మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమ యంలో వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడుతాం. కళ్లలో రక్తపు జీరలు ఉంటే వెంటనే తెలిసిపో తుంది. కనుక ఎదుటి వ్యక్తిలో మనం గమనించేది మొట్టమొదట ఈ లక్షణమే. వయస్సు పెరుగు తున్న కొద్దీ కళ్లు స్వచ్ఛమైన తెలుపును కోల్పోయి క్రమంగా రక్తపు జీరలను సంతరించుకుంటాయి. కోపం, ఉక్రోషం, తమకం వంటి అనేకానేక భావాలు కళ్లలో రక్తపు జీరలుగా ప్రతిఫలిస్తాయి. అలాగే అనేకానేక వ్యాధులు, పరిస్థితులు కళ్లను ఎర్రగా కనిపించేలా చేస్తాయి.
కళ్లలో ఎరుపుదనం కనిపించే విధానాన్నిబట్టి సమస్య ఏమిటనేది కొంత వరకూ ఊహించవచ్చు. ఉదాహరణకు కనురెప్పల కింద రక్తనాళాలు వాచి స్రావయుక్తంగా ఉంటే నేత్రాభిష్యందం (కంజెం క్టివైటిస్) వంటి ఇన్‌ఫెక్షన్లకూ, ఇన్‌ఫ్లమేషన్లకూ సూచన. అలా కాకుండా, కంటిలోని కృష్ణ పటలం (ఐరిస్) చుట్టూ రక్తనాళాలు ఉబ్బిపోయి, నొప్పిని, దృష్టి సమస్యలను కలిగిస్తుంటే కంటిపైన పారద ర్శకంగా ఉండే కార్నియా పొరకు ఇన్‌ఫ్లమేషన్ వచ్చినట్లుగా లేదా కంటిలోపలి నిర్మాణాలు వ్యాధి గ్రస్తమైనట్లుగా అర్థం చేసుకోవాలి. కంటి ఎరుప ుదనానికి, రక్తపు జీరలకు వెనుక ఉన్న ఇలాంటి ఆకరణాలను శోధించేందుకు ఈ కింది ప్రశ్నలు తోడ్పడుతాయి.
ఎరుపుదనం కనురెప్పల కింద ఉందా?
కన్ను అంతా ఎర్రగా కనిపించడంతోపాటు కను రెప్పను లాగి దాని కింద చూస్తే ఒకవేళ మరింత ఎర్రగా కనిపిస్తే అది నేత్రాభిష్యందానికి సూచన. ఎలర్జీ, ఇన్‌ఫెక్షన్లు నేత్రాభిష్యందాన్ని కలిగిస్తాయి.
చీము, స్రావాలు ప్రధానంగా ఉంటే ఇన్‌ఫెక్షన్ గానూ, కేవలం దుర, మెరమెరలాడటం ఉంటే ఎలర్జీగానూ అర్థం చేసుకోవాలి. నేత్రాభిష్యందం ఉన్నప్పుడు తలారాస్నానం చేయడం, తాంబూలం సేవించడం నిషిద్ధం. ఉదయంపూట జలనేతి, రాత్రిపూట చల్లటి నీళ్లు తాగడం చేయాలి. అప్పుడే తీసిన వెన్న కంటికి చాలా మంచిది. త్రిఫలాలు, అభ్రకభస్మం, స్వార్ణమాక్టీక భస్మాలను తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల నేత్రాభిష్యందాలు తగ్గు తాయి. బాహ్యప్రయోగంగా ఆయుర్వేదంలో సేకం, ఆశ్చ్యోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అనే క్రియా కల్పాలు ఉన్నాయి. వీటిని అవసరానుసారం చేయాలి.
కన్ను హఠాత్తుగా ఎర్రగా మారిందా?
కంటిపైన పలుచగా, పారదర్శకంగా పరుచుకుని ఉండే కంజెంక్టైవా పొర కింద రక్తస్రావం జరిగితే (సబ్ కంజెక్టైవల్ హెమరేజ్) కళ్లు రక్తం ఓడుతు న్నట్లు ఎర్రగా కనిపిస్తాయి. కంటి ఉపరితలంపైన ఏ చిన్నపాటి దెబ్బ తగిలినా, ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళం చిట్లి రక్తం చుట్టుప్రక్కల ప్రదేశానికి విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి కంటిని బలంగా నలు ముకున్న తరువాత ఇలా జరిగే అవకాశం ఉంది.
కంటి వెలుపలి పొరల్లో పరచుకున్న ఈ రక్తం చర్మంలో కముకు దెబ్బల వలన ఏర్పడే నీలం రంగు మచ్చల్లా కాకుండా, స్వచ్ఛమైన ఎరుపు దనంతో, టొమాటో రంగులో కనిపించడానిక బైటి వాతావరణానికి దగ్గరగా ఉండి, ఆక్సీకరణం చెంద టమే. దెబ్బలు, ఒత్తిళ్ల వల్ల ఏర్పడే ఈ ఎరుపుదనం తగ్గిపోయి కన్ను మామూలు స్థితికి రావడానికి రెండు మూడు వారాలు పడుతుంది.
కృష్ణపటలంచుట్టూ ఎరుపుదనం కనిపిస్తున్నదా?
కంటిలోపల ఇన్‌ఫ్లమేషన్ వలన కాని, కంటి లోపలి ద్రవాల్లో ఒత్తిడి పెరిగిపోవడం వలన కానీ, స్వచ్ఛపటలం (కార్నియా) వ్యాధిగ్రస్తమవడం వలన కాని ఇటువంటి ఎరుపు ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలకు త్రిఫలాగుగ్గులు, సప్తామృతలోహం వంటి మందులు పని చేస్తాయి.
కంట్లో మెరమెరలాడుతుంటుందా?
ధూళి కణాలు కంటిలో పడినప్పుడు కంటిలోని సున్నితమైన భాగాలు ప్రతిస్పందించి ఎరుపుద నాన్ని, కన్నీళ్లను కలిగిస్తాయి. స్రావాల కారణంగా కంటిలోని నలుసులు పల్చబడి బైటకు వెళ్లిపోవడం కోసం ఇలా జరుగుతుంది. ఒకవేళ ధూళి కణాలు బైటకు వెళ్లిపోకుండా, కంట్లో అలాగే ఉండిపోతే స్వచ్ఛమైన త్రిఫల కషాయాన్ని కంటిలో చిమ్మిచ్చి కొట్టాలి. అయినప్పటికీ, కంటిలోని నలుసు అలాగే ఉండిపోతే ఏదైనా సన్నటి గాజు కడ్డీవంటి దానిని కనురెప్పఐన పెట్టి కనురెప్పలను పట్టుకుని గాజు కడ్డీ ఆధారంగా తిప్పాలి. తరువాత కంటిలోని నలుసును బట్టతో తొలగించాలి.
కన్ను ఎర్రగా ఉండటం, నొప్పి ఉన్నాయా?
నొప్పి అనేది ఇన్‌ఫెక్షన్‌కూ, ఇన్‌ఫ్లమేషన్‌కూ సూచన. కంట్లో నలుసులు పడటం, స్వచ్ఛపటలం వ్యాధిగ్రస్తం కావటం, కన్నులోపలి భాగం ఇన్‌ఫ్లేమ్ కావడం, కంటిలోపల వత్తిడి పెరగడం తదితర స్థానిక కారణాలే కాకుండా, మధుమేహం, రుమ టాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎర్తిమా టోసిస్‌ి వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల వలన కంటిలో ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో కారణానుగుణమైన చికిత్స చేయాలి.
కంటి ఎరుపుదనంతోపాటు చూపు కూడా దెబ్బ తింటున్నదా?
కంజెంక్టివైటిస్ వలన తాత్కాలికంగా దృష్టిలో మసగదనం ఏర్పడితే కెరటైటిస్, హెర్పిస్ ఇన్‌ఫెక్షన్ల వలన ఎరుపుదనమే కాకుండా, కంటి చూపు సైతం దెబ్బ తినే వీలుంది. దీనికి తక్షణమే చికిత్స చేయాల్సి ఉంటుంది.
కంటిపాప ఆకారంలో కాని, పరిమాణంలో కానీ మార్పు కనిపిస్తోందా?
నేత్రాభిష్యందంలో కంటిపాప సైజులో ఏ విధమైన మార్పు ఉండదు. అయితే కెరటైటిస్, ఐరైటిస్ వ్యాధుల్లోనూ, కంటిలో నలక పడిన సందర్భాల్లోనూ కంటిపాప సైజు మారిపోతుంది. కంటిపాప ఆకృతి మారినప్పుడు సత్వ రమే చికిత్సకు ఉపక్రమించాల్సి ఉంటుంది.
కంటిని ముట్టుకుంటే నొప్పిగా ఉంటుందా?
నేత్రాభిష్యందం వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల్లో కన్ను సున్నితంగా మారి పైవైపున ఏ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేనట్లుగా తయారవుతుంది. కంటిలోపల ద్రవం పేరుకుపోయి ఒత్తిడి పెరగడం (గ్లకోమా) జరిగితే కన్ను గుడ్డు మొత్తం నొప్పిగా ఉంటుంది. దీనిలో క్రమంగా కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే సమస్య హఠాత్తుగా సంభవిస్తే, ఎక్యూట్ గ్లకోమాగా అర్థం చేసుకోవాలి. దీనిలో తీవ్రమైన నొప్పి, ఎరుపుదనం ఉంటాయి. హస్తస్వేదం, ఆశ్చ్యోతనం వంటి క్రియా కల్పాలతో కంటిలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించవచ్చు.

0 comments:
Post a Comment