Friday

'మనం పక్కా మాస్' అంటున్న సమంతా


మామూలుగా మన హీరోలు మాస్ ఇమేజ్ సంపాదించుకోవడం కోసం తాపత్రయపడుతుంటారు. అయితే, ఇప్పుడు చెన్నయ్ అందం సమంతా కూడా అలాంటి ఇమేజ్ నే కోరుకుంటోంది. 'మాస్ ని ఆకట్టుకునే విధంగా కనిపించడంలో వున్నా మాజానే వేరు' అంటోంది ఈ బుల్లెమ్మ. 'మన డైలాగులకి, లుక్కులకి ప్రేక్షకులు దియేటర్లో ఈలలు వేస్తే.... అబ్బో... ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది...' అంటూ తెగ ఫీలైపోతోంది సమంతా. 'దూకుడు' సినిమా తర్వాత తనకి అలాంటి మాస్ ఇమేజే వచ్చిందని ఆమె గర్వంగా చెప్పుకుంటోంది. 'క్లాసీగా కనిపించడం నాకిష్టముండదు. మాసీగా కనిపిస్తూ, డ్యాన్సుల్లో దుమ్మురేపుతుంటేనే మనమేమిటో తెలుస్తుంది' అంటోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి నటిస్తున్న 'ఆటోనగర్ సూర్యా' సినిమాలో అలాంటి పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తోందట. గెటప్పుతో పాటు డైలాగులు, డ్యాన్సులు... అన్నీ మాస్ ని ఆకట్టుకుంటాయని ఆమె ధీమాగా చెబుతోంది.

0 comments:

Post a Comment