నాటో దళాల దాడి దరిమిలా ఆగ్రహంతో ఊగిపోతున్న పాకిస్థాన్.. అమెరికాకు హకుం జారీచేసింది. తక్షణమే తమ గడ్డను వీడి వెళ్లాలంటూ హెచ్చరించింది. 15 రోజుల్లోగా షంసి వైమానిక స్థావరాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం జారీచేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి(ఐరాస) దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఐరాసలో పాక్ రాయబారి అబ్దుల్లా హుస్సేన్ హరూన్.. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్‌కు ఓ లేఖ రాశారు. నాటో దళాల దాడిని పాక్ తీవ్రంగా నిరసించింది.
అంతే కాదు.. బాన్ సదస్సును బహిష్కరించాలని కూడా పాక్ మంత్రివర్గం నిర్ణయించింది. నాటో దళాల దాడిపై చర్చించేందుకు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కోరారు. షంసి ఎయిర్‌బేస్‌ను ఖాళీ చేయడంతోపాటు అప్ఘానిస్థాన్‌కు నాటో ప్రధాన సరఫరా మార్గాలు రెండిం టిని మూసేయాలని పాక్ కోరుతోంది. షంసి ఎయిర్‌బేస్ ను వీడేందుకు పాక్ ప్రభుత్వం పెట్టిన 15 రోజుల గడువును పొడిగించాలన్న అభ్యర్థనను పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తోసిపుచ్చారు.

0 comments:
Post a Comment