Friday

మేరు దండాసనం...!


మన శరీరం, మనస్సు నిరంతరంగా పనిచేస్తూ ఉండటం వలన వాటి సహజ ఉత్తేజితత్వం అనేది తగ్గిపోతుంది. కోపం, భయం, ఇరి కొన్ని బాధాకరమైన సంఘటనలు మన నుంచి చాలా శక్తిని లాగేస్తాయి. మనిషి నీరసపడుతాడు. దీనివలన శారీరకంగా మనం డయాబెటాస్, మైగ్రేన్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన కోపం, అసహనం వీటిని కంట్రోల్ చేసుకోగలమో అప్పుడు మన రక్తపవూసరణ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవు. సమస్యలుండవు. ఇందుకు శరీరం, మనస్సు రిలాక్స్ అవ్వడం చాలా ముఖ్యం. మెడి అనేది మన ఫీలింగ్స్ మీద మనకు కంట్రోల్‌ను ఇస్తుంది. మెడి మరోరకం ఈ వారం...

చిత్రపట ధ్యానం:
మన ముందు మనకు ఇష్ట దైవం ఫోటోను ఉంచుకోవాలి. స్థిరంగా సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చోవచ్చు. ఇప్పుడు తదేకంగా ఆ ఫోటోనే ఒక 10-15నిమిషాల పాటు చూడాలి. శ్వాస మామూలుగా తీసుకోవాలి. 10- 15నిమిషాల తర్వాత కళ్లు మూసుకోవాలి. కళ్లు మూసుకున్నాక కూడా మన కళ్ల ముందు ఆ చిత్రమే ఉంటుంది. ఆ చిత్రాన్ని వీలున్నంతవరకు మన ఎదుట హోల్డ్ చెయ్యడానికి ప్రయత్నించాలి. మన కాన్‌సన్‌వూటేషన్ పెరుగుతున్న కొద్దీ మనం కళ్లు మూసుకొని చిత్రాన్ని చూడగలిగే సమయం పెరుగుతుంది.

మేరు దండాసనం
మేరు దండం అనగా వెన్నముక. వెన్నముక్క దృఢత్వాతన్ని పెంచుతుంది కనుక ఈ ఆసనానికి మేరు దండాసనం అని పేరు.

పద్ధతి:
1.ముందుగా వెల్లకిలా పడుకొని రెండు చేతులను భుజానికి సమాంతరంగా చాచాలి. అరచేతులు ఆకాశం వైపుగా పెట్టాలి. ఇప్పుడు కుడి పాదం మడిమ, ఎడమ పాదం వేళ్లు మీదగా ఉండేట్లు పెట్టాలి.
2. దీర్ఘంగా గాలి పీల్చుకొని తలను కుడి వైపుకి, పాదాలను ఎడమ వైపుకి తిప్పాలి. పది సెకన్లపాటు ఇదే స్థితిలో ఉండాలి.

3. గాలి పీల్చుకుంటూ తలను, పాదాలను మామూలు స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు గాలిని వదిలేస్తూ తలను ఎడమ వైపుకి, పాదాలను కుడి వైపుకి తిప్పాలి. ఇప్పుడు పదిసెకన్లపాటు ఇదే స్థితిలో ఉండి, తర్వాత యథాస్థితికి రావాలి.

4. ఈ విధంగా కుడివైపుకి ఐదు సార్లు, ఎడమ వైపుకి ఐదుసార్లు చేయాలి. ఇప్పుడు ఎడమ పాదం, కుడిపాదం వైపుకి తీసుకువచ్చి పదిసార్లు రిపీట్ చేయాలి.

5. ప్రతిసారీ తల, పాదాలు వ్యతిరేకదిశలో ఉండేట్లు చూసుకోవాలి.

ఉపయోగాలు:
4 ఇది వెన్నముక, దాని చుట్టూ ఉండే కండరాలను శక్తివంతం చేస్తుంది. నాడీవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నడుము భాగంలో కొవ్వు పెరగకుండా చూస్తుంది.
4 నడుము నొప్పితో బాధపడేవారికి ఇది వరం లాంటిది.
4 ఉదర అంగాలకు కూడా మంచి మసాజ్‌ని కలిగించడం వల్ల అన్ని అవయవాలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి.

0 comments:

Post a Comment