ఈ ఫోటోలో ఉన్న హోమి వ్యారావాలా భారతీయ తొలి మహిళా ప్రెస్ ఫోటోగ్రాఫర్. అంతా మగ వాళ్లే కనిపించే ప్రెస్ ఫోటోగ్రఫీ రంగంలోకి 1930ల్లోనే అడుగుపెట్టి 40 ఏళ్ల పాటు దేశ రాజకీయ పరిణామాలను అత్యంత ప్రతిభావంతంగా రికార్డు చేశారు. గత ఏడాది పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఆమె మొన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 98 ఏళ్లు.
ఫోటోగ్రఫీ విడిచి పెట్టిన తరువాత ఆమె ఒక్క ఫోటో కూడా తీయలేదు. ' కెరీర్ బాగున్న దశలో మీరు ఎందుకు ఫోటోగ్రఫీని వదిలేశార'ని అడిగితే... 'మా ఫొటోగ్రాఫర్లకు కొన్ని నియమాలు ఉండేవి. డ్రస్ కోడ్ కూడా ఉండేది. ఒకరిని ఒకరం ఎంతో గౌరవించుకునేవాళ్లం. వేరు వేరు పత్రికలకు పనిచేసినప్పటికీ అందరం సహోద్యోగులుగానే ఉండే వాళ్లం. కాని తరువాత తరువాత పరిస్థితులు చెత్తగా తయారయ్యాయి.
కొత్త తరం ఫోటోగ్రాఫర్లు త్వరగా సంపాదించాలనే తాపత్రయంలో ఉండేవాళ్లు. ఆ గుంపులో నేను ఒకదాన్ని కాదల్చుకోలేదు. అందుకే వదిలేశాను'' అని సమాధానం చెప్పారు. హోమి పుట్టిన సంవత్సరం 1913, పదమూడేళ్లకే వివాహం అయ్యింది. మొదటి కారు నంబర్ ప్లేట్ 'డిఎల్‌డి13'. ఇవన్నీ కలిసి వచ్చేలా 'డాల్డా13' అనే పేరుతో ఫోటోలు ప్రచురించుకునేవారామె.

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై నిలబడి స్వాతంత్య్ర ప్రకటన చేస్తున్న చారిత్రక దృశ్యాన్ని కెమెరాలో బంధించిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్ హోమై వ్యారావాలా తనువు చాలించారు. 98 ఏళ్ల వ్యారావాలా ఆదివారం ఉదయం వడోదరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. మూడు రోజుల కిందట మంచం మీద నుంచి కిందపడటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. 1913 డిసెంబర్ తొమ్మిదో తేదీన పార్శీ కుటుంబంలో ఆమె జన్మించారు. 1942లో ఢిల్లీ చేరుకున్న ఆమె ఫొటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు, భారతదేశ చరిత్రను తిరగరాసిన ఎన్నో అపూర్వ స్వాతంత్య్ర సమర ఘట్టాలను తన కెమెరాతో బంధించారు.
తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌గానే కాక, స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘటనలను నమోదు చేసిన అరుదైన మహిళగా గుర్తించడంతోపాటు వ్యారావాలాను పద్మ విభూషణ్ బిరుదుతో కేంద్రం సత్కరించింది. ఆమె తీసిన ఛాయాచిత్రాలను "ఇండియా ఇన్ ఫోకస్, కెమెరా క్రానికల్స్ ఆఫ్ హోమై వ్యారావాలా'' పేరిట సబీనా అనే ఔత్సాహికురా లు పుస్తకంగా తీసుకొచ్చారు. చాలాకాలం తెర మరుగున ఉన్న వ్యారావాలా పేరు 2006లో నానో కార్ల రాకతో మరోసారి వెలుగులోకొచ్చింది. టాటా తొలి నానోను ఆమెకే విక్రయించింది.

0 comments:
Post a Comment