Wednesday

థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు


థైరాయిడ్‌ గ్రంథిలో ఒకటే బుడిపె పెరిగిన ప్పుడు అది సాధారణ నాడ్యూల్‌ గాయిటరా? లేక థైరాయిడ్‌ కేన్సరా? అనే ప్రశ్న ఉత్పన్నమవు తుంది. మామూలుగా థైరాయిడ్‌ గ్రంథి మీద ఒకటే బుడిపె (నాడ్యూల్‌) పెరిగినప్పుడు దానిని సాలిటరీ నాడ్యూల్‌ అంటారు. ఈ సాలిటరీ నాడ్యూల్‌ను రెండు విధాలుగా పరిగణించవచ్చు.
సాలిటరీ నాడ్యూల్‌ కేన్సర్‌ సంబంధిత నాడ్యూల్‌ కాగా, సాలిటరీ నాడ్యూల్‌  మెత్తగా, కొంచెం గట్టిగా ఉండి కదిలించినప్పుడు అటూ ఇటూ కదులుతుంది. అటువంటప్పుడు అది బినైన్‌ నాడ్యూల్‌ అయి ఉండి, భవిష్యత్తులో కేన్సర్‌గా మారే అవకాశమున్నది.
కనుక థైరాయిడ్‌ స్థితిని పరీక్ష చేసి, రక్త పరీ క్షలు, థైరాయిడ్‌ స్కాన్‌ (అల్ట్రాసౌండ్‌, సెలినియం స్కాన్‌) అవసరమైతే ఎక్సిషన్‌ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధికి గురైన వారిని మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది.
1) హాట్‌ నాడ్యూల్‌: హైపర్‌ థైరాయిడిజం ఉండి, వేడి కంతి (హాట్‌ నాడ్యూల్‌) ఉన్నప్పుడు దానిని టాక్సిక్‌ అడినోమా అంటారు. దీనిని శస్త్రచికిత్స ద్వారా తీసివేయడం జరుగుతుంది. లేదా రేడియో అయోడిన్‌ ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. ఈ నాడ్యూల్‌ కేన్సర్‌ సంబంధిత వ్యాధి కాదు.
2) నార్మల్‌ థైరాయిడ్‌ గ్రంథి : వెచ్చని చురుకైన కంతి (వార్మ్‌ యాక్టివ్‌ నాడ్యూల్‌) ఉన్నట్లయితే దానిని ఫంక్షనింగ్‌ అడినోమా అంటారు. దీనిని శస్త్రచికిత్స ద్వారా తీసివేయడం జరుగుతుంది.
3) నార్మల్‌ థైరాయిడ్‌ గ్రంథి : ఇలా ఉండి, శీతల కంతి (కోల్డ్‌ నాడ్యూల్‌) ఉన్నప్పుడు దానిని బినైన్‌ థైరాయిడ్‌ ట్యూమర్‌ అంటారు. దీనిని శస్త్రచికిత్స ద్వారా తీసివేసి, రోగిని నిర్ణీత కాల వ్యవధుల్లో పరీ క్షిస్తూ ఉండాలి. ఎందు కంటే ఇటువంటి కంతులు భవిష్యత్తులో కేన్సర్‌గా మారే అవకాశాలున్నాయి.
పరీక్షలు
ఎఫ్‌ఎన్‌ఎసి, థైరాయిడ్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సెలీనియంస్కాన్‌, అవసరమైతే ఎక్సిషన్‌ బయాప్సీ
రెట్రోస్టెర్నల్‌ గాయిటర్‌
కొన్ని సందర్భాలలో థైరాయిడ్‌ గ్రంథి కణజాలం రొమ్ము వెనుక భాగంలో ఉంటుంది. ఈ కణజాలం పెరిగినప్పుడు లేదా మామూలు స్థానంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి కింది భాగంలో పెరిగి పెద్దదై, అది రొమ్ము ఎముక వెనుక భాగంలోకి చొచ్చుకొని పోయినప్పుడు దానిని రెట్రోస్టెర్నల్‌ గాయిటర్‌ అంటారు. ఈ రెట్రోస్టెర్నల్‌ గాయిటర్‌ రొమ్ము వెనుక భాగంలో మెడలోకి చొచ్చుకొనిపోయి, లేదా రొమ్ము గూడులోకి వ్యాపించి ఉండవచ్చు.
ఈ రకమైన గాయిటర్‌ టాక్సిక్‌ గాయిటర్‌ లేదా కేన్సర్‌అయినాకావచ్చు.
వ్యాధి లక్షణాలు
1. ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు.
2. వత్తిడి వలన వచ్చే లక్షణాలు. దీనిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.
అ) ఆయాసము : సాధారణంగా రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు ఆయాసం వస్తుంది. దీనితోపాటు దగ్గు, గొంతులో గట్టి శబ్దం రావడం జరుగుతుంది.
ఆ) మెడ ఛాతీ మీద సిరలు లావెక్కడంవంటి లక్షణాలు వ్యాధి తీవ్రస్థాయిలో కనిపిస్తాయి.
ఇ) మాట రాకపోవడం
ఈ) మింగడానికి కష్టం కావడం
పరీక్షలు
వ్యాధి నిర్ధారించడానికి ఛాతి ఎక్స్‌ రేలు, రక్త పరీక్షలు, అయోడిన్‌ 131 స్కాన్‌, అవసరమైతే ఛాతీకి సిటి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.
చికిత్స:
ఆపరేషన్‌ ద్వారా ఈ గాయిటర్‌కు చికిత్స చేయడం జరుగుతుంది. కారణాన్నిబట్టి అనుబంధ చికిత్సలు ఆధార పడి ఉంటాయి.
స్త్రీలలో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, గర్భం దాల్చడానికి ముందే హైపోథైరాయిడిజాన్ని అదు పులో ఉంచుకోవాలి. లేకపోతే గర్భస్థ శిశువు నరాల కణజాల పెరుగుదల తగ్గిపోతుంది.
హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న స్త్రీ గర్భం దాల్చినట్లు నిర్ధారణ కాగానే వెంటనే టి4, టిఎస్‌హెచ్‌ పరీక్షలు చేయించుకోవాలి. తరువాత మూడేసి నెలలకు (రెండవ, మూడవ ట్రైమిస్ట ర్స్‌లో) ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలి. హైపోథైరాయిడ్‌ స్త్రీ గర్భిణీ అయినప్పుడు థైరా క్సిన్‌ మాత్రల మోతాదు పెంచి, ప్రసవం తరువాత మాత్రల మోతాదు తగ్గించడం జరగుతుంది. కనుక గర్భిణీలైన హైపోథైరాయిడ్‌ స్త్రీలు క్రమం తప్ప కుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
శస్త్ర చికిత్సలు
హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్న రోగికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా హైపోథైరాయిడిజంను మాత్రలతో నియంత్రణలోకి తీసుకువచ్చి శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది.
పెద్దవారిలో ముఖ్యంగా గుండెజబ్బుతో (కరొనరీ ఆర్టరీ డిసీజ్‌) బాధపడుతున్న వారిలో హైపోథై రాయిడిజం ఉన్నట్లయితే థైరాక్సిన్‌ మాత్రలను తక్కువ మోతాదులో ప్రారంభించి, మోతాదు పెంచుతూ, కావలసిన మోతాదును టిఎస్‌హెచ్‌, టి4 రక్త పరీక్షల ద్వారా నియంత్రిస్తారు.
మిక్సిడిమా కోమా
మిక్సిడిమాకోమా అనే వ్యాధి థైరా యిడ్‌ గ్రంథి వ్యాధి వలన వచ్చే ప్రమాదకర పరిస్థితి. రోగికి ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినాకూడా మరణాల సంఖ్య చాలా ఎక్కువే.
కారణాలు
హైపో థైరాయిడ్‌ వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం దీనికి ఒక ప్రధాన కారణం.
హైపోథైరాయిడ్‌ వ్యాధిగ్రస్తులు ఈ కింద పేర్కొన్న రోగాలతో బాధపడుతున్నప్పుడు -
న్యుమోనియా, కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌, గుండెపోటు, పక్షవాతం వచ్చినప్పుడు, ప్రేవుల నుంచి రక్త స్రావం జరుగుతున్నప్పుడు, అమిత మైన చలికి గురైనప్పుడు, శరీరంలో సెప్సిస్‌ ఉన్న ప్పుడు, మత్తు మందులు, డిప్రెషన్‌కు వాడే మందులు, అనస్తీషియా మందులు
వ్యాధి లక్షణాలు
హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న పెద్దవా రిలో సాధారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వీరిలో మెదడు మందగించి, గందరగోళానికి గురై, స్పృహ కోల్పోయి కోమాకు లోనవుతారు. కొంత మందిలో ఫిట్స్‌కూడా రావచ్చు.
శరీరంలోని వేడిమితగ్గి మనిషి చల్లబడతాడు. హైపోథైరాయిడిజం వ్యాధితో వచ్చే లక్షణాలన్నీ వీరిలో కూడా ఉంటాయి. శ్వాస సరిగ్గా తీసుకోలేక పోవడంతో హైపాక్సియా హైపర్‌ కాప్నియాలకు గురవుతారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లోఉంచి లివోథైరాగ్జిన్‌లాంటి మందులతోనూ, ఇతర మందులతోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది.


0 comments:

Post a Comment