలిపారు.

0 comments:

Post a Comment