Monday

క్రమబద్ధమైన జీవన విధానం

యోగావలన బరువు తగ్గడం అనేది కేవలం చిన్న ఉపయోగం మాత్రమే. శరీరం అంతరంగా కలిగే ఉపయోగాలే ఎక్కువ. ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవరుస్తుంది. ప్రశాంతతకు మనసును ట్యూన్ చేస్తుంది. పాజిటివ్‌గా చూడగలిగే శక్తినిస్తుంది.

మత్స్యాసనం 
సంస్కృతంలో మత్స అనగా చేప. ఆ ఆకారంలో ఉన్నందున ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది.

పద్ధతి :పద్మాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా చేతులను ఒకదానికి తరువాత ఒకటి లేపి మోచేతుల వద్ద మడిచి భుజాల క్రిందుగా ఆన్చాలి. గాలి పీల్చుకుని తల, భుజాలు వెనుకవైపుగా తీసుకెళ్లి తల మాడుభాగం భూమి మీద ఆనేటట్లుగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను ముందుకు తీసుకువచ్చి రెండు పాదాల బొటనవేళ్లు పట్టుకోవాలి. ఛాతి మధ్య భాగంలో ఉండే అనాహత చక్రం వద్ద దృష్టి ఉంచాలి. కళ్లు మూసుకుని సాధారణంగా శ్వాస తీసుకోవాలి. ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి.

ఉపయోగాలు : వెన్నెముకను దృఢ పరుస్తుంది.
ఊపిరితిత్తులకు, మెదడుకు రక్త ప్రసరణఎక్కువ జరిగేలా చేస్తుంది.
థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది.
ఆస్త్మా, డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.
జాగ్రత్తలు :రక్తపోటు, మెడనొప్పి ఉన్నవారు చేయకూడదు.


శశాంకాసనం
కుందేలును పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది. అధిక కోపాన్ని నివాస్తుంది.

పద్ధతి :ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు పైకి చాచాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని, గాలి వదులుతూ ముందుకు వంగాలి. రెండు చేతులూ మోచేతుల వరకూ భూమి మీద ఆనేటట్లు ఉంచాలి. నుదురు భూమి మీద ఆన్చాలి. ఇదే స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు : అడ్రినల్ గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది.
పొట్ట భాగంలో కొవ్వు తగ్గిస్తుంది.
ఆయాసము మొదలయ్యే సమయంలో ఈ ఆసనం చేస్తే ఆస్త్మా ఎటాక్‌ను ఆపవచ్చు.
మనసును శాంతపరుస్తుంది.



మండూకాసనం 

పద్ధతి :ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతుల పిడికిళ్లను బిగించి బొడ్డు కిరుపక్కల ఉంచాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని మొత్తము గాలిని వదిలివేసి పొట్ట లోపలికి లాగి పట్టి ఉంచి ముందుకు వంగాలి. తల పైకి తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి నెమ్మదిగా గాలి పీలుస్తూ యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు :డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.
జీర్ణ సంబంధమైన బాధలను తగ్గిస్తుంది.
జాగ్రత్తలు :హెర్నియా ఉన్నవారు చేయకూడదు.


మార్జాలాసనం 
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తరువాత రెండు చేతులను భూమి మీద ఆన్చాలి. అరచేతులు, భుజాలకు, మోకాళ్లు నడుముకు సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని కుడిచేతిని ముందుకు చాచాలి. ఎడమకాలిని క్లాక్ వైజ్ రొటేట్ చేసి వెనుకకు పైకి ఎత్తాలి. యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి మళ్లీ పైకి ఎత్తాలి. 5 సెకన్లపాటు ఈ స్థితిలో ఉండాలి. ఇలా ఆరు సార్లు చేయాలి. కుడికాలితో కూడా క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్ మొత్తం పన్నెండు సార్లు పూర్తి చేయాలి.

ఉపయోగాలు : చేతులు, కాళ్లు దృఢంగా తయారవుతాయి.
వెన్నెముకకు సంబంధించిన నరాలు అన్నీ ఉత్తేజితమవుతాయి.

0 comments:

Post a Comment