Saturday

కళ్లలోనూ మూలకణాలు రెటీనా కింద దాగిన స్టెమ్ సెల్స్ గుర్తింపు


కంటిలోనూ మూల కణాలు(స్టెమ్ సెల్స్) ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరంలో దెబ్బతిన్న కండరాలను వీటితో పునరుత్పత్తి చేయవచ్చ ని, తీవ్ర కంటి జబ్బులకు కూడా చికిత్స సాధ్యమవుతుందని పరిశోధకులు అంటున్నా రు. న్యూయార్క్‌లోని 'న్యూరల్ స్టెమ్ సెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీజెనరేటివ్ రీసెర్చ్ ఫౌం డేషన్' నిపుణులు ఈ అధ్యయనం చేశారు.

కంటిలోని రెటీనా కింద ప్రత్యేక కణాలుం డే 'ఆర్‌పీఈ' పొరలో మూలకణాలు ఉన్నట్లు గుర్తించారు. రెటీనా పనిచేయడానికి ఆర్‌పీఈ దోహదపడుతుంది. కొన్ని వ్యాధులు ఈ ఆర్‌పీఈని దెబ్బతీస్తాయి. దీంతో రెటీనా నిర్జీవమై కంటిచూపు పోతుంది. అయితే.. మూలకణాలను ఉపయోగించుకుని అలాంటి జబ్బులను కళ్లు వాటికవే నయం చేసుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ కణాలను ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తున్నామని, వాటి ఆధారంగా జబ్బులను నయం చేసే దిశగా పరిశోధన కొనసాగిస్తున్నామన్నారు.

0 comments:

Post a Comment