మానవులకు ఇహలోకంలో లభించిన జీవితం, రేపటి పరలోక జీవితానికి కావలసిన ఏర్పాట్లు చేసుకునే కార్యస్థలి. నిజానికి ఈ ప్రాపంచిక జీవితం చాలా చిన్నది. అయితే, మరణం దీనికి ముగింపు కాదు. ఇదొక మార్పు మాత్రమే. అసలు జీవితం, శాశ్వత జీవితం, ఆ పరలోక జీవితమే. అందుకే ఆ పరలోక జీవితానికి కావలసిన ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. ఉదాహరణకు మనం ఏదైనా పని మీద మరో నగరానికి వెళ్లినప్పుడు, వారమో, నెలో అక్కడ ఉండి వెళ్లిన పని ముగించుకుని తిరిగి వచ్చేస్తాం. ఒకవేళ వెళ్లిన పని కాకపోతే మరి కొద్ది రోజులు వేచి చూసి తిరుగు ప్రయాణం కడతామే కానీ అక్కడే స్థిరపడిపోము. ఎందువల్ల అంటే అసలైన మన జీవితమంతా ఇక్కడే ఉంది. ఇల్లు సంసారం, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు ఆలుబిడ్డలు సర్వస్వమూ ఇక్కడే ఉన్నాయి. అందుకే మన అసలు స్థానానికే తిరిగి వచ్చేస్తాం. మన ప్రాపంచిక జీవితం కూడా సరిగ్గా అలాంటిదే.
ఏ విత్తునాటితే ఆ ఫలం ఈ లోకంలో మనం ఎన్నాళ్లు జీవించినా, ఏదో ఒక రోజున మరణమనే మజిలీ దాటి శాశ్వతమైన పరలోకానికి చే రవలసిందే! ఎవరైనా శాశ్వతమైన ఆ పరలోక జీవితం సుఖవంతంగా, సౌభాగ్యవంతంగా సాగాలంటే ఇహలోకంలో తప్పనిసరిగా దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితంలో మనం ఏం సంపాదిస్తామో, దాని ఫలితాన్నే రేపు మనం అక్కడ అనుభవిస్తాం. మంచి పనులు చేస్తే మంచి ఫలితం, చె డు పనులు చేస్తే చెడు ఫలితం వస్తాయి. ఎవరైనా, ఇహలోకంలో అంతా ఇష్టానుసారంగా గడిపేసి, పరలోకంలో ఫలవంతమైన జీవితాన్ని కోరుకుంటే అది అజ్ఞానమే.
ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలాన్నే కోస్తాం తప్ప మరొకటి కాదు కదా! ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ " ఏదైనా మీరు చేజేతులా కొని తెచ్చుకునే పర్యవసానమే తప్ప, దేవుడు తానుగా తన దాసులకు అన్యాయం చేసే వాడు కాదు'' అంటోంది పవిత్ర ఖురాన్ (8-51). అలాగే... " సత్కార్యాలు చే సే వారికి సత్ఫలం ఉంది. అంతకు మించిన ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. వారి ముఖాలు దుమ్ముకొట్టుకుని నల్లగా మారడం గానీ అవమాన భారంతో ముడుచుకుపోవడం గానీ జరగదు. వారు స్వర్గానికి అర్హులవుతారు. స్వర్గంలోనే వారు కలకాలం ఉంటారు. అలాగే దుష్కార్యాలకు పాల్పడే వారికి అందుకు తగ్గ దుష్ఫలితమే వుంటుంది. పైగా వారిని అవమానం, అప్రతిష్టలు చుట్టుముడతాయి.
దేవుని పట్టు నుంచి వారిని కాపాడే నాథుడే వుండడు. వారి ముఖాలు నిరాశా నిస్పృహలతో నల్లగా మారి ఉంటాయి. వారంతా నరకానికి వెళ్లే వారే. నరకంలోనే వారు ఎల్లకాలం పడి ఉంటారు'' (10-26,27). అందువల్ల పవిత్ర ఖురాన్ బోధనలను అర్థం చేసుకుంటూ, సహజ అవసరాలకు మించి, ప్రాపంచిక వ్యామోహంలో పడిపోకుండా ఇహలోక జీవితాన్ని శాశ్వతమైన పరలోక జీవితాన్ని అందుకోవడానికి అవసరమయ్యే సత్కార్యాలు చేస్తూ వెళితే ఈ జీవితంతో పాటు శాశ్వతం జీవితం కూడా సఫలమవుతుంది. ఎందుకంటే చివరికి మనమంతా కర్మల విచారణ కోసం, దైవం ముందు హాజరు కావలసిందే! ఇది దైవం చేస్తున్న తిరుగులేని వాగ్దానం. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ఆయన న్యాయంగా తగిన ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు. దీనికి భిన్నంగా ప్రవరిస్తే ఆయన కఠినంగా శిక్షిస్తాడు కూడా.(10-4)
ఈ ప్రాపంచిక జీవితంలో మనం ఏం సంపాదిస్తామో, దాని ఫలితాన్నే రేపు మనం అక్కడ అనుభవిస్తాం. మంచి పనులు చేస్తే మంచి ఫలితం, చె డు పనులు చేస్తే చెడు ఫలితం వస్తాయి. ఎవరైనా, ఇహలోకంలో అంతా ఇష్టానుసారంగా గడిపేసి, పరలోకంలో ఫలవంతమైన జీవితాన్ని కోరుకుంటే అది అజ్ఞానమే.

0 comments:
Post a Comment