Saturday

కృత్రిమ వీర్యకణాల సృష్టి ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం బీజకణాల నుంచి వీర్యం ఉత్పత్తి

ప్రయోగశాలలో అద్భుత ఆవిష్కరణ
వంధ్యత్వానికి పరిష్కారం దిశగా ముందడుగు
జర్మన్ శాస్త్రవేత్తల విస్తృత పరిశోధనలు

లండన్, జనవరి 6: వైద్య శాస్త్రంలో మరో విప్లవాత్మక ఆవిష్కరణ! ప్రయోగశాలలో కృత్రిమ వీర్యకణాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఎ లుకలపై జరిపిన పరిశోధనలతో ఇది సాధ్యమైంది. ఇక మానవ వీర్యకణాల ఉత్పత్తే తరువాయి! ఇప్పటికే అండాలను ప్రయోగశాలల్లో అభివృద్ధి పరుస్తూ ఫలదీకరణం చేస్తున్న తరుణంలో కృత్రిమ వీర్య కణాల సృష్టి కూడా సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు.

దీంతో వంధ్యత్వం ఉన్న పురుషులు కూడా తండ్రి కావచ్చు! ఎలుకల కృత్రిమ వీర్యకణాలను ప్రయోగశాలలో తయారుచేసినట్లు జర్మనీలోని మ్యూన్‌స్టెర్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. ప్రొఫెసర్ స్టెఫాన్ శ్లాట్ నేతృత్వంలోని అధ్యయన బృందం ఈ ఘనత సాధించింది. ఎలుకల వృషణాల్లోని బీజకణాలను ఉపయోగించి వీర్యకణాలకు పరిశోధకులు ప్రాణం పోశారు.

ఎలా చేశారు?
ముందుగా వృషణాల్లో ఉండే వాతావరణాన్ని ప్రయోగశాలలో సృష్టించారు. ఇందుకోసం వీర్యకణాలు పెరగడానికి అనుకూలంగా ఉండే ఓ ప్రత్యేక మిశ్రమాన్ని అభివృద్ధిపరిచారు. దీన్నే 'అగర్ జెల్లీ' అంటారు. వృషణాల్లో కూడా ఇలాంటిదే ఉంటుంది. 'బుజ్జి ఎలుకను సృష్టించే సామర్థ్యమున్న వీర్యకణాలను మేం ఉత్పత్తి చేయగలిగాం. అవి ఆరోగ్యంగా ఉన్నాయి.

జన్యుపరంగా కూడా వాటిలో ఎలాంటి లోపాలు లేవు. మానవ వీర్యకణాలను కూడా ఇలాగే ఉత్పత్తి చేయవచ్చని విశ్వసిస్తున్నాం. వృషణాల్లోని బీజ కణాలుండే కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో వీర్యకణాలను సృష్టించవచ్చు' అని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. 'ఎలుకలపై చేసిన ప్రయోగాలనే మానవ కణాలపై కూడా చేశాం. అయితే ప్రస్తుతానికి విజయం సాధించలేకపోయాం.

ఒక క్షీరదంలో ఇది సాధ్యమైనప్పుడు మనుషులపై కూడా సాధ్యమే. బీజకణాలు వీర్యంగా మారడానికి అనుకూలంగా ఉండే మిశ్రమం కోసం ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాం' అని వివరించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల వివరా లు 'ఏషియన్ జర్నల్ ఆఫ్ ఆండ్రాలజీ'లో ప్రచురితమయ్యాయి. 'మా నవ దేహం వెలుపల వీర్యకణాల సృష్టి దిశగా తొలి అడుగు పడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు' అని ఈ వ్యాసం పేర్కొంది.

దీని ప్రభావమెంత?
ఈ ప్రయోగ ఫలితాలపై అంతర్జాతీయంగా వైద్య నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. కృత్రిమ వీర్యకణాల ఉత్పత్తి దిశగా శాస్త్రవేత్తల ప్రయత్నాలను స్వాగతిస్తున్నారు. 'ఇది అద్భుత ఆవిష్కరణ. విప్లవాత్మక చికిత్సకు దారితీస్తుంది. వంధ్యత్వానికి పూర్తి పరిష్కారం లభిస్తుంది. ప్రతి పురుషుడు తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది.

ఎలుకలపై ప్రయోగాలతో ఆ మార్గం లభించినట్లే' అని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త రిచర్డ్ షార్ప్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ వీర్యకణా ల సృష్టి సాకారమైతే.. ఇక స్త్రీ, పురుషుల ప్రమేయం లేకుండానే చిన్నారులు కళ్లు తెరుస్తారేమో!

0 comments:

Post a Comment